మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment