ఫొటోగ్రఫీ డే, ఆగస్టు 19, సిద్దిపేట
- ఎన్నెన్నో వర్ణాలు.. ఎన్నెన్నో అనుభవాలు
- నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
సిద్దిపేట: ఒక్క చిత్రం వెయ్యి మాటల పెట్టు.. ఎన్నెన్నో వర్ణాల కనికట్టు.. కోటి భావాలను తెలిపే చక్కని చిత్రం.. ఒక మాటకంటే ఓ దృశ్యం ఎంతో కాలం గుర్తుండిపోతుంది. కరిగే కాలంలో పరుగెత్తే జీవనయానాన్ని వెనుతిరిగి చూసుకోవడానికి మిగిలే తీపిగుర్తులు. చిత్రం ఓ మధుర జ్ఞాపకం. ఓ మంచి ఫొటో ఆసక్తిని కనబరుస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది.
మారుతున్న రోజులకు, కరుగుతున్న కాలాలకు అనుగుణంగా పాత స్మృతులను నెమరు వేసుకోవడానికి అలాంటి ఫొటోగ్రఫీకి నేడు ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. ఆధునిక కాలంలో వీడియోలు, డిజిటల్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం చూస్తుంటే ఫొటోగ్రఫీకి సమాజంలో ఉన్న గుర్తింపు తెలుస్తోంది.
ఫొటోలో శక్తిసామర్థ్యాలను తెలియజేస్తూ వాటికి ఒక గౌరవ ప్రదమైన రోజును ఏర్పాటు చేశారు. అదే ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రాఫీ డే. 1830 య ఫ్రెంచి కళాకారుడు రసాయిన శాస్త్రవేత్త లూయిస్ జాక్వెస్ మాండే ఫోటోగ్రాఫీ అంశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. మధురమైన జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి ఆ ఫొటో ఎంతో ఉపయోగపడుతుంది.
అలాంటి దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను అద్భుతంగా తన కెమెరాలో సంబంధించారు సిద్దిపేట పట్టణానికి చెందిన దండె ప్రభుదాస్. ఈయన ఇటీవల ఓడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొండ్రుల జీవన విధానాలపై ఫోటోలుగా చిత్రీకరించారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయన తీసిన ఎన్నెన్నో..