మోదీ ముందు సుప్రీం చీఫ్ జస్టిస్ కంటతడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రధాని నరేంద్రమోదీ ముందు కంటతడి పెట్టారు. మొత్తం భారాన్ని న్యాయవ్యవస్థపైనే వేయొద్దని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరింతమంది న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. 'దేశ అభివృద్ధికోసం నేను మిమ్మల్ని(కేంద్ర ప్రభుత్వాన్ని) వేడుకుంటున్నాను.
న్యాయవ్యవస్థపై మొత్తం భారాన్ని మోపవద్దు.. ప్రపంచ దేశాలతో ఒక్కసారి మా కార్యశీలతను పోల్చి చూసుకోండి' అని అన్నారు. మోదీగారు.. ఎఫ్డీఐ, మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు.. దాంతోపాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా అవసరం అని గుర్తించాలి అని ఆయన చెప్పారు. అమెరికాలో న్యాయమూర్తులు కేవలం 81 కేసులను పరిష్కరిస్తుంటే ఒక భారతీయ జడ్జీ మాత్రం కనీసం 2,600 కేసులు చూస్తున్నారని.. వారిపై ఎంతటి భారం పడుతుందో అర్ధం చేసుకోవాలని అన్నారు.