ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్‌లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.
అయితే ఈ సిరీస్‌లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్‌పై వర్క్‌లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లి
ఇక ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడి తమ రిథమ్‌ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్‌తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment