two soldiers
-
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: ఇటు భారత్- పాకిస్థాన్ సరిహద్దు భద్రతా దళాల మధ్య ఢిల్లీలో చర్చలు జరుగుతున్న వేళ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. గురువారం అర్థరాత్రి పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఉగ్రమూక.. కుప్వారా జిల్లాలోని హడ్వారాకు సమీపంలోని లరీబల్ గ్రామంలోకి ప్రవేశించింది. ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సైన్యంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు కూడా ఉగ్రవాదులకు గట్టి సమాధం చెప్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం వరకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తివివరాలు వెల్లడవుతాయిని పేర్కొన్నాయి. -
బాంబు పేలుడులో ఇద్దరు సైనికుల దుర్మరణం
బొగొటా: ఓ చమురు క్షేత్రానికి సమీపంలో గుర్తుతెలియని దుండగులు పాల్పడిన శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు నేలకొరిగారు. కొలంబియాలోని సంతాందర్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. వెనుజులా సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం వద్ద ఆయిల్ పైప్ లైన్ మరమత్తులు జరుగుతుండగా చనిపోయిన సైనికులిద్దరు అక్కడ కాపలా విధుల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏ సంస్థా పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. -
తీవ్రవాదులు దాడి: ముగ్గురికి గాయాలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. సాంబా జిల్లాలోని ఆర్మీ శిబిరంపై తీవ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులల్లో ఇద్దరు సైనికులు, ఓ యాత్రికుడు ఉన్నాడని వారిని ఆసుపత్రి తరలించినట్లు చెప్పారు. తీవ్రవాదల దాడితో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రవాదులు పాల్గొన్నారని చెప్పారు. కాశ్మీర్ - పఠాన్‌కోట్ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే కథువా జిల్లాలోని పోలీసు స్టేషన్‌పై శుక్రవారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు మిలిటెంట్లు హతమైయ్యారు. -
బాంబు పేలుడు : ఇద్దరు సైనికులు మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ లగ్మన్ ప్రావెన్స్లోని కర్గాయ్ జిల్లాలో గురువారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ప్రావెన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని... వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆఫ్ఘానిస్థాన్‌లోని నాటో దళాలు చేపట్టిన భద్రత చర్యలు డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దాంతో జనవరి 1 నుంచి ఆప్ఘానిస్థాన్‌లోని సైనిక దళాలే భద్రత వ్యవహారాలు పర్యవేక్షించనుంది. -
పాక్‌లో కాల్పులు.. 8 మంది ఉగ్రవాదుల హతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని వాయవ్య ఖైబర్ గిరిజన ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం రాత్రి ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్టు ఓ భద్రతాధికారి చెప్పారు. మరో ముగ్గురు సైనికులు గాయపడినట్టు తెలిపారు. కాగా పాక్‌లో శనివారం మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆరుగురు సైనికులు, ఓ పౌరుడు మరణించారు. దేశ రాజధానిలోనే రెండు పేలుళ్లు జరిగాయి.