హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి | first full fill the homies | Sakshi
Sakshi News home page

హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి

Dec 2 2014 11:04 PM | Updated on Mar 29 2019 9:24 PM

హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి - Sakshi

హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి డిమాండ్ చేశారు.

మెదక్ మున్సిపాలిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ  జిల్లా కేంద్ర సాధన సమితి చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 62వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు పలికారు.  మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేసి తాను చేతల మనిషినని సీఎం నిరూపించుకోవాలన్నారు.  

మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఈ ప్రాంత చిరకాల వాంఛను పట్టించుకోకపొవడం  సమంజసం కాదన్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ గడ్డం శ్రీనివాస్, జిల్లా సాధన సమితి అధ్యక్షులు మల్కాజి సత్యనారాయణ, దమ్ము యాదగిరి, మామిళ్ళ ఆంజనేయులు, బక్కవారి శివ, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement