army camp
-
ఆర్మీ క్యాంపు పై ఆత్మాహుతి దాడి
-
టెర్రర్.. ట్రాన్స్ఫర్!
సాక్షి, జగిత్యాల: టెర్రరిస్టు లింకులపై విచారణలో భాగంగా జమ్మూకశ్మీర్ పోలీసులు జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు రావడం స్థానికంగా కలకలం రేపింది. మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్నను రెండు రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ జిల్లాలోని అర్నియా పట్టణంలో ఉన్న ఆర్మీ బేస్ క్యాంపులో కూలీగా పనిచేసే రాకేశ్‌కుమార్‌పై ఆర్మీ అంతర్గత సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో జనవరి 5న కేసు నమోదైంది. రాకేశ్‌ను జమ్మూ పోలీసులు అదే నెల 20న అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న బ్యాంకు ఖాతా నుంచి రాకేశ్‌కుమార్ ఖాతాకు ఫిబ్ర వరి 13న రూ.ఐదు వేలు, 25న రూ.4 వేల చొప్పున రెండు సార్లు నగదు జమ అయినట్లు గుర్తించారు. విచారణ నిమిత్తం సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న జమ్మూ పోలీసుల బృందం లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. లింగన్న బావ శ్రీనివాస్‌ది మల్లాపూర్ మండలం మొగిలిపేట శ్రీనివాస్ పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడ తనకు తెలిసిన ఓ పాక్ మిత్రుడు డబ్బు అవసరమని కోరితే శ్రీనివాస్ విన్నపం మేరకు లింగన్న తేజ్ యాప్ ద్వారా రెండుసార్లు డబ్బులు పంపినట్లు లింగన్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హానీట్రాప్ కలకలం జమ్మూ జిల్లాలోని అర్నియా ఆర్మీ క్యాంపు సమీపంలోని పావల్‌కు చెందిన రాకేశ్‌కుమార్ ఆర్మీ శిబిరంలోనే కూలీ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనితజెట్టి అనే మహిళ రాకేశ్‌కుమార్‌తో ఫేస్బుక్లో పరిచయం అయినట్లు తెలుస్తోంది. తనకు తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకున్న అనితజెట్టి వృత్తిరీత్యా ఆర్మీకి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరడంతోపాటు డబ్బు ఆశ చూపినట్లు సమాచారం. ఆమె ట్రాప్‌లో పడ్డ రాకేశ్‌కుమార్.. ఆర్మీక్యాంపు ప్రాంతంలో ఉన్న ఎత్తయిన ప్రాంతాలు, వాటర్ ట్యాంకులు, రైల్వేలైన్లు, రోడ్లు తదితర కీలక సమాచారం, ఫొటోలను ఫేస్బుక్ ద్వారా అనితజెట్టికి పంపడంతోపాటు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ సాగుతోంది: ఎస్ఐ ఆర్మీ క్యాంపు సమాచారం ఇతరులకు చేరవేసినందుకు జనవరి 5న రాకేశ్‌కుమార్‌పై జమ్మూలోని అర్నియాలో కేసు నమోదైంది. రాకేశ్‌కుమార్ బ్యాంకు ఖాతాకు మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన లింగన్న ఖాతా నుంచి రెండుసార్లు నగదు జమైనట్లు తేలడంతో జమ్మూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. –రవీందర్, ఎస్సై, మల్లాపూర్) -
ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఓ జవాను, మరో పౌరుడు మరణించారు. ఆదివారం రాత్రి కాకపోరాలోని 50వ రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేశారని, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. జవాన్లు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మిలాల్ అహ్మద్ అనే మరో పౌరుడు గాయపడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు. మరోవైపు, కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మిలిటెంట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. -
కూలిన విమానం.. 257 మంది మృతి
-
257 మంది దుర్మరణం
అల్జీర్స్: ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు తరలివచ్చాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని అల్జీరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే. ప్రమాదంపై అల్జీరియా రక్షణ శాఖ ప్రకటన చేస్తూ.. ‘మొత్తం 247 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అహ్మద్ సలాహ్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం దక్షిణ అల్జీరియాలోని బౌఫరిక్ నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మధ్యలో టిన్డౌఫ్లో విమానం ఆగాల్సి ఉంది. పశ్చిమ సహారా ప్రాంతం ప్రస్తుతం మొరాకో అధీనంలో ఉండగా.. దాని స్వాతంత్య్ర పోరాటానికి అల్జీరియా మద్దతిస్తోంది. 300 మంది అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విమానమే మంటల్లో కాలిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం రష్యాలో తయారైంది. గతంలోనూ.. గత ఆరేళ్లలో అల్జీరియాలో అనేక సైనిక, పౌర విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. డిసెంబర్ 2012న రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2014న టమన్రస్సెట్ నుంచి కాన్స్టాంటిన్కు ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న సీ–130 హెర్క్యులస్ ఆర్మీ విమానం కూలడంతో 77 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో రక్షణ శాఖ ప్రకటించింది. జూలై, 2014న బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వెళ్తున్న ఎయిర్ అల్జేరీ విమానం ఉత్తర మాలిలో కూలిపోవడంతో 116 మంది మరణించారు. వీరిలో 54 మంది ఫ్రెంచ్ జాతీయులున్నారు. -
ఆర్మీ శిబిరానికి ఆమె తండ్రి పేరు
భారత్, చైనా సరిహద్దుల్లో.. కొన్ని వేల అడుగుల ఎత్తులో.. అంతకంటే ఎత్తుకి సమున్నతంగా ఎదిగిన తన తండ్రి గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ ఆర్మీ ఆఫీసర్ ఆనందానికి అవధులే లేవు. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఒక యువ లేడీ లెఫ్ట్‌నెంట్ ఇటీవల తవాంగ్ సెక్టార్లో బాధ్యతలు స్వీకరించింది. విధి నిర్వహణలో భాగంగా సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న కైఫోకు చేరుకుంది. అక్కడ ఒక ఆర్మీ శిబిరానికి ఆశిష్ టాప్ అని పేరు ఉండడం గమనించింది. సహజ సిద్ధమైన ఆసక్తితో అక్కడే విధుల్లో ఉన్న సైనికుల్ని ఆశిష్ అంటే ఎవరని ప్రశ్నించింది. వారిచ్చిన సమాధానం ఆమెకు నోట మాట రాకుండా చేసింది. ఆ ఆశిష్ ఎవరో కాదు. ఆమె కన్నతండ్రి. అసోం రెజిమెంట్‌లో ఆశిష్ దాస్ కల్నల్‌గా రిటైరయ్యారు. ఒక కల్నల్‌గా తన తండ్రి ఏ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకున్న ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన కుటుంబానికి చెందిన ఒక రహస్యం తెలుసుకొని సంభ్రమాశ్చర్యానికి లోనైంది. ఆ లేడీ ఆఫీసర్ భావసంచలనాన్ని గమనించిన ఆర్మీ సిబ్బంది ఆమె తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఏకంగా ఆర్మీ శిబిరానికే ఒక అధికారి పేరు పెట్టారంటే అదేమీ ఆషామాషీ విషయం కాదు. చైనా కుటిల బుద్ధిని ఆశిష్ దాస్ ఎలా తిప్పికొట్టారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1986 లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ వెంబడి మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్డ్రోంగ్ చూ లోయలో హెలిపాడ్లు, ఇతర శాశ్వత నిర్మాణాలకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిని అడ్డుకోవడానికి అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ కె సుందర్జీ అత్యంత రహస్యంగా ఆపరేషన్ ఫాల్కన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌కు ఆశిష్ దాస్ నేతృత్వం వహించారు. నెత్తురు గడ్డకట్టే చలిలో డ్రాగన్ దేశం ఆక్రమణలను తిప్పికొట్టడానికి వీరోచిత పోరాటమే చేశారు. చైనా సైన్యం కాల్పులు తెగబడుతుంటే ఆత్మరక్షణ కోసం ఒక బంకర్ నుంచి మరో బంకర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆశిష్ దాస్ తానే ప్రాణాలను పణంగా పెట్టి చైనా ఆర్మీపై కాల్పులు జరిపాడు. ఆశిష్ దాస్ ధాటికి డ్రాగన్ సైన్యం తోకముడిచింది. ఈ పోరాటం క్రమంలో ఆశిష్ దాస్, మరికొందరు సైనికులకు తిండి కూడా దొరకలేదు.. ఆకలికి మలమల మాడిపోయారు. కొన్నిసార్లు ఎలుకల్ని పట్టి తిని కడుపునింపుకున్నారు. అయినా తమ పోరాట స్ఫూర్తిని వదలుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆశిష్ దాస్ సేవలకు గుర్తుగా ఆయన పదవీవిరమణ చేసిన తర్వాత అక్కడ సైనిక శిబిరానికి ఆశిష్ టాప్ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయం ఆయనకు కూడా చాలా ఆలస్యంగా 2003 సంవత్సరంలో తెలిసింది. ఒక కల్నల్‌గా తాను చేసిన పోరాటాన్ని తన కుమార్తెకు ఎప్పుడూ చెప్పలేదని, ఎందుకంటే అప్పటికి ఆమె ఇంకా పుట్టలేదని దాస్ చెప్పుకొచ్చారు. అలా కన్నతండ్రి గురించి ఏమీ తెలీకపోవడంతో ఆశిష్ టాప్ అన్న పేరు చూడగానే ఆ యువ లెఫ్ట్‌నెంట్ ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. -
‘సంజువాన్’ దాడిలో ఆరుగురి మృతి
సంజువాన్: జమ్మూ నగర శివార్లలోని సంజువాన్‌లో ఆర్మీ కుటుంబాలు నివసించే గృహసముదాయంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. క్వార్టర్స్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు మిగిలిఉన్నారేమోనన్న అనుమానంతో సైన్యం సోదాలు కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారని అధికారులు శనివారం చెప్పగా.. తాజా సమాచారం ప్రకారం ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారని వెల్లడించారు. ఓ మేజర్ సహా 10 మంది గాయపడ్డారని ఆదివారం చెప్పారు. చనిపోయిన వారిలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ (జేసీవో) ఉన్నారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు శనివారం ఆర్మీ క్వార్టర్స్‌లోకి సైనిక దుస్తుల్లో ప్రవేశించి దాడి చేయడం తెలిసిందే. మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇప్పటికి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టగా శనివారం రాత్రి నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదనీ, అయినా ఇంకా ఎక్కడైనా ముష్కరులు దాగి ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తొలుత ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలు లభించగా, క్వార్టర్స్‌ను శుభ్రం చేస్తుండగా మరో ముగ్గురు సిబ్బంది, ఒక పౌరుడి మృతదేహం కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ ఆరుగురూ శనివారం తెల్లవారుజామునే చనిపోయారన్నారు. సుబేదార్ మదన్ లాల్ చౌదరి, సుబేదార్ మహ్మద్ అష్రఫ్ మిర్, హవిల్దార్ హబీబ్ ఉల్లా ఖురేషీ, నాయక్ మంజూర్ అహ్మద్, లాన్స్ నాయక్ ఇక్బాల్‌తోపాటు ఇక్బాల్ తండ్రి కూడా మరణించారనీ చెప్పారు. మదన్ లాల్ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఒట్టి చేతులతోనే ఉగ్రవాదులతో పోరాడాడనీ, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు చొచ్చుకుపోయినా కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాడన్నారు. గాయపడిన వారిలో ఓ మహిళ గర్భవతి కాగా, వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డలను కాపాడగలిగారు. క్వార్టర్స్‌పై బాంబులు క్వార్టర్స్ నుంచి ఇప్పటికే ఆర్మీ కుటుంబాలను ఖాళీ చేయించిన ఇళ్లపై ఆర్మీ మోర్టారు బాంబులను వేసింది. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా దాక్కొని ఉంటే వారినీ హతమార్చేందుకే ఈ చర్యకు పూనుకుంది. దీంతో ఆర్మీ క్వార్టర్స్‌కు మంటలంటుకున్నాయి. మరోవైపు ఈ దాడి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనేనన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. విచారణ కూడా ప్రారంభం కాకుండానే తమపై ఆరోపణలు చేయడం భారత మీడియాకు, అధికారులకు అలవాటైపోయిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు. -
ఉగ్రదాడిలో పెరిగిన మృతుల సంఖ్య
సాక్షి, సంజువాన్ : జమ్మూ కశ్మీర్‌లోని సంజువాన్‌లో భారత సైనికులకు, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున నుంచి జరుగుతున్న ఈకాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ దాడుల్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. మరో పదిహేను మందికి పైగా గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ, ఆర్మీ వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రదాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. బలగాలు జరిపిన కాల్పులో శనివారం ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా, ఆదివారం మరో ఉగ్రవాదిని కాల్చిచంపారు. అర్ధరాత్రి నుంచి ఆర్మీ క్యాంపులో చొరబడ్డ ఉగ్రవాదుల కోసం ప్రత్యేక ఆపరేషన్ కొనసాతోంది. ప్రస్తుతం సంజువాన్‌లో పరిస్థతి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డవారిలో హవిల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ బహదూర్ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్ మదన్‌లాల్ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ దాడి వివరాల్ని వెల్లడించారు. -
జమ్మూలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి
సంజువాన్: జమ్మూ కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ నగరం శివారు ప్రాంతం సంజువాన్‌లో ఉన్న ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున దాడికి తెగబడడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడంతో పాటు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించారు. వెంటనే తేరుకున్న ఆర్మీ సిబ్బంది ఉగ్రదాడిని దీటుగా తిప్పికొట్టారు. ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించిన భద్రతా బలగాలు.. శిబిరం నుంచి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన అనంతరం సాయంత్రం సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఆర్మీ ఆపరేషన్ అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగడంతో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులంతా హతమయ్యారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఉగ్రదాడిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారి వెల్లడించారు. ఐదుగురు మహిళలు, చిన్నారులు సహా తొమ్మిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద న్నారు. గాయపడ్డవారిలో హవిల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ బహదూర్ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్ మదన్‌లాల్ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ దాడి వివరాల్ని వెల్లడిస్తూ ‘శనివారం తెల్లవారుజామున శిబిరానికి వెనుకవైపు కాపలాగా ఉన్న సెంట్రీ బంకర్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. అనంతరం ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంలోకి చొరబడ్డారు. ఎదురుకాల్పుల్లో ముగ్గు రు ఉగ్రవాదుల్ని ఆర్మీ హతమార్చింది. ఉగ్రవాదుల వద్ద దొరికిన వస్తువుల మేరకు వారిని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా గుర్తించాం’ అని తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మెరుపు బృందాలు రంగ ప్రవేశం చేసి ఇళ్లలో దాక్కున్న ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించాయని, సైనిక కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. గతంలో 2016 నవంబర్‌లో నగ్రోటాలోని ఆర్మీ శిబిరంపై ఆత్మాహుతి బృందం దాడి చేయడంతో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆచితూచి ఆపరేషన్ గృహ సముదాయంలో మహిళలు, చిన్నారులు ఉండడంతో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్‌ను ఆర్మీ జాగ్రత్తగా కొనసాగించింది. ఉగ్రవాదులు ఎక్కడ నక్కారో తెలుసుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లను వాడింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌లో ప్రత్యేక బలగాలు వెనుకవైపు నుంచి శిబిరంలోకి చేరుకుని ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. శిబిరం సరిహద్దు గోడ వెలుపల సీఆర్పీఎఫ్, పోలీసుల్ని మోహరించారు. అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను అధికారులు మూసివేశారు. జమ్మూలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భదత్రను కట్టుదిట్టం చేశారు. జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. ‘దాడి గురించి తెలియగానే ఆర్మీ ప్రత్యేక బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) సిబ్బంది చేరుకుని.. శిబిరాన్ని చుట్టుముట్టాయి’ అని తెలిపారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ మేజర్‌ను హెలికాప్టర్లో ఉధమ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతి చెందిన ఆర్మీ సిబ్బంది: సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ -
ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట..!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సున్‌జ్వాన్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సున్‌జ్వాన్‌లోని ఆర్మీ క్యాంప్‌పై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. దాడిలో మొత్తం నలుగురు వరకు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తుండగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం సున్‌జ్వాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
పాక్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయమిస్తూ భారత్‌పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాక్‌పై యుద్ధం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు. శనివారం తెల్లవారుజామున సంజ్వాన్‌లోని ఆర్మీ శిబిరంపైనే పాక్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రతిరోజు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, అసలు దాయాది ఉగ్రవాదులు దాడులు భారత్‌పై దాడులు చేయని రోజే లేదని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత్ నుంచి కేవలం శాంతిని మాత్రమే కోరుకున్నట్లయితే పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగు చేసుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకుని, ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పారు.. యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కానీ పాక్ చర్యల వల్ల యుద్ధ వాతావరణం నెలకొంటుందన్నారు. -
ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్వాన్‌లోని ఆర్మీశిబిరంపై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. తీవ్రవాదులు ఆర్మీ క్యాంపు వెనక వైపు ఉన్న నాలా ద్వారా చొరబడ్డట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు లేక నలుగురు తీవ్రదాదులు పాల్గొన్నట్టు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఈ మొహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. -
మిలటరీ గుప్పిట్లో జింబాబ్వే
హరారే : దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. అధ్యక్షుడి చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొంది. అయితే, ముగాబే(93), ఆయన కుటుంబం తమ రక్షణలోనే ఉన్నట్లు దేశ అధికారిక టీవీలో మేజర్ జనరల్ ఎస్బీ మోయో చెప్పారు. దేశంలోని కీలకప్రాంతాల్లో(పార్లమెంటు, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు) జింబాబ్వే మిలటరీ పెద్ద ఎత్తున ఆయుధ వాహనాలను మోహరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. క్రిమినల్స్‌ను మట్టుబెట్టిన అనంతరం దేశంలో ప్రశాంతతను పునః ప్రతిష్టిస్తామని మోయో పేర్కొన్నారు. బుధవారం ఉదయం జింబాబ్వే ఆర్థిక శాఖ మంత్రిని మిలటరీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముగాబే పార్టీ జాను-పీఎఫ్ కేంద్ర కార్యాలయాన్ని మంగళవారం మిలటరీ సీజ్ చేసింది. జానూ-పీఎఫ్ మిత్రపక్షాల మధ్య ఉన్న సమస్యలపై తాను జోక్యం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మిలటరీ చీఫ్ జనరల్ కన్స్టాంటినో చివాంగా చెప్పిన 24 గంటల్లోనే మిలటరీ దళాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జింబాబ్వే అధికారిక టీవీ జింబాబ్వీ స్టేట్ బ్రాడ్‌కాస్టర్(జెడ్‌బీసీ)లోకి సైనికులు చొచ్చుకెళ్లారు. కొందరు జెడ్‌బీసీ ఉద్యోగులపై సైనికులు చేయి చేసుకున్నట్లు కూడా తెలిసింది. 1980లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన నాటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే గెలుపొందుతూ వస్తున్నారు. -
సైనిక శిబిరంపై ఉగ్ర దాడి
-
సైనిక శిబిరంపై ఉగ్ర దాడి
కెప్టెన్‌తోసహా ముగ్గురు సైనికుల మృతి - మృతుల్లో విశాఖ వాసి - ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మళ్లీ రక్తమోడింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు మాటు వేసి దుశ్చర్యకు తెగబడ్డారు. ఉగ్రమూకలు చేసిన ఈ దాడిలో భారత భద్రత దళానికి చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కుప్వారా జిల్లాలోని పంజగం సైనిక శిబిరంలోకి నలుపు రంగు దుస్తుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చాటుగా చొరబడి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ ఆయుష్ యాదవ్‌తో సహా ఇద్దరు సైనికులు అక్కడికక్కడే నేలకొరిగారు. నియంత్రణ రేఖ నుంచి కేవలం పదికిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైనిక శిబిరంలోని ఉగ్రవాదులు రెండో భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ లోపలికి రాగలిగారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. సైనిక శిబిరానికి ప్రధాన గేటు వద్దే ఉగ్రవాదుల్ని లోపలికి ప్రవేశించకుండా భద్రతా బలగాలు నిలువరించాయి. గాయపడిన మూడో ఉగ్రవాదిని కూడా పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హతమైన ఉగ్రవాదులు నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా అధికారులు అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు 35 నిమిషాల సేపు భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం భద్రతా బలగాల మీదికి కొన్ని అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. దీంతో సైనికులు వారిపైకి కాల్పులు జరపగా 75 ఏళ్ల వ్యక్తి ఒకరు మృతి చెందాడు. కెప్టెన్ ఆయుష్ యాదవ్, సుబేదర్ భూప్ సింగ్ గుజ్జర్, నాయక్ బి వెంకటరమణలు ఉగ్రదాడుల్లో మృతిచెందారు. ఉత్తర ప్రదేశ్‌లోకి కాన్పూర్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణంకు చెందిన నాయక్ బీ వెంకట రమణ గత 18 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఇక సుబేదర్ గుజ్జర్ గత 26 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నారని న్యూఢిల్లీలోని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం 92 ఆర్మీ బేస్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. 18 ఏళ్లుగా ఆర్మీలో... విశాఖ నగర పరిధిలోని ఆసవానిపాలేనికి చెందిన బీవీ వెంకటరమణ (38) పద్దెనిమిదేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ‘నాయక్’ హోదాలో ఉన్నారు. ఆయనకు భార్య అనిత, కూతురు (8), కొడుకు (6), తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. వారిలో పెద్ద తమ్ముడు అప్పలరాజు కూడా ఆర్మీలోనే ఉన్నారు. వెంకటరమణ ప్రాణాలు విడిచారు. బుధవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో ఫోన్లో చివరిసారిగా మాట్లాడిన రమణ.. రిలీవింగ్ ఉత్తర్వులు రాగానే ఇంటికొస్తానని చెప్పారు. అంతలోనే ఆయన మరణించడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. -
ఆర్మీ క్యాంపులోకి ఉగ్రవాదులు ఎలా వచ్చారంటే..?
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోటాలోగల ఆర్మీ యూనిట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు దాడికోసం చాలా పకడ్బందీ ప్రణాళితో వచ్చినట్లు తెలిసింది. ఆ రోజు వారు సైలెన్సర్ గన్ ఉపయోగించి సెంట్రీని తొలుత కాల్చి చంపి లోపలికి ప్రవేశించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఇలాంటి చర్యకు దిగడం ఇదే తొలిసారి అని చెప్పారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్లు, కాల్పులతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు. తొలుత ఆర్మీ యూనిట్ ప్రాంగణంలోకి సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫాంట్ గ్రాస్ ద్వారా ప్రవేశ మార్గం వద్దకు వచ్చారని, అక్కడ ఉన్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారని తెలిపారు. ఆ విషయం ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, అక్కడే ఆయుధగారాలు, ఆర్మీ కుటుంబాలు ఉన్నాయని వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి దిగగా సమర్థంగా తిప్పికొట్టినట్లు చెప్పారు. -
ఆర్మీ క్యాంపుపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని రెండు సైనిక శిభిరాలపై గురువారం తెల్లవారు జామున 5 గంటలకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపు, లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపును లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడికి యత్నించారు. ఉగ్రదాడిని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జవాన్లకు ఉగ్రవాదులకు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. అదనపు బలగాలను రంగంలోకి దింపిన ఆర్మీ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. -
దాడి ఎలా జరిగిందంటే?
-
జమ్ములో కొనసాగుతున్న కాల్పులు
-
ఉగ్ర కుట్ర భగ్నం
* ఉడీలో చొరబాటుకు పాక్ యత్నం * తిప్పికొట్టిన సైన్యం * పదిమంది ముష్కరుల హతం ఉడీ/న్యూఢిల్లీ: రెండ్రోజుల క్రితం ఉడీలో ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిని మరువకముందే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీగా చొరబాట్లకు ప్రయత్నించారు. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. చొరబాటుకు యత్నించిన 15 మందిలో 10 మంది మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడయ్యాడు. ఉడీ సెక్టార్లో సరిహద్దు పక్కనే ఉన్న దట్టమైన అడవిలో నక్కి.. బలగాలపై కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 15 మంది మిలిటెంట్లు ఎల్వోసీ గుండా చొరబాటుకు యత్నించారని.. ఢిల్లీలోని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అటు పాకిస్తాన్ మరోసారి ఎల్వోసీ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సరిహద్దు పోస్టులపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. దీనికి కూడా భారత దళాలు దీటైన జవాబిచ్చాయి. ఇంకా కోలుకోకముందే.. ఆదివారం నాటి దుర్ఘటన నుంచి భారత ఆర్మీ కోలుకోకముందే.. దెబ్బమీద దెబ్బ కొట్టాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భావించారు. దీంతో బారాముల్లా (ఉడీ)తోపాటు కొండ ప్రాంతమైన కుప్వారా (నౌగామ్) జిలాల్లో చొరబాట్లకు ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 15 మంది మిలిటెంట్లు పెద్దసంఖ్యలో ఆయుధాలతో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా.. భారత దళాలు తిప్పికొట్టాయి. తోటి జవాన్లు అమరులయ్యారన్న బాధతో కూడిన కసితో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉడీ ప్రాంతంలో ఎల్వోసీకి పక్కనే దట్టమైన అడవి ఉంది. ఇక్కడ జవాన్లు, మిలిటెంట్ల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. మరికొంత మంది మిలిటెంట్లు ఇక్కడ నక్కి ఉండొచ్చని భావిస్తున్న జవాన్లు.. అడవంతా జల్లెడపడుతున్నారు. ఆదివారం నాటి ఘటనకు ముందూ ఇక్కడి నుంచే చొరబాట్లు జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సెప్టెంబర్ 11, 16 తేదీల్లోనూ భారీ చొరబాట్ల యత్నాన్ని జవాన్లు తిప్పికొట్టారు. బరితెగించిన పాక్.. ఉడీ ఘటనతో పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతుండటంతో.. ఆత్మరక్షణలో పడ్డ పాకిస్తాన్ సరిహద్దులో భారత ఔట్‌పోస్టులపై కాల్పులకు తెగబడింది. మంగళవారం మధ్యాహ్నం 1.10-1.30 గంటల సమయంలో ఎల్వోసీ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిందని శ్రీనగర్‌లోని ఆర్మీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటనలో నష్టమేమీ జరగలేదని.. భారత బలగాలు వీటిని తిప్పికొట్టాయని వెల్లడించింది. ఉగ్రవాదుల చొరబాట్ల నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఉడీ ఘటనకు పాకిస్తాన్‌తో సంబంధం లేదని అక్కడి ప్రభుత్వం చెబుతుండగా.. పాక్ మద్దతుతోనే దాడులు జరిగాయనటానికి ఆధారాలను భారత్ సేకరిస్తోంది. ఉగ్రవాదుల వద్ద లభించిన వాకీటాకీలు పాక్ ఆర్మీ వాడుతున్నవిగా గుర్తించింది. రాజ్‌నాథ్ సమీక్ష.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్‌తోపాటు పలువురు హోం, రక్షణ రంగ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి విదేశాంగ కార్యదర్శి రావటం చూస్తుంటే.. దౌత్యపరంగా కూడా పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా, పలు అంశాలపై విచారణ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ మద్దతుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకుంటామని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మరోవైపు ఉడీ దుర్ఘటనపై పాకిస్తాన్‌కు సరైన సమాధానం ఎలా ఇవ్వాలనే అంశంపై చర్చించేందకు బుధవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. హెచ్చరికలకు బెదరం: పాకిస్తాన్ ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న బెదిరింపులకు జడిసే ప్రసక్తే లేదని పాక్ పేర్కొంది. కశ్మీరీల పోరాటానికి తమ మద్దతుంటుందని పాక్ హోం మంత్రి నిసార్ అలీ ఖాన్ తెలిపారు. ‘కశ్మీరీలది న్యాయపోరాటం. వారి ఆత్మాభిమానాన్ని తొక్కిపెట్టలేరు. వీరికి రాజకీయంగా, దౌత్యపరంగా మా పూర్తి మద్దతు అందిస్తాం. కశ్మీర్లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది’ అని పేర్కొన్నారు. పాక్‌కు చీవాట్లు ఉడీ ఘటనతో పాక్‌ను ఏకాకిని చేయాలన్న భారత యత్నాలకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, ఫ్రాన్స్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనల్లో పాక్ పేరును ప్రస్తావిస్తూ నేరుగా విమర్శించాయి. పాక్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలన్నాయి. భారత్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని.. భారత్‌కు తమ మద్దతుంటుందని అమెరికా, బ్రిటన్ అన్నాయి. చైనా మాత్రం ఉడీ ఘటనను ఖండిస్తున్నామని ముక్తసరి ప్రకటన చేసింది. -
ఆర్మీక్యాంప్‌నకు ఎంపిక
సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ యూనిట్‌కు చెందిన ఆరుగురు విద్యార్ధులు ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ వివరాలను సోమవారం వెల్లడించారు. 71వ ఇన్‌ప్రాట్రీ ఆర్మీ బ్రిగేడ్‌కు సంబందించిన క్యాంప్ ఆగష్టు 16 నుంచి 30వ తేది వరకు హైద్రాబాద్‌లో కొనసాగనుంది. ఈ క్యాంప్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బెటాలియన్లకు చెందిన ఎన్సీసీ విద్యార్ధులు ఆర్మీ జవాన్లతో కలిసి పక్షం రోజులు శిక్షణ పొందనున్నారు. ఆర్మీ జవాన్ల జీవన విదానం అనుసరిస్తు వివిధ అంశాలపై శిక్షణ పొందనున్నారు. శిక్షణలో బాగంగా భారత సైన్యానికి సంబందించిన అంశాలను భోదించడమే కాకుండా డ్రీల్ , అయుద శిక్షణ , మిల్ర్టీపట్ల అధ్యాయనం , యుద్ద వ్యూహాలు, విపత్కర పరస్థితులను ఎదుర్కోనే విదానం దేశభక్తి, క్రమశిక్షణ, తదితర అంశాలను శిక్షణలో నేర్చుకోనున్నారు. ఈ క్యాంప్‌కు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్ధులు, విజేందర్, ఆరవింద్‌రెడ్డి, సుజయ్‌చంద్రా, రాజశేఖర్, సాయికిరణ్, స్వామిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీనివాస్‌లు అభినందించారు. -
ఆర్మీ క్యాంపులో ఘర్షణ
♦ గుండెనొప్పితో జవాను మృతి.. కెప్టెన్‌పై సహచర జవాన్ల దాడి ♦ తిరుగుబాటు కాదన్న ఆర్మీ ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ క్యాంపులో ఆదివారం ఘర్షణ చెలరేగింది. సహచరుడు గుండెనొప్పితో మృతి చెందడంతో ఆగ్రహించిన కొందరు జవాన్లు.. కెప్టెన్‌పై దాడిచేశారని.. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆర్మీ తెలిపింది. ఈటానగర్‌కు దగ్గర్లోని క్యాంపులో రోజూలాగే రూట్ మార్చ్ మొదలైంది. ఓ జవాను తనకు ఛాతీలో నొప్పిగా ఉందని కెప్టెన్‌కు తెలిపారు. పరీక్షించిన యూనిట్ వైద్యాధికారి.. సదరు జవాను శిక్షణకు ఫిట్‌గా ఉన్నాడని చెప్పడంతో తప్పనిసరి స్థితుల్లో మార్చ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. మార్చ్ మొదలవగానే ఆ జవాన్ గుండెనొప్పితో కుప్పకూలటంతో వైద్యాధికారి.. ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురైదుగురు అక్కడే ఉన్న కెప్టెన్‌పై దాడిచేసి గాయపరిచారు. వెంటనే ఇతర జవాన్లు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయం బయటకు పొక్కటంతో.. సైన్యంలో తిరుగుబాటు మొదలైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆర్మీ ఉన్నతాధికారులు ఖండించారు. ఈ ఘటనలో విచారణకు ఆదేశించారు. -
కశ్మీర్లో పేలుడు: 12మంది జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్ము, కశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌లో శనివారం పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ పేలుడులో 12 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా ఏరియాలోని పుల్వామాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా పేలుడుకు గల కారణాలు చెప్పలేమని, విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
తీవ్రవాదులు దాడి: ముగ్గురికి గాయాలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. సాంబా జిల్లాలోని ఆర్మీ శిబిరంపై తీవ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులల్లో ఇద్దరు సైనికులు, ఓ యాత్రికుడు ఉన్నాడని వారిని ఆసుపత్రి తరలించినట్లు చెప్పారు. తీవ్రవాదల దాడితో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రవాదులు పాల్గొన్నారని చెప్పారు. కాశ్మీర్ - పఠాన్‌కోట్ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే కథువా జిల్లాలోని పోలీసు స్టేషన్‌పై శుక్రవారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు మిలిటెంట్లు హతమైయ్యారు. -
మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్ : పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా జరిగిన కాల్పుల్లో లెఫ్టె నెంట్ కల్నల్ తో సహా ఎనిమిది మంది జవాన్లు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు అసువులు బాసారు. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మొత్తం 17 మంది మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. తొలుత పోలీసులపై కాల్పులు జరుపుతూ... ఉగ్రవాదులు యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగి వారిని ప్రతిఘటించారు. బంకర్లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూలో రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరుగనున్న నేపథ్యంలో మిలిటెంట్లు ఈ మారణకాండకు పాల్పడ్డారు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో 8మంది జవాన్లు మృతి