
విలేకరులతో మాట్లాడుతున్న సభ్యులు
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం పట్ల టీఆర్‌ఎస్ గల్ఫ్ ఓవర్సిస్ ప్రతినిధి ఆరిఫ్ సుల్తాన్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ , ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు.
సుధీర్ కమిషన్ సర్వే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. గల్ఫ్‌లోని బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని సౌదీ నిబంధనల మేరకు కొందరు సరస్వం కోల్పోయి తిరిగి స్వదేశం వస్తున్నారని వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించడంతో పాటు పునరావస చర్యలను చేపడుతుందన్నారు.
గల్ఫ్‌లో చిక్కుకోని స్వదేశం రావడానికి ఇబ్బందులు పడే వారి బంధువులు సహాయం కోసం సెల్ నం. 9849936993 , 7995905196 లో సంప్రదించాలన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో గల్ఫ్‌లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని భాదితులకు పూర్తి రక్షణతో స్వగ్రామాలకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు.