kasala buchi reddy
-
కారెక్కిన కాసాల బుచ్చిరెడ్డి
సాక్షి, సంగారెడ్డి జోన్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాల బుచ్చిరెడ్డి శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్, సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, గ్రంథా లయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి కాసాల బుచ్చిరెడ్డి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లు పార్టీలో పని చేసి పార్టీని వీడడం బాధాకరంగా ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సహాయం, సేవ చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్వతహాగా రైతుబిడ్డనైన తనను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగుకు పెట్టుబడి సాయం, రైతుబంధు పథకం, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటివి ఆకట్టుకున్నాయన్నారు. ప్రశ్నార్థకమవుతున్న కులవృత్తులను ప్రోత్సహించి వాటి మనుగడ కోసం టీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ గెలుపు కోసం తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, మంత్రి హరీశ్‌రావు ఏ పని అప్పగించినా ఉమ్మడి జిల్లాలో చేయడానికి సిద్ధంగా తరువాయిఉన్నట్లు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. బుచ్చిరెడ్డి చేరికతో పార్టీలో బలం పెరిగిందని అన్నారు. నమ్మకంతో పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుం దన్నారు. ఉమ్మడి జిల్లాలో పని చేసిన అనుభవం ఉండడంతో బుచ్చిరెడ్డి సేవలను వినియోగించుకుంటామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుచ్చిరెడ్డితోపాటు పార్టీలో చేరిన వారిలో విజయలక్ష్మి, చంద్రారెడ్డి, కృష్ణ, శమంత, విష్ణువర్థన్, ఉమారాణి, కవిత, మదుసూదన్, సుధీర్‌రెడ్డి, సాయికృష్ణ, బాబు, అశోక్, చారి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 62వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు పలికారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేసి తాను చేతల మనిషినని సీఎం నిరూపించుకోవాలన్నారు. మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఈ ప్రాంత చిరకాల వాంఛను పట్టించుకోకపొవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ గడ్డం శ్రీనివాస్, జిల్లా సాధన సమితి అధ్యక్షులు మల్కాజి సత్యనారాయణ, దమ్ము యాదగిరి, మామిళ్ళ ఆంజనేయులు, బక్కవారి శివ, పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
మెదక్ మున్సిపాలిటీ: మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం నింపిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు ప్రజలు బాగా స్పందించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయంగా ప్రజలు బీజేపీని చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు స్థానిక రాందాస్ చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు నల్లాల విజయ్, పట్టణ అధ్యక్షుడు గోదల క్రిష్ణ, ప్రధాన కార్యదర్శులు గుండు మల్లేశ్, కండెల సుధాకర్, మండల పార్టీ నాయకులు శ్రీపాల్, జనార్దన్, బక్కవారి శివ, తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో సంబురాలు సంగారెడ్డి క్రైం: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని, బాణ సంచా కాల్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మాట్లాడుతూ ఈ విజయం మోడీదేనన్నారు. పేదలకు మోడీ ప్రభుత్వం చేయూతనిస్తోందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజు, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బీజెవైఎం నాయకుడు యశ్వంత్, పట్టణ అధ్యక్షుడు వాసు, సుధీర్‌రెడ్డి, శ్రీపతిరావు, బుచ్చిబాబు, చంద్రయ్య, వెంకట్రామ్రెడ్డి, నరేష్, నాగరాజు పాల్గొన్నారు. -
మెడీసభ జన సమీకరణకు సన్నాహాలు
సంగారెడ్డి క్రైం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనాన్ని గురించి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వాడవాడలా విస్తృతంగా ప్రచారం చేస్తూ గడపగడపకూ తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తుల్జాపూర్లో ఆదివారం నిర్వహించనున్న నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఉమర్గా నియోజకవర్గం నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సి.అంజిరెడ్డి, మజ్దూర్ మోర్చా నాయకుడు ప్రతాప్‌రెడ్డిలు శనివారం ఉమర్గా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం తుల్జాపూర్లో జరిగే మోడీ సభకు పెద్ద ఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పథకాలను ప్రపంచ వ్యాప్తంగా పొగడుతున్నారని, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. -
మెదక్ ఎంపీ సీటును గెలుచుకుంటాం
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి - 22న అమిత్‌షాతో ముఖాముఖి సిద్దిపేట టౌన్: తెలంగాణ ఎవరి సొత్తు కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వీఏఆర్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెల వికాసం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఉప ఎన్నికలో మెదక్ ఎంపీ సీటును తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఈ నెల 22న పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో బీజేపీ నేతలతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. సమావేశంలో కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగరాంచంద్రారెడ్డి, చొప్పదండి విద్యాసాగర్, పార్టీ ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ గురువారెడ్డి, పార్టీ నేతలు గుండ్ల జనార్దన్, జిల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుసమస్యల పరిష్కారంలోనిర్లక్ష్యం తగదు గజ్వేల్: రైతు సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని కాసాల బుచ్చిరెడ్డి ఆరోపించారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన బీజేపీ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశం సంస్థ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రైతులకు రుణ మాఫీ చేస్తామని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించి, రెండు నెలలు గడుస్తున్నా రుణమాఫీ అమలుచేయలేదన్నారు. -
మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది
తూప్రాన్, న్యూస్‌లైన్: మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నేరవేరిందన్నారు. బీజేపీ వల్లే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. నాయకులు అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. కేవలం తమ ఆస్తులను కూడబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులతో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థిగా చాగన్ల నరేంద్రనాథ్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌లో ఇమడలేకపోయా: చాగన్ల కాంగ్రెస్ పార్టీ రౌడీల పార్టీ నరేన్ ట్రస్టు అధినేత, బీజేపీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ కోసం తన వంతు కృషి చేశానన్నారు. తన సొంత నిధులతో ప్రజా సేవ చేస్తుంటే కొందరు అది సహించేకపోయారన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డిని తనపైకి పురిగొల్పారన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుపడ్డారన్నారని, ఎమ్మెల్యే నర్సారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తూప్రాన్ వచ్చిన సందర్భంగా స్టేజీపైకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారన్నారు. ఈ విషయాన్ని సీఎం గమనించి తనను స్టేజీ పైకి పిలిపించారని గుర్తుచేశారు. దీంతో తాను కాంగ్రెస్‌లో ఇమడలేనని గ్రహించి ప్రజల అభీష్టం మేరకే బీజేపీలో చేరానని వివరించారు.