కన్నీరు పెట్టిన ఆతిశీ | Delhi Chief Minister Atishi Breaks Down Over BJP Leader Comments Video Viral | Sakshi
Sakshi News home page

కన్నీరు పెట్టిన ఆతిశీ

Jan 6 2025 5:14 PM | Updated on Jan 7 2025 4:42 AM

Delhi Chief Minister Atishi Breaks Down Over BJP Leader Comments Video Viral

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్‌ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్‌. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. 

చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్‌ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement