క్యాంప్‌కు ఎంపికైన ఎన్‌సీసీ విద్యార్థులు
సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ యూనిట్‌కు చెందిన ఆరుగురు విద్యార్ధులు ఆర్మీ అటాచ్‌మెంట్ క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్‌సీసీ అధికారి శ్రీనివాస్ వివరాలను సోమవారం వెల్లడించారు. 71వ ఇన్‌ప్రాట్రీ ఆర్మీ బ్రిగేడ్‌కు సంబందించిన క్యాంప్ ఆగష్టు 16 నుంచి 30వ తేది వరకు హైద్రాబాద్‌లో కొనసాగనుంది. ఈ క్యాంప్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బెటాలియన్‌లకు చెందిన ఎన్‌సీసీ విద్యార్ధులు ఆర్మీ జవాన్‌లతో కలిసి పక్షం రోజులు శిక్షణ పొందనున్నారు.
ఆర్మీ జవాన్‌ల జీవన విదానం అనుసరిస్తు వివిధ అంశాలపై శిక్షణ పొందనున్నారు. శిక్షణలో బాగంగా భారత సైన్యానికి సంబందించిన అంశాలను భోదించడమే కాకుండా డ్రీల్ , అయుద శిక్షణ , మిల్ర్టీపట్ల అధ్యాయనం , యుద్ద వ్యూహాలు, విపత్కర పరస్థితులను ఎదుర్కోనే విదానం దేశభక్తి, క్రమశిక్షణ, తదితర అంశాలను శిక్షణలో నేర్చుకోనున్నారు. ఈ క్యాంప్‌కు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్ధులు, విజేందర్, ఆరవింద్‌రెడ్డి, సుజయ్‌చంద్రా, రాజశేఖర్, సాయికిరణ్, స్వామిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌సీసీ ఆఫీసర్ శ్రీనివాస్‌లు అభినందించారు.