న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం(జనవరి4) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలకు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనున్నారు. పర్వేష్‌సింగ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఈయన ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. వెస్ట్ ఢిల్లీ నుంచి 2014,2019లో రెండుసార్లు కమలం గుర్తుపై ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లోనైతే ప్రత్యర్థిపై ఏకంగా ఐదు లక్షల 78వేల పై చిలుకు ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు.
ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడే పర్వేష్‌సింగ్ వర్మ. త్వరలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు పర్వేష్‌సింగ్ వర్మ గట్టిపోటీ ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
సీఎం అతిషిపై పోటీచేయనున్న రమేష్ బిదూరి ఎవరు..
ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అతిషిపై పోటీ చేయనున్న రమేష్ బిదూరి బీజేపీ సీనియర్ నేత. న్యాయవాది కూడా అయిన బిదూరి రెండుసార్లు ఎంపీగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత బిదూరి. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి ఆప్ నేత రాఘవ్ చద్దాను ఓడించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన బిదూరి సీఎం అతిషికి సరైన ప్రత్యర్థని భావించి పోటీకి దించిందని తెలుస్తోంది. కాగా, అతిషిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment