రక్తం సేకరణకు మార్గం సుగమం | Citrate phosphate dextrose adenine bags released to blood collections | Sakshi
Sakshi News home page

రక్తం సేకరణకు మార్గం సుగమం

Published Thu, Sep 4 2014 11:06 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తం సేకరణకు మార్గం సుగమం - Sakshi

రక్తం సేకరణకు మార్గం సుగమం

 సిద్దిపేట టౌన్:  సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తం సేకరించడానికి అవసరమైన సీపీడీఏ (సిట్రైట్ పాస్పెట్ డెక్స్‌ట్రోజ్ అడెనైన్) బ్యాగులు విడుదలయ్యాయి.  మంగళవారం ‘సాక్షి’లో ‘నిరుపయోగంగా బ్లడ్ బ్యాంక్’ శీర్షికన ప్రచురించిన వార్తకు జిల్లా వైద్యాధికారులు స్పందించారు.

బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఇవ్వడానికి దాతలు, రక్తం తీసుకోవడానికి బాధితులు వస్తున్నప్పటికీ రక్త సేకరణకు అవసరమైన సీపీడీఏ బ్యాగులు లేక పోవడంతో చాలా మంది నిరాశగా  వెనుదిరిగిపోతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, స్పందించిన అధికారులు సీపీడీఏ బ్యాగులను విడుదల చేశారు. దీంతో వైద్యాధికారులు, సిబ్బంది రక్త సేకరణను ప్రారంభించారు. గురువారం వాసవీక్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో ఈ బ్యాగులను వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement