breaks down
-
కన్నీరు పెట్టిన ఆతిశీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. తన తండ్రిని దుర్భాషలాడుతూ బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బిధూరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న టీచర్. ఢిల్లీలోని వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు పాఠాలు బోధించారు. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. చాలా అనారోగ్యంతో ఉన్నారు. కనీసం సొంతంగా నడిచే స్థితిలో కూడా లేరు. ఎన్నికల్లో లబ్ధి కోసం అటువంటి వృద్ధుడి పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? దేశ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. రమేష్ బిధూరి దక్షిణ ఢిల్లీ నుంచి పదిసార్లు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారో కల్కాజీ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేగా నేను చేసిన ఐదేళ్ల పని కంటే పదేళ్లపాటు ఆయన గొప్పగా చేసిందేమిటో చూపించాలి. అప్పుడే ఆయన ఓట్లు అడగాలి’అని ఆతిశీ స్పష్టం చేశారు.#WATCH | Delhi: On BJP leader Ramesh Bidhuri's reported objectionable statement regarding her, Delhi CM Atishi says, " I want to tell Ramesh Bidhuri, my father was a teacher throughout his life, he has taught thousands of children coming from poor and lower-middle-class families,… pic.twitter.com/ojQr3w0gVW— ANI (@ANI) January 6, 2025 ఇదీ చదవండి: ఢిల్లీలో మేం సహకరించకుండా ఉండి ఉంటే..! -
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
లైవ్ లోనే అందరి ముందు కంటతడి పెట్టిన బీజేపీ సీఎం
-
సిరివెన్నెలను తలచుకుని కంట తడి పెట్టుకున్న చిరంజీవి
Megastar Chiranjeevi Emotional Words About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ముృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. (చదవండి: ఇప్పుడు నా కుడి భుజం పోయింది: కే. విశ్వనాథ్) అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటు: మెగాస్టార్ భావోద్వేగం -
‘బాలకృష్ణ అమాయకుడు.. చంద్రబాబు ఏం చేప్తే అది నమ్ముతాడు’
సాక్షి, తాడేపల్లి : ‘‘బాలకృష్ణ అమాయక చక్రవర్తి.. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. అలాంటిది మేము ఎందుకు తిడతాము.. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న అయినా వేశారా.. అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు’’ అంటూ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు’’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు.. ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో చేశారు కదా. అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు’’ అని పేర్ని నాని తెలిపారు. (చదవండి: చంద్రబాబు విలపించడం ఓ డ్రామా) ‘‘అసెంబ్లీ చర్చ అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. వైసీపీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజంగానే అని నమ్మారు. వారి బుర్రలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈలోపు జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు’’ అని మంత్రి ప్రశ్నించారు. (చదవండి: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్) ‘‘వివేకా హత్య జరిగినప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు. ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు. అసెంబ్లీలో మైకు కట్ చేసినా క్షణాల్లో సెల్ ఫోన్లో ఎలా వీడియో తీశారు. ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారం. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే’’ అన్నారు. ‘‘వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల విజయంపై కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోంది. కేంద్రం పై పోరాడి విజయం సాధించినందుకు మేము చేస్తున్నాం. రైతుల దీక్షకు మా ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. బందులకు కూడా సహకరించింది. మరోసారి చెప్తున్నాం.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను నమ్మవద్దు. ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో విషాన్ని ఎక్కిస్తున్నారు. ఇంతకంటే వికృత రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవు’’ అన్నారు. చదవండి: పేకమేడలా కూలిపోయిన కంచుకోట! -
చంద్రబాబు విలపించడం ఓ డ్రామా
సాక్షి, అమరావతి/నగరి: రాజకీయాల్లో చంద్రబాబులాంటి నీతిబాహ్యమైన నేతను ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మీడియా ముందు చంద్రబాబు విలపించడం ఒక డ్రామా అని మండిపడ్డారు. సాఫీగా జరుగుతున్న శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి తల్లి – చెల్లి, బాబాయ్ – గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదన్నారు. మహిళలను గౌరవించడంలో వైఎస్సార్సీపీ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. సీఎం వైఎస్ జగన్‌తో పోలికా? ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి వీల్లేకుండా సభను నడుపుతుండటం వల్లే 2017, డిసెంబర్ 21న నాటి ప్రతిపక్ష నేత జగన్.. సభను బాయ్‌కాట్ చేశారు. చంద్రబాబు సం బంధం లేని అంశాలను సభలో ప్రస్తావించి.. అధికార పార్టీ సభ్యులు అనని మాటలను అన్నట్లుగా సృష్టించుకుని.. సభ నుంచి బాయ్‌కాట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ నాడు సభను బాయ్‌కాట్ చేసిన దానికి.. నేడు చంద్రబాబు బాయ్‌కాట్ చేసిన దానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలపై చర్చిద్దామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారే తప్ప.. మరో రీతిలో మాట్లాడలేదు. – పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబు గొప్ప నటుడు కుప్పం ఓటమి తర్వాత టీడీపీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు చంద్రబాబుకు వచ్చాయి. తండ్రీకొడుకు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఇంట్లోని మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనే నీచ ఆలోచనకు చంద్రబాబు వచ్చారు. పదవి కోసం ఎన్ని ఘోరాలు, నేరాలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన గొప్ప నటుడని ఎన్టీఆర్ ఎన్నోసార్లు ప్రజలకు తెలియజేశారు. – ప్రభుత్వ విప్, కొరముట్ల శ్రీనివాసులు బాబు నటన అమోఘం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీలో ఆయన నటన అమోఘం. అసెంబ్లీలో, బయట ఏడ్వని చంద్రబాబు మీడియా ముందుకు రాగానే ఏడ్వడం మొదలుపెట్టారు. పూర్తి స్థాయి నటనతో మీడియా సమావేశాన్ని రక్తి కట్టించారు. అసెంబ్లీలో ఏ ఒక్కరూ చంద్రబాబు కుటుంబసభ్యులను, ఆయన భార్య గురించి మాట్లాడలేదు. బాబు డ్రామాల్ని ప్రజలెవరూ పట్టించుకోరు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చంద్రబాబుది మొసలి కన్నీరు మహిళల ఉసురు చంద్రబాబుకు తగిలింది. అందుకే నేడు ఆయనకు ఈ దుస్థితి. ఎన్టీఆర్ 72 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీడీపీని, సీఎం పదవిని లాక్కొని చంద్రబాబు ఆయనను ఏడిపించారు. ఇప్పుడు బాబుకు 71 ఏళ్ల 7 నెలలకే ఏడ్చే పరిస్థితి వచ్చింది. గతంలో నన్ను, విజయమ్మ, భారతమ్మ, షర్మిళమ్మలను కూడా వేధించారు. ఆయన వల్ల ఏడ్చిన ప్రతి ఒక్కరి ఉసురు ఇప్పుడు బాబుకు తగిలింది. – ఎమ్మెల్యే ఆర్కే రోజా -
ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్
సాక్షి,ముంబై: హీరోయిన్ కియారా అద్వానీ తన సినిమా చూసి తనే వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన వైరల్‌గా మారింది. కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ సినిమాలోని క్లైమాక్స్ సీన్లను చూస్తూ ఉద్వేగంతో విలపించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని చూస్తూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ కామెట్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఎమోషనల్ సీన్ అని కొందరు, ‘నేను కూడా ఈ సన్నివేశంలో చాలా ఏడ్చేశాను" అని మరొకరు వ్యాఖ్యానించారు. సినిమా తరువాత తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్‌లా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని కియారా ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. విక్రమ్ మరణం తరువాత అవివాహితగానే ఉండిపోయిన డింపుల్ చీమా చండీగఢ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారని కియార్ తెలిపారు. కాగా 25 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా నటించగా, అతని ప్రేయసి డింపుల్ చీమాగా కైరా నటించింది. విక్రమ్ చనిపోయిన తరువాత డింపుల్ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేయడం, స్నేహితుడు సన్నీ న్యాయవాది వృత్తిలో కొనసాగడం వంటివి ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. విక్రమ్ చేసిన త్యాగానికి గానూ ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో సత్కరించిన దృశ్యాలను కూడా చూపించారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, కార్గిల్ యుద్ధ సన్నివేశాలు లాంటి దృశ్యాలతో పాటు, విక్రమ బాత్రా అంత్యక్రియల వరకూ చాలా ఎమోషన్‌ల్‌గా తీర్చిదిద్దిన దర్శకుడు విష్ణువర్ధన్ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by kiaraadvani_forever (@kiaraadvani_forever) -
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు
పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. చదవండి: అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు! ‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్ View this post on Instagram A post shared by WeddingWire India (@weddingwireindia) -
ప్రధాని మోదీ ఫోన్, కన్నీరు మున్నీరైన అమ్మాయిలు
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి పాలైన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. గుర్జీత్ కౌర్ అసమాన ప్రదర్శనతో ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసినప్పటికీ చివరి క్వార్టర్లో బ్రిటన్‌కి హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్లు జట్టుకు విజయాన్ని దూరం చేశాయి. అయినా 130 కోట్ల మంది దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ నెటిజన్లు జట్టును అభినందించారు. అటు అద్భుతంగా ఆడారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రశంసించారు. ఫోన్ ద్వారా ప్రధాని మోదీ జట్టు సభ్యులు, కోచ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు తీవ్రంగా ఏడవటం ప్రారంభించారు. అయితే ప్రధాని మోదీ వారిని అనునయించి దేశం మీ గురించి గర్వపడుతుందంటూ ప్రోత్సాహకరంగా వ్యాఖ్యానించారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీంకు భారీ నిరాశ ఎదురైంది. గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ భారత మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఈ పరాజయాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో కాంస్య పతకం దక్కకుండా పోయింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచ్ లోతొలి క్వార్టర్లో రెండు టీమ్‌లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. కానీ రెండో క్వార్టర్ లో బ్రిటన్ రెండు గోల్స్ సాధించగా, ఇండియా మూడు గోల్స్‌తో ఆధిపత్యాన్ని చాటుకుంది. 25, 26వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండు వరుస గోల్స్ చేయగా 29వ నిమిషంలో మూడో గోల్ చేసింది నందనా కటారియా. ఫలితంగా రెండో క్వార్టర్లో ముందంజలో ఉన్నా, మూడు నాలుగు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ప్రధానంగా నాలుగో క్వార్టర్ వైఫల్యంతో ఇండియా పరాజయం పాలైంది.. #WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj — ANI (@ANI) August 6, 2021 -
కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం...
బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మండ్యా జిల్లాలోని కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో కనీసం 8 స్థానాలు గెల్చుకోవాలి. డిసెంబర్ 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మండ్యా లోక్‌సభస్థానం నుంచి పోటీచేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు కుమారస్వామి ప్రజలతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన జయప్రద
లక్నో : బీజేపీ తరఫున రామ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు సినీ నటి జయప్రద. పుట్టినరోజు సందర్భంగా బుధవారం నామినేషన్ వేశారు జయప్రద. అనంతరం రామ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ మూలాన నేను రామ్‌పూర్‌ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు. తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక ‘దేవున్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మరోసారి ఈ యుద్ధంలో నన్ను గెలిపించు.. జనాలకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుకుంటున్నట్లు’ తెలిపారు. గతంలో జయప్రద రెండు సార్లు 2004, 2009లో రామ్‌పూర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఆజం ఖాన్ మీద చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2004 ఎన్నికల్లో ఆజం ఖాన్ జయప్రద తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న వారు కొద్ది బద్ద శత్రువుల్లా మారారు. -
అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నీళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే తనకు శరణ్యమని వాపోయారు. అసెంబ్లీలో సోమవారం జీరో అవర్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కల్పనాథ్ పాశ్వాన్ తన సమస్యను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అజాంగఢ్‌లోని ఓ హోటళ్లో ఉండగా తన వద్ద ఉన్న రూ. 10 లక్షలను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు చేతులెత్తి దండం పెడ్తున్నా. ఇక్కడ కాకపోతే నాకు ఇంకెక్కడ న్యాయం లభిస్తుంది? నేను చాలా పేదవాడిని.. ఆ డబ్బు తిరిగి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు’ అంటూ ఏడ్చేశారు. ఎమ్మెల్యేనైన తనకే న్యాయం జరక్కపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సభలోని ఇతర ఎమ్మెల్యేలు కల్పనాథ్ సీటుకు దగ్గరికి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో, న్యాయం జరిగేలా చూస్తానని శాసనసభ వ్యవహారాల మంత్రి సురేశ్ ఆయనకు హామీ ఇచ్చారు. -
ఈ ఫొటో జర్నలిస్టు హృదయాలు కదిలించాడు
డెమాస్కస్: హృదయాన్ని కదిలించే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువమంది మాత్రమే అలాంటివాటికి స్పందిస్తుంటారు. ఈరోజుల్లో అయితే జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా కూసింత సాయం చేయకుండా దానిని వీడియో తీయడమో, ఫొటోలో తీయడమో చేసి సోషల్ మీడియాలో పెట్టి క్రేజ్ సంపాధించుకోవాలనుకుంటారు. కానీ, సిరియాలో ఓ ఫొటో జర్నలిస్టు మాత్రం తన వృత్తిధర్మాన్ని పక్కకు పెట్టి మానవత్వాన్ని ముందుకు తెచ్చాడు. తనముందు జరిగిన సంఘటనను చూసి చలించిపోయి కాసేపు నిశ్చేష్టుడిగా మారి అనంతరం మేలుకొని నిజమైన వ్యక్తిలా కదిలాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తన చుట్టూ అక్కడక్కడ పడి ఉన్న చిన్నారులపై వైపు చూసి గుండెలు పగిలేలా రోధించాడు. కెమెరా ఉండగానే రెండు చేతుల్లోకి ఓ చిన్నారిని తీసుకొని అంబులెన్స్ వైపు పరుగులు తీశాడు. ఇదంతా సిరియాలో అనూహ్యంగా వారం కిందట చోటు చేసుకున్న బాంబుదాడి జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యమాలిక. పశ్చిమ అలెప్పోలోని రషిదిన్ల స్వాధీనంలో ఉన్న పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఓ చిప్స్ ప్యాకెట్స్ పట్టుకొని కారు దగ్గర నిల్చున్న వ్యక్తి చిన్నారులను దగ్గరకు పిలుస్తున్నాడు. అక్కడే ఫొటో గ్రాఫర్ల బృందం కూడా ఉంది. ఆలోగా అనూహ్యంగా ఓ భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. క్షణాల్లో 126మంది బలయ్యారు. వారిలో 80మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లలో ఒకరైన అబ్ద అల్కదేర్ హబాక్ అనే వ్యక్తి ఆ సంఘటనను చూసి కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తేరుకొని తన మిగితా ఫొటో గ్రాఫర్లకు ఆదేశాలు ఇచ్చి ఫొటోలు తీయడం ఆపేసి సహాయక చర్యలకు దిగాడు. ఎటు చూసిన విగత జీవులై పడి ఉన్న చిన్నారులను రోదించాడు. హబాక్ తొలిసారి ఓ చిన్నారి వద్దకు వెళ్లగా అతడు చనిపోయి ఉన్నాడు. మరో రెండడుగులు వేయగా కొన ఊపిరితో ప్రాణంకోసం ఓ బాలుడు అల్లాడుతున్నాడు. దాంతో కన్నీటి పర్యంతమైన హబాక్ అతడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే మరో చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ప్రాణాలుకోల్పోయి కనిపించాడు. ఇలా అంతా చనిపోయి ఉండటం చూసి మొకాళ్లపై కూలబడి కుమిలికుమిలి ఏడ్చాడు. ఈ చిత్రాలను అతడి సహచర ఫొటో గ్రాఫర్లు తీసి ఆన్లైన్లో పెట్టగా లక్షల మంది వీక్షించారు. అతడు చూపించిన జాలి ప్రేమపట్ల నెటిజన్లు శబాష్ ఫొటో జర్నలిస్టు అంటున్నారు. -
కన్నీళ్లు పెట్టిన ఎంపీ
లక్నో: తాను సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ములాయం సోదరుడు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. అధికారికంగా పనిచేయనప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు. ఇటావాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. స్వప్రయోజనాల కోసం పాకులాడలేదని పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటే, తనకు న్యాయం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీతో చేతులు కలిపి సమాజ్ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రాంగోపాల్ యాదవ్ ను బహిష్కరించారు. అఖిలేశ్ యాదవ్ సర్కారు ఇమేజ్ ను దెబ్బీయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ములాయం కుటుంబ వివాదంలో అఖిలేశ్ కు మద్దతుగా ఆయన నిలబడ్డారు. కాగా, రాజ్యసభలో ఎస్పీ నేతగా రాంగోపాల్ స్థానంలో మరొకరిని నియమించేందుకు ములాయం సింగ్ కసరత్తు ప్రారంభించారు. -
సమాజ్‌వాదీలో పరివార్
పార్టీ సమావేశంలో వీధికెక్కిన కుటుంబ విభేదాలు - ములాయం, అఖిలేశ్, శివ్పాల్ల మధ్య మాటల తూటాలు - నాన్న ఆదేశిస్తే తప్పుకుంటా, కొత్త పార్టీ ఎందుకు పెట్టాలి?: అఖిలేశ్ - నీ సామర్థ్యమెంత? ఎన్నికల్లో గెలవగలవా? అమర్ సోదరుడితో సమానం : ములాయం - సీఎం పగ్గాలను ములాయం చేపట్టాలి: శివ్‌పాల్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సోమవారం రోడ్డెక్కాయి. పార్టీ నేతలు, కార్యకర్తల సాక్షిగా బాబాయ్, అబ్బాయ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్, బాబాయ్ శివపాల్‌లు మాటల తుటాలతో తలపడ్డారు. తండ్రి ఆదేశిస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ స్పష్టం చేయగా... తమ్ముడు శివపాల్, స్నేహితుడు అమర్‌సింగ్‌ల పక్షాన నిలిచిన ములాయం... ‘నువ్వెంత? నీ సామర్థ్యమెంత? గీత దాటితే సహించన’ంటూ కొడుకును తీవ్రంగా హెచ్చరించారు. సీఎంను మార్చే ఉద్దేశం లేదనీ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ భేటీలో, వెలుపల నినాదాలతో హోరెత్తించారు. మూడు నెలల అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలికేందుకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ లక్నోలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. అఖిలేశ్, శివ్‌పాల్‌లు వేదికపైనే గొడవపడడంతో రాజీ లేకుండానే భేటీ అర్ధంతరంగా ముగిసింది. సమావేశానికి అఖిలేశ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆవేశంగా ప్రసంగించారు. ములాయం కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరు నిజాయతీ పరులని ములాయం భావిస్తే వారిని సీఎంగా నియమించండి. నేనేందుకు కొత్త పార్టీ పెట్టాలి?’ అని ప్రశ్నించారు. తండ్రే నాకు గురువు.. అఖిలేశ్: ‘నా తండ్రే నాకు గురువు... చాలా మంది మా కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏదైనా తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలో సొంతంగా నేర్చుకున్నా’ అంటూ అమర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. అక్టోబర్‌లో భారీ మార్పు జరుగుతుందంటూ అతను(అమర్) ముందే చెప్పాడని వెల్లడించారు. పార్టీ రజతోత్సవాలకు సీఎం రాకపోవచ్చని అందరూ భావించగా. ‘నా రథయాత్ర కొనసాగుతుంది... వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం’ అని స్పష్టం చేశారు.తన పరిధి దాటి ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. శివ్‌పాల్ కృషిని మర్చిపోలేను: ములాయం ఎస్పీ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని, పార్టీ సభ్యులు ఒకరితో ఒకరు గొడవపడొద్దని ములాయం సూచించారు. ‘అమర్, శివ్‌పాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించను. నేను జైలుకు వెళ్లకుండా అమర్ నన్ను కాపాడారు. అతను నాకెంతో సాయం చేశారు. అమర్ నాకు సోదరుడితో సమానం. కేవలం ఎర్ర టోపీ పెట్టుకుంటే సమాజ్‌వాదీ సభ్యులు కారు. కొందరు మంత్రులు భజనపరులు. శివపాల్ కృషిని నేను మర్చిపోలేను. శివ్‌పాల్ ప్రజానేత.పార్టీ బలోపేతానికి నేనెంతో కష్ట్టపడ్డా. లోహియా సిద్ధాంతాల్ని అనుసరించి పేదలు, రైతుల కోసం పోరాడాను’ అని పేర్కొన్నారు. ఒక దశలో అఖిలేశ్‌ను ఉద్దేశించి... ‘నీ సామర్థ్యం ఎంత? నువ్వు ఎన్నికల్లో గెలవగలవా? విమర్శల్ని సహించలేనివారు నేతలు కాలేరు. విమర్శ సరైనదైతే, అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుంది’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమర్‌లో నాలుగో వంతు చేయవు: శివ్‌పాల్ అఖిలేశ్‌పై తొలిసారి బాబాయ్ శివపాల్ బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పెడతానని సీఎం నాతో చెప్పారు. అలాగే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటానన్నారు. ఈ విషయంలో గంగాజలంపై ప్రమాణం చేస్తా. ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టమని అన్నయ్యను కోరుతున్నా’ అని ఉద్వేగంతో అన్నారు. ‘నీ విలువ అమర్‌లో నాలుగో వంతు కూడా చేయదు’ అని అఖిలేశ్‌ను పరోక్షంగా తప్పుపట్టారు. మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకి చెందిన క్యూఈడీ పార్టీ ఎస్పీ విలీన అంశంపై స్పందిస్తూ.. అ న్సారీని పార్టీలోకి ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు సులువుగా గెలిచేందుకు విపక్ష ఎమ్మెల్యేల మద్దతుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో నా పాత్ర ఏమీ లేదా? నా ఆధ్వర్యంలోని శాఖలు సమర్థంగా పనిచేయలేదా? విపక్ష నేతలూ నా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఏది సరిగా చేయలేదో సీఎం చెప్పాలి. నన్ను ఆహ్వానించకపోయినా... నేను సీఎం ఇంటికి వెళ్లేవాడిని’ అని అన్నారు. అఖిలేశ్, శివపాల్ వర్గాలకు చెందిన కార్యకర్తలు తామేం తీసిపోలేదంటూ లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అఖిలేశ్‌కు నా ఆశీస్సులు: అమర్‌సింగ్ తనపై ఆరోపణలు, ప్రశ్నలకు కొన్నిసార్లు మౌనం మంచి సమాధానం అవుతుందని అమర్ సింగ్ అన్నారు. అఖిలేశ్ తమ అధినేత కుమారుడని, అతనికి తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. మళ్లీ సయోధ్య? ములాయంతో అఖిలేశ్, శివ్‌పాల్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: అఖిలేశ్, శివపాల్‌ల మధ్య సోమవారం గొడవ అనంతరం తాత్కాలిక సంధి కోసం ములాయం పావులు కదిపారు. సీఎంగా అఖిలేశ్ కొనసాగుతారని, పార్టీ బాధ్యతలు శివ్‌పాల్ చూసుకుంటారనే ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఇక మాట్లాడేది లేదని, తన ఆరోగ్యం సరిలేదని ములాయం స్పష్టం చేశారు. ఇరు వర్గాలు కొంత మేర శాంతించాయని, త్వరలోనే సంధి కుదిరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోమవారం రాత్రి అఖిలేశ్, శివపాల్‌లు ములాయంతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ పార్టీ టికెట్లు తమ వర్గీయులకే ఇప్పించుకునే క్రమంలో ఈ కుమ్ములాటలు మొదలయ్యాయని భావిస్తున్నారు. సీఎంకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇస్తే పార్టీ ఓటమి తప్పదని శివ్‌పాల్ వాదన. తమ వర్గీయులకు టికెట్లు రాకుండా అడ్డుపడుతున్నారనేది అఖిలేశ్ ఆరోపణ. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో తానే నిర్ణయిస్తానని ములాయం వారిద్దరికీ స్పష్టం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉందని, ఈ సమయంలో ఆధిపత్యం కోసం గొడవ అవివేకమని ములాయం చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ కుమ్ములాటలతో పలు వర్గాలతో పాటు ప్రత్యేకించి మైనార్టీలకు పార్టీ దూరమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ తగాదాలతో బహుజన్ సమాజ్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ. అఖిలేశ్ సీఎంగా ఉన్నా.. పాలనలో ములాయం జోక్యం కొనసాగుతూనే ఉం ది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అనితాసింగ్ ద్వారా వ్యవహారాల్ని ములాయం చక్కబెట్టేవారు. ఈ విషయంలో అఖిలేశ్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కీలక శాఖలైన నీటి పారుదల, పీడబ్ల్యూడీ(ప్రజా పనులు) శివ్‌పాల్ ఆధ్వర్యంలో ఉండడం తో భారీ ప్రాజెక్టులు ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆ శాఖలకు సంబంధించి తన మాట చెల్లుబాటు అవ్వకపోవడం అఖిలేశ్‌కు ఆగ్రహం తెప్పించింది. -
కన్నీళ్లు పెట్టిన అఖిలేశ్ యాదవ్
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో చీలిక దిశగా వెళుతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మౌనం వీడారు. తన తండ్రితో ఎటువంటి విభేదాలు లేవని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. లక్నోలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాదని అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనపై చర్య తీసుకున్నారని వాపోయారు. 'నేను కొత్త పార్టీ పెడతానని కొంత మంది అంటున్నారు. కొత్త పార్టీ ఎవరు పెడుతున్నారు. నేనైతే పార్టీ పెట్టడం లేద'ని అఖిలేశ్ అన్నారు. అయితే అఖిలేశ్ కు భిన్నమైన వాదన వినిపించారు శివపాల్ యాదవ్. కొత్త పార్టీ పెడతానని తనతో అఖిలేశ్ స్వయంగా చెప్పాడని వెల్లడించారు. పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకున్నారు. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నారు. ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ములాయం ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తా. ములాయం కోరితేనే ప్రజాపతిని మంత్రి పదవి నుంచి తొలగించాను. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు. -
'ఆ వార్త విని షాక్ అయ్యాను'
న్యూఢిల్లీ: భారత మహిళ హాకీ జట్టు నుంచి తనను తప్పించడంపై రీతూ రాణి ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎందుకు జట్టులోంచి తీసేసారో చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకుంది. చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియో ఒలింపిక్స్ కు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. 'ఈ వార్త విని షాకయ్యాను. ఫిట్నెస్, ప్రవర్తన సమస్యలు లేవు. ట్రైనింగ్, క్యాంపులకు నేను గైర్హాజరు కాలేదు. క్యాంపుకు బ్రేక్ ఇచ్చినప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. జట్టులోంచి తీసేయడంతో నన్ను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి చాలా బాధ పడ్డాడు. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న పురుషుల హాకీ జట్టు ప్లేయర్ సర్దార్ సింగ్ ను కెప్టెన్ పదవి నుంచి తీసేసినా, టీమ్ లో ఉంచారు. నన్ను మాత్రం ఏకంగా జట్టులోంచి తొలగించారు. నాకు ఈవిధంగా ఎందుకు చేశార'ని రీతూ రాణి ప్రశ్నించింది. తనపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. ఒలింపిక్స్ మ్యాచ్ లను టీవీలో చూడాల్సిన పరిస్థితి తనకు వస్తుందని ఊహించలేదని వాపోయింది. -
కన్నీళ్లు పెట్టిన హీరోయిన్
ముంబై: బాలీవుడ్ డాన్సింగ్ దేవత మాధురి దీక్షిత్ టీవీ సెట్లో కన్నీళ్లు పెట్టుకుంది. పార్కిస్సన్ వ్యాధి ఇతివృత్తంతో సాగిన నృత్య ప్రదర్శన చూసి ఆమె చలించిపోయింది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షో సెట్లో షంపా అనే యువతి డాన్స్ చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేక మాధురి దీక్షిత్ ఏడ్చేసింది. పార్కిస్సన్ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి ప్రేమకథ ఆధారంగా రియాన్ తో కలిసి షంపా చేసిన నృత్యం సెట్లో ఉన్నవారందరినీ కదిలించింది. 'షంపా అపారమైన ప్రతిభ కలిగిన డాన్సర్. పార్కిస్సన్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని తన డాన్స్ ప్రదర్శనతో తెలియజెప్పింది. మన సమాజంలో పార్కిస్సన్ తో బాధ పడుతున్న వారి కుటుంబాలకు మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. షంపా, రియాన్ నృత్యప్రదర్శన హృదయానికి హత్తుకునే ఉంది. బావోద్వేగాలు బాగా పండించార'ని మాధురి దీక్షిత్ పేర్కొంది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షోకు మాధురితో పాటు కొరియో గ్రాఫర్లు టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్ జడ్డిలుగా వ్యవహరిస్తున్నారు. -
మోదీ ముందు సుప్రీం చీఫ్ జస్టిస్ కంటతడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రధాని నరేంద్రమోదీ ముందు కంటతడి పెట్టారు. మొత్తం భారాన్ని న్యాయవ్యవస్థపైనే వేయొద్దని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరింతమంది న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. 'దేశ అభివృద్ధికోసం నేను మిమ్మల్ని(కేంద్ర ప్రభుత్వాన్ని) వేడుకుంటున్నాను. న్యాయవ్యవస్థపై మొత్తం భారాన్ని మోపవద్దు.. ప్రపంచ దేశాలతో ఒక్కసారి మా కార్యశీలతను పోల్చి చూసుకోండి' అని అన్నారు. మోదీగారు.. ఎఫ్‌డీఐ, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు.. దాంతోపాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా అవసరం అని గుర్తించాలి అని ఆయన చెప్పారు. అమెరికాలో న్యాయమూర్తులు కేవలం 81 కేసులను పరిష్కరిస్తుంటే ఒక భారతీయ జడ్జీ మాత్రం కనీసం 2,600 కేసులు చూస్తున్నారని.. వారిపై ఎంతటి భారం పడుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. -
కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చిత
-
పార్టీ నేతల మధ్య మఫ్తీ కంటతడి
శ్రీనగర్: తన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ నేత మెహబూబా మఫ్తీ కంటతడిపెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే విషయంపై మౌనం వహించారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు మెహబూబానే స్వీకరిస్తారని చెప్తూ వస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ కూడా మెహబూబాకు ఇప్పటి వరకు స్పష్టమైన మద్దతుపై బహిరంగ ప్రకటనా చేయలేదు. అదీ కాకుండా ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీలు ఆమెను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అయితే, తాము కేవలం సంతాపం తెలిపేందుకే వచ్చామని, ఎలాంటి రాజకీయాలు చేసే ఉద్దేశంతో రాలేదని ఇరువురు నేతలు ప్రకటించారు. వీరి భేటీ అనంతరం పీడీపీ నేతలతో మెహబూబా భేటీ అయ్యి కేవలం పార్టీ బలోపేతంపైనే చర్చించారని, సీఎం పీఠం విషయంపై ఎలాంటి స్పందన, అభిప్రాయం చెప్పలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అదే సమయంలో సమావేశంలో కంటతడిపెట్టారని కూడా వివరించారు. -
కోర్టులో కన్నీళ్లు పెట్టిన సల్మాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సల్మాన్ ఖాన్ ట్విటర్ లో స్పందించాడు. న్యాయస్థానం తీర్పును వినమ్రతతో స్వీకరిస్తున్నారని పేర్కొన్నాడు. 'కోర్టు నిర్ణయాన్ని వినయంతో స్వీకరిస్తున్నా. నేను నిర్దోషిగా బయట పడాలని ప్రార్థనలు చేసినందుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెల్పుకుంటున్నా' అని సల్మాన్ గురువారం సాయంత్రం ట్వీట్ చేశాడు. కేసు నుంచి తనకు విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువడగానే కోర్టులో ఉద్వేగానికి లోనయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ పాస్ పోర్టును అతడికి తిరిగి ఇచ్చేయాలని ముంబై పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో నమోదైన అన్ని అభియోగాల నుంచి సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు విముక్తి కల్పించింది. I accept the decision of the judiciary with humility. I thank my family, friends & fans for their support & prayers . — Salman Khan (@BeingSalmanKhan) December 10, 2015