బాంబు పేలుడులో ఇద్దరు సైనికుల దుర్మరణం | Bomb kills two soldiers in Colombia | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడులో ఇద్దరు సైనికుల దుర్మరణం

Published Sat, Aug 8 2015 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

Bomb kills two soldiers in Colombia

బొగొటా: ఓ చమురు క్షేత్రానికి సమీపంలో గుర్తుతెలియని దుండగులు పాల్పడిన శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు నేలకొరిగారు. కొలంబియాలోని సంతాందర్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ సంఘటన  జరిగింది.

వెనుజులా సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం వద్ద  ఆయిల్ పైప్ లైన్ మరమత్తులు జరుగుతుండగా  చనిపోయిన సైనికులిద్దరు అక్కడ కాపలా విధుల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏ సంస్థా పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement