Watching
-
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
కేసీఆర్ ఎక్కడున్నా ‘రజాకార్’ చూడాలి
కరీంనగర్ టౌన్: నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘రజాకార్’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మమత థియేటర్లో రజాకార్ చిత్ర యూనిట్, బీజేపీ కార్యకర్తలతో కలిసి సినిమా చూసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియంత నిజాం, రజాకార్ల రాక్షస పాలనపై తెలంగాణ ప్రజ లు చేసిన పోరాటాల చరిత్రను అద్భుతంగా తెరపై చూపించారని కొనియాడారు. ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను ప్రజలకు అందించిన దర్శక, నిర్మాతలు యాట సత్యనారాయణ, గూడూరు నారాయణరెడ్డిని అభినందించారు. కేసీఆర్ ఎక్కడున్నా రజాకార్ సినిమా చూడాలన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత కూడా నిజాం గొప్పోడు, రజాకార్లు మంచోళ్లని అనిపిస్తే నిరభ్యంతరంగా కేసీఆర్ ‘ట్వీట్’చేయొచ్చు అని సూచించారు. అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కేసీఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయవచ్చని పేర్కొన్నారు. -
వీడియోలు చూడటానికి ఇదే ఫేవరెట్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో వీడియోల వీక్షణకు ఎక్కువ మంది యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి అయిదుగురిలో నలుగురు తమ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్‌ను ఇంటర్నెట్ ఆధారిత టీవీల్లో చూసే వారి సంఖ్య గణనీయంగా ఉంటోందని తెలిపింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్ (తక్కువ నిడివి ఉండే వీడియోలు) సగటు రోజువారీ వీక్షణలు 120 శాతం మేర పెరిగినట్లు సంస్థ తెలిపింది. షార్ట్స్ వీక్షకుల్లో 96 శాతం మంది .. 18–44 ఏళ్ల వయస్సు మధ్య వారు ఉంటున్నారని పేర్కొంది. కంటెంట్ అప్లోడ్స్ 40 శాతం పెరిగినట్లు యూట్యూబ్ వివరించింది. -
భార్య డెలివరీ చూసి, మతిస్థిమితం కోల్పోయిన భర్త.. డబ్బుల కోసం డిమాండ్!
గర్భధారణ, పిల్లలు పుట్టడం గురించి బహిరంగంగా చర్చించని సమయం గతంలో ఉండేది. నాటి రోజుల్లో ఈ విషయాలను గోప్యంగా ఉంచడం సరైనదని చాలామంది భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్య గర్భం ధరించినది మొదలు అడుగడుగునా ఆమెకు తోడుగా భర్త ఉంటున్నాడు. కొన్ని దేశాల్లో భార్య డెలివరీ సమయంలో భర్త అక్కడే ఉండి, డెలివరీ ప్రక్రియనంతా చూసే అవకాశం కూడా ఉంది. భార్యకు భరోసానిచ్చేందుకే భర్తకు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య ప్రసవ సమయంలో శస్త్రచికిత్స గదిలోనికి వెళ్లి, డెలివరీ ప్రక్రియనంతా చూశాడు. భార్యకు జరిగిన సి-సెక్షన్ డెలివరీ, బిడ్డ పుట్టడం మొదలైనవి చూసిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాడు. కోలుకున్న తరువాత అతను.. తన భార్యకు జరిగిన డెలివరీ తన మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని, అది తనకు మానసిక వ్యాధిగా పరిణమించిందని ఆరోపిస్తూ ఆసుపత్రిపై కేసు వేశాడు. ఆ భర్త పేరు అనిల్ కొప్పుల. 2018లో అతని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సి-సెక్షన్ ద్వారా ఆమెకు డెలివరీ జరిగింది. అమెకు డెలివరీ జరిగిన దృశ్యాన్ని చూసిన వెంటనే తాను మానసికంగా అస్వస్థతకు లోనయ్యానని అనిల్ ఆరోపించాడు. తరువాత అతను మెల్బోర్న్లోని రాయల్ ఉమెన్స్ హాస్పిటల్‌పై కేసు పెట్టాడు. ప్రసవాన్ని చూసేందుకు ఆసుపత్రి యాజమాన్యం తనను ప్రోత్సహించిందని కొప్పుల ఆరోపించారు. సర్జరీ దృశ్యాన్ని చూశాక తన మానసిక పరిస్థితి క్షీణించిందని, అందుకే ఆసుపత్రి వర్గాలు తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోరాడు. కోర్టులో విచారణ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన మానసిక అనారోగ్యం కారణంగా భార్యతో విడాకులు కూడా తీసుకోవలసి వచ్చిందని, అందుకే తాను పరిహారం పొందేందుకు అర్హుడని పేర్కొన్నాడు. అయితే భార్య ప్రసవ సమయంలో అనిల్ ఆరోగ్యం బాగానే ఉన్నదని, అతను ఎటువంటి ఇబ్బంది పడలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటువంటి నిరాధారమైన కేసును మూసివేయాలని ఆసుపత్రి వర్గాలు కోర్టును కోరాయి. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
‘మిస్టర్ గాంధీ కేసును గమనిస్తున్నాం’
రాహుల్ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హత వేటు పరిణామంపై అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్‌కు సోమవారం(అక్కడి కాలమానం ప్రకారం) మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్ గాంధీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) కేసును మేము గమనిస్తూనే ఉన్నాం.. భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను(భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన. అయితే.. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు. కాగా, కాగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’(2019లో చేసినవి) వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. విపక్షాలన్నింటిని ఏకం చేసుకుని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. (చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి) -
లైవ్ లోనే అందరి ముందు కంటతడి పెట్టిన బీజేపీ సీఎం
-
సెలవు కావాలని వైరల్ లేఖ
యశవంతపుర: సినిమా చూడడానికి సెలవు ఇవ్వాలని సీసీబీ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాయగా సెలవు మంజూరైంది. జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆనంద భార్యతో కలిసి సినిమా చూడాలని అనుకున్నాడు. ఇందుకోసం లేఖ రాసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో అది వైరల్ అయ్యింది. ఆరుగురికి గౌరవ డాక్టరేట్లు బుధవారం జరిగిన గుల్బర్గా వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ గెహ్లాట్ ఆరుమందికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. సిద్ధరామ శరణ, డాక్టర్ బసవరాజ పాటిల్ అట్టూర, వేణుగోపాల హేరూరు, గురమ్మ, అబ్దుల్లా కున్హి, రాధాకృష్ణ దేసిరాజులకు బహూకరించారు. ఈ సందర్భంగా పీజీ పట్టభద్రులకు పట్టాలు, ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు. చారిత్రక కోటను గవర్నర్ సందర్శించారు. (చదవండి: రోడ్డుపై అంకుల్ స్టెప్పులు.. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి..) -
యూట్యూబ్ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే?
నరసరావుపేట (గుంటూరు జిల్లా): యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకు దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సి.విజయభాస్కరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రాజేష్‌కుమార్ ఐటీఐ చదివాడు. ఏ పనీ చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో బ్యాంకు చోరీల వీడియోలు చూసి మార్చి 30వ తేదీ అర్ధరాత్రి ఫిరంగిపురంలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు. తొలుత బ్యాంకులో అలారం వైర్లు కట్ చేసిన రాజేష్‌కుమార్ కిటికీ ఊచలు కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. స్ట్రాంగ్‌రూమ్ తాళాలు కట్టర్ ద్వారా కట్‌చేసి సేఫ్ లాకర్ తెరిచేందుకు యత్నించాడు. ఆ లాకర్ బ్యాంక్ మేనేజర్ ఫోన్‌కు అనుసంధానమై ఉండడంతో ఆ మొబైల్ అలారమ్ మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మేనేజర్ సిబ్బందిని బ్యాంకు వద్దకు పంపారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసు శాఖ రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట టుటౌన్ ఏఎస్ఐ జీవీ సుబ్బారావు, నరసరావుపేట రూరల్ ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఫిరంగిపురం, నాదెండ్ల ఏఎస్ఐలు కె.శ్రీనివాసరావు, రోసిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీధర్, నాదెండ్ల హోంగార్డు కె.మధుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని గ్రిల్స్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో గుంటూరు గాంధీపార్కుకు ఎదురుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రాజేష్‌కుమార్ రూ.23 లక్షలు చోరీ చేయగా, లాలాపేట పోలీసులు అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చిన రాజేష్‌కుమార్ మళ్లీ ఫిరంగిపురం ఎస్బీఐలో చోరీకి యత్నించాడు. దర్యాప్తు చేసిన సిబ్బందిని రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించి రివార్డుకు సిఫార్సు చేశారని డీఎస్పీ చెప్పారు. -
సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్ చూసి ఏం చేశారంటే..
పలమనేరు(చిత్తూరు జిల్లా): యూట్యూబ్‌లో చూసి ఏటీఎంలలో డబ్బు చోరీ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి(41), పొలకల నరేష్(29), మాధవరెడ్డి (25), గుడుపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి(21) తిరుపతిలో ఉంటూ స్నేహితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు. చదవండి: మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది అనంతరం చెన్నై వెళ్లి పరికరాలను కొనుగోలు చేశారు. ఎట్టేరిలో రిహార్సల్స్ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాళెం ఏటీఎంలో చోరీకి యత్నించారు. సైరన్ శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటి రోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయతి్నంచారు. సైరన్ రాకుండా చూసుకున్నారు. ఏటీఎంలో రహస్యంగా అమర్చిన చిప్, మైక్రో కెమెరా ద్వారా సమాచారం ముంబయిలోని ఎస్బీఐ కార్యాలయానికి చేరింది. అధికారులు ఏటీఎం లొకేషన్ ఆధారంగా పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లేలోపు అక్కడినుంచి ఉడాయించారు. డీఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. వాహనాల తనిఖీతోపాటు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. దుండగులు వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న పలమనేరు సమీపంలోని గంటావూరు ప్ల్రైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా కారు వేగంగా వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. వారిని సీఐ భాస్కర్, ఎస్ఐ నాగరాజు గురువారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారు, గ్యాస్ కట్టర్, పరికరాలు, గ్లౌజులను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న స్థానిక ఐడీ పార్టీ పోలీసులు శ్రీనివాసులు, అల్లాఉద్దీన్, ప్రకాష్, శశి, ప్రభాకర్, బాలాజీకి డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. -
ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్
సాక్షి,ముంబై: హీరోయిన్ కియారా అద్వానీ తన సినిమా చూసి తనే వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన వైరల్‌గా మారింది. కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ సినిమాలోని క్లైమాక్స్ సీన్లను చూస్తూ ఉద్వేగంతో విలపించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు విక్రమ్ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని చూస్తూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ కామెట్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా ఎమోషనల్ సీన్ అని కొందరు, ‘నేను కూడా ఈ సన్నివేశంలో చాలా ఏడ్చేశాను" అని మరొకరు వ్యాఖ్యానించారు. సినిమా తరువాత తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్‌లా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని కియారా ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెను బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. విక్రమ్ మరణం తరువాత అవివాహితగానే ఉండిపోయిన డింపుల్ చీమా చండీగఢ్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారని కియార్ తెలిపారు. కాగా 25 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా నటించగా, అతని ప్రేయసి డింపుల్ చీమాగా కైరా నటించింది. విక్రమ్ చనిపోయిన తరువాత డింపుల్ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేయడం, స్నేహితుడు సన్నీ న్యాయవాది వృత్తిలో కొనసాగడం వంటివి ఈ మూవీలో హైలెట్‌గా నిలిచాయి. విక్రమ్ చేసిన త్యాగానికి గానూ ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో సత్కరించిన దృశ్యాలను కూడా చూపించారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, కార్గిల్ యుద్ధ సన్నివేశాలు లాంటి దృశ్యాలతో పాటు, విక్రమ బాత్రా అంత్యక్రియల వరకూ చాలా ఎమోషన్‌ల్‌గా తీర్చిదిద్దిన దర్శకుడు విష్ణువర్ధన్ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by kiaraadvani_forever (@kiaraadvani_forever) -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్‌ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్‌వీర్ షేర్గిల్ -
‘గీత గోవిందం’ సినిమా చూసిన చిరు
-
కడుపుబ్బ నవ్విస్తున్న బైక్ దొంగతనం
-
గురుభక్తి చాటుకున్న ఐశ్వర్యరాయ్
-
రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం
న్యూఢిల్లీ: నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి టెస్ట్ చేయడం చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు పరీక్షించడం చూశాం.. ఇపుడు రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. ట్యాప్ లోంచి ధారాళంగా పడుతున్న నీటి కింద రూ.2000 నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ.. ఆదివారం సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ మీడియాలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. కాగా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేసింది. ఈ క్రమంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొత్త నెట్ సెక్యూరిటీ ఫీచర్స్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అపుడే నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయనే వార్తలు ప్రజల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
రూ.2 వేల టెస్టింగ్ వీడియో సంచలనం