సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి పాలైన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. గుర్జీత్ కౌర్ అసమాన ప్రదర్శనతో ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసినప్పటికీ చివరి క్వార్టర్‌లో బ్రిటన్‌కి హ్యాట్రిక్ పెనాల్టీ కార్నర్‌లు జట్టుకు విజయాన్ని దూరం చేశాయి. అయినా 130 కోట్ల మంది దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ నెటిజన్లు జట్టును అభినందించారు.
అటు అద్భుతంగా ఆడారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రశంసించారు. ఫోన్ ద్వారా ప్రధాని మోదీ జట్టు సభ్యులు, కోచ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు తీవ్రంగా ఏడవటం ప్రారంభించారు. అయితే ప్రధాని మోదీ వారిని అనునయించి దేశం మీ గురించి గర్వపడుతుందంటూ ప్రోత్సాహకరంగా వ్యాఖ్యానించారు.
కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీంకు భారీ నిరాశ ఎదురైంది. గ్రేట్ బ్రిటన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ భారత మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఈ పరాజయాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మరో కాంస్య పతకం దక్కకుండా పోయింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచ్ లోతొలి క్వార్టర్‌లో రెండు టీమ్‌లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. కానీ రెండో క్వార్టర్ లో బ్రిటన్ రెండు గోల్స్ సాధించగా, ఇండియా మూడు గోల్స్‌తో ఆధిపత్యాన్ని చాటుకుంది. 25, 26వ నిమిషంలో గుర్జీత్ కౌర్ రెండు వరుస గోల్స్ చేయగా 29వ నిమిషంలో మూడో గోల్ చేసింది నందనా కటారియా. ఫలితంగా రెండో క్వార్టర్‌లో ముందంజలో ఉన్నా, మూడు నాలుగు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ప్రధానంగా నాలుగో క్వార్టర్ వైఫల్యంతో ఇండియా పరాజయం పాలైంది..
#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
Comments
Please login to add a commentAdd a comment