Viral Video: Kiara Advani Crying While Watching Shershaah Funeral Scene - Sakshi
Sakshi News home page

Shershaah: వెక్కి వెక్కి ఏడ్చిన కియారా అద్వానీ వీడియో వైరల్‌

Published Fri, Aug 20 2021 4:20 PM | Last Updated on Fri, Aug 20 2021 7:34 PM

Shershaah funeral scene: Kiara Advani breaks down watch viral video - Sakshi

సాక్షి,ముంబై: హీరోయిన్‌ కియారా అద్వానీ తన సినిమా చూసి తనే వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన వైరల్‌గా మారింది. కార్గిల్ వార్ హీరో కెప్టెన్‌ విక్రమ్ భాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ సినిమాలోని క్లైమాక్స్‌ సీన్లను చూస్తూ ఉద్వేగంతో విలపించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు విక్రమ్‌ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని చూస్తూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ కూడా అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ కామెట్‌ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఎమోషనల్‌ సీన్‌ అని కొందరు, ‘నేను కూడా ఈ సన్నివేశంలో చాలా ఏడ్చేశాను" అని మరొకరు వ్యాఖ్యానించారు. 

సినిమా తరువాత తాను  కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని,  తాను అచ్చం  డింపుల్‌లా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని కియారా ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెను  బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. విక్రమ్‌ మరణం తరువాత అవివాహితగానే ఉండిపోయిన డింపుల్ చీమా చండీగఢ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారని కియార్‌ తెలిపారు.

కాగా 25 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రా  పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా నటించగా, అతని ప్రేయసి డింపుల్ చీమాగా కైరా నటించింది. విక్రమ్ చనిపోయిన తరువాత డింపుల్‌ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేయడం, స్నేహితుడు సన్నీ న్యాయవాది వృత్తిలో కొనసాగడం వంటివి ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి.  విక్రమ్ చేసిన త్యాగానికి గానూ ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో సత్కరించిన దృశ్యాలను కూడా చూపించారు.  మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, కార్గిల్‌  యుద్ధ సన్నివేశాలు లాంటి దృశ్యాలతో పాటు, విక్రమ బాత్రా అంత్యక్రియల వరకూ చాలా ఎమోషన్‌ల్‌గా తీర్చిదిద్దిన దర్శకుడు విష్ణువర్ధన్‌ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు షేర్‌షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement