( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్ర నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి, పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
మరోవైపు.. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
As per early official trends, BJP leading in Vishwas Nagar and Shahdara assembly seats out of the total 70 seats in Delhi#DelhiElections2025 https://t.co/GMgILZrcTR pic.twitter.com/hlOgMsbull
— ANI (@ANI) February 8, 2025
ఫలితాల్లో ఇలా..
- న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజ.
- కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్‌వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యం
- కాల్‌కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజ
- జంగ్‌పురలో మనీశ్ సిసోదియా వెనుకంజ
- షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
- ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజ
- గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ
- బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజ
- బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజ
- పత్‌పర్‌గంజ్‌లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజ
ఇదిలా ఉండగా.. ఢిల్లీ (Delhi)లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 కావాల్సి ఉంది. ఢిల్లీలో 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment