కన్నీళ్లు పెట్టిన హీరోయిన్
ముంబై: బాలీవుడ్ డాన్సింగ్ దేవత మాధురి దీక్షిత్ టీవీ సెట్లో కన్నీళ్లు పెట్టుకుంది. పార్కిస్సన్ వ్యాధి ఇతివృత్తంతో సాగిన నృత్య ప్రదర్శన చూసి ఆమె చలించిపోయింది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షో సెట్లో షంపా అనే యువతి డాన్స్ చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేక మాధురి దీక్షిత్ ఏడ్చేసింది. పార్కిస్సన్ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి ప్రేమకథ ఆధారంగా రియాన్ తో కలిసి షంపా చేసిన నృత్యం సెట్లో ఉన్నవారందరినీ కదిలించింది.
'షంపా అపారమైన ప్రతిభ కలిగిన డాన్సర్. పార్కిస్సన్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని తన డాన్స్ ప్రదర్శనతో తెలియజెప్పింది. మన సమాజంలో పార్కిస్సన్ తో బాధ పడుతున్న వారి కుటుంబాలకు మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. షంపా, రియాన్ నృత్యప్రదర్శన హృదయానికి హత్తుకునే ఉంది. బావోద్వేగాలు బాగా పండించార'ని మాధురి దీక్షిత్ పేర్కొంది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షోకు మాధురితో పాటు కొరియో గ్రాఫర్లు టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్ జడ్డిలుగా వ్యవహరిస్తున్నారు.