కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత.. ఉద్యోగాలు నీటిమీద బుడగల్లా మారిపోయాయి. ఇప్పటికే లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో కూడా ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగష్టు నెలలో సుమారు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఇందులో ఇంటెల్, సిస్కో, ఐబీఎమ్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.
కంపెనీలు ఎదుర్కుంటున్న ఆర్థిక మాంద్యం.. ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. 2024లో ఇప్పటి వరకు సుమారు 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.
సెమీకండక్టర్ లీడర్.. 'ఇంటెల్' ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి 15000 ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఖర్చుల పెరుగుదల.. ఆదాయ వృద్ధి తగ్గడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తోందని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ పేర్కొన్నారు.
సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ వెల్లడించారు.
ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్
ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment