మెడీసభ జన సమీకరణకు సన్నాహాలు | gathering peoples for narendra modi sabha | Sakshi
Sakshi News home page

మెడీసభ జన సమీకరణకు సన్నాహాలు

Published Sun, Oct 12 2014 12:05 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మెడీసభ జన సమీకరణకు సన్నాహాలు - Sakshi

మెడీసభ జన సమీకరణకు సన్నాహాలు

సంగారెడ్డి క్రైం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనాన్ని గురించి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వాడవాడలా విస్తృతంగా ప్రచారం చేస్తూ గడపగడపకూ తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తుల్జాపూర్‌లో ఆదివారం నిర్వహించనున్న నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఉమర్గా నియోజకవర్గం నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బీజేపీ  జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సి.అంజిరెడ్డి, మజ్దూర్ మోర్చా నాయకుడు ప్రతాప్‌రెడ్డిలు శనివారం ఉమర్గా నియోజకవర్గంలో  విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆదివారం తుల్జాపూర్‌లో జరిగే మోడీ సభకు పెద్ద ఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పథకాలను ప్రపంచ వ్యాప్తంగా పొగడుతున్నారని, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement