ఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే.. ఢిల్లీకి కొత్త సీఎంగా ఎంపికైన ఆప్ నాయకురాలు అతిషికి ప్రతిపక్ష బీజేపీ నేత హర్ష్ మల్హోత్రా అభినందనలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీని వేధించిన పలు కీలక సమస్యలకు పరిష్కరం చూపించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అవినీతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.
‘‘గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలకు అందని అభివృద్ధి, సౌకర్యాలు కనీసం మీ(అతిషి) నాయకత్వంలోనైనా అందేలా చూడాలి. జాతీయ రాజధాని అంతటా అపరిశుభ్రమైన మురుగు, విస్తృతమైన నీటి ఎద్దడి, నిరంతర సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యల ముఖ్యమంత్రిగా పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
ఇదిలాఉండగా.. అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడే ప్రయత్నాలకు అతిషి కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను హర్ష్ మల్హొత్రా ప్రస్తావిస్తూ.. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై అతిషి , కేజ్రీవాల్ ఆలోచించాలన్నారు.
మరోవైపు.. అతిషి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment