![Minister Bandi Sanjay Satirical Comments On Congress And AAP](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Minister-Bandi-Sanjay.jpg.webp?itok=yv_cqklA)
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను ప్రజలు దూరంగా పెట్టారు. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. భారీ విజయం అందుకునే దిశగా వెళ్తున్నాం.
తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఫలితమే రిపీట్ అవుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment