న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు పేర్లను తొలిగించారంటూ ఆరోపిస్తూ దిగువ కోర్టులో దాఖలైన క్రిమినల్ పరువునుష్టం కేసు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
కాగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేజ్రీవాల్, అతిషి, ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్‌లపై పరువునష్టం కేసు దాఖలైంది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్, అతిషి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.
దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, అతిషిపై దిగువ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment