కోర్టులో కన్నీళ్లు పెట్టిన సల్మాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సల్మాన్ ఖాన్ ట్విటర్ లో స్పందించాడు. న్యాయస్థానం తీర్పును వినమ్రతతో స్వీకరిస్తున్నారని పేర్కొన్నాడు. 'కోర్టు నిర్ణయాన్ని వినయంతో స్వీకరిస్తున్నా. నేను నిర్దోషిగా బయట పడాలని ప్రార్థనలు చేసినందుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెల్పుకుంటున్నా' అని సల్మాన్ గురువారం సాయంత్రం ట్వీట్ చేశాడు.
కేసు నుంచి తనకు విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువడగానే కోర్టులో ఉద్వేగానికి లోనయ్యాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ పాస్ పోర్టును అతడికి తిరిగి ఇచ్చేయాలని ముంబై పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో నమోదైన అన్ని అభియోగాల నుంచి సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు విముక్తి కల్పించింది.
I accept the decision of the judiciary with humility. I thank my family, friends & fans for their support & prayers .
— Salman Khan (@BeingSalmanKhan) December 10, 2015