తీవ్రవాదులు దాడి: ముగ్గురికి గాయాలు | Three injured in attack on army camp in Jammu | Sakshi
Sakshi News home page

తీవ్రవాదులు దాడి: ముగ్గురికి గాయాలు

Published Sat, Mar 21 2015 11:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

Three injured in attack on army camp in Jammu

జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. సాంబా జిల్లాలోని ఆర్మీ శిబిరంపై తీవ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులల్లో ఇద్దరు సైనికులు, ఓ యాత్రికుడు ఉన్నాడని వారిని ఆసుపత్రి తరలించినట్లు చెప్పారు. తీవ్రవాదల దాడితో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రవాదులు పాల్గొన్నారని చెప్పారు. కాశ్మీర్ - పఠాన్కోట్ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

అయితే కథువా జిల్లాలోని పోలీసు స్టేషన్పై శుక్రవారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు మిలిటెంట్లు హతమైయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement