‘ఈ ఎన్నికలో ఓడిస్తే సీఎం‌ వందమెట్లు దిగివస్తారు’ | MLA Jagga Reddy Talks In Press Meet Over Dubbaka Elections In Siddipet | Sakshi
Sakshi News home page

‘ఈ ఎన్నికలో ఓడిస్తే సీఎం‌ వందమెట్లు దిగివస్తారు’

Published Wed, Oct 21 2020 6:04 PM | Last Updated on Wed, Oct 21 2020 7:04 PM

MLA Jagga Reddy Talks In Press Meet Over Dubbaka Elections In Siddipet - Sakshi

సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ డబ్బు, పోలీసులను విచ్చలవిడిగా వాడుతుందని, కలెక్టర్‌ కూడా వారికే సపోర్టు కాబట్టి గెలిచినట్లుగా భావిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని, అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్‌ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు.

లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్‌, 12 శాతం రిజర్వేషన్‌లు, ఎస్సీలకు 12 రిజర్వేషన్‌లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్‌లో గెలిచినందుకు సీఎం కేసీఆర్‌ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యూనివర్శిటీ పిల్లలంతా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా దుబ్బాకలో పని చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడిస్తే సీఎం వంద మెట్లు దిగివస్తారని, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement