militant attack
-
Picture of the Year award: అమానుష ఫొటోకు అవార్డా!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు. -
పాక్ ప్రతీకార చర్య.. ఇరాన్‌పై వైమానిక దాడులు
ఇస్లామాబాద్: ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. పాకిస్థాన్ కూడా ఇరాన్ వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఇరాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో నలుగురు పిల్లలతోపాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది. Sources in the Pakistani Armed Forces are reporting that the Air Force has conducted several Airstrike tonight on a Baloch Militant Group in Eastern Iran near the City of Saravan, roughly 20 Miles into the Sistan and Baluchestan Provence from the Border with Pakistan; Smoke is… pic.twitter.com/VKO8fjohWD — OSINTdefender (@sentdefender) January 18, 2024 ఇరాన్ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ రాయబారిపై వేటు వేసింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా స్పందించింది. ఇదీ చదవండి: పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు -
కుల్గాం ఘటన లష్కరే తోయిబా పనే : ఐజీ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బీజేపీ నేతలపై గురువారం జరిగిన దాడి వెనుక లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదులు ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కాగా కుల్గాం జిల్లా బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. కుల్గం ఘటనను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సమర్థించలేమని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ముగ్గురు బీజేపీ నేతల కాల్చివేత ) -
ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ నేతలను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనకు లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యతగా ప్రకటించుకుంది. కుల్గాం జిల్లా బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజం, ఉమర్ రషీద్ బేగ్ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఉగ్రవాదుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని విచారం.. కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల కాల్చివేతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్లో బీజేపీ ఎదుగుదలకు ఎంతోగానే శ్రమిస్తున్న యువ కార్యకర్తలను దారుణంగా హతమార్చడాన్ని ఖండించారు. బాధితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. I condemn the killing of 3 of our young Karyakartas. They were bright youngsters doing excellent work in J&K. My thoughts are with their families in this time of grief. May their souls rest in peace. https://t.co/uSfsUP3n3W — Narendra Modi (@narendramodi) October 29, 2020 -
ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య మరోసారి కాల్పుల మోత మోగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ సమీపంలో శనివారం పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అహాగ్‌బాబ్ క్రాసింగ్ సమీపంలో ఉన్న నూర్బాగ్ వద్ద సీఆర్పీఎఫ్, పోలీసులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (మాజీ ఈసీ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు) సోపోర్ పట్టణంలో విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారని స్థానిక ఎస్పీ తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, డ్రైవర్‌తో సహా ముగ్గురు పారా మిలటరీ సైనికులు గాయపడ్డారని ఎస్పీ ధృవీకరించారు. కాగా సంఘటన జరిగిన వెంటనే దాడికి తెగబడిన వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఎస్పీ తెలిపారు. (భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..) భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
బీజేపీ ఉపాధ్యక్షుడి కాల్చివేత
శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌కు కొద్దిగంటల ముందు అనంత్ నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ నివాసాన్ని చుట్టముట్టిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపారు. జిల్లాలోని నౌగ్రాం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2008, 2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దురూ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మిర్ చాలాకాలంగా బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మిర్‌కు భద్రతను అధికారులు ఉపసంహరించడంతో ఈ దారుణం జరిగిందని బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆరోపించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా మిర్‌కు భద్రతా సంస్ధలు భద్రతను కల్పించలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా మిర్‌కు భద్రతపై అధికారులకు తాము పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. మిర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఓ కుమారుడు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు విడతల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం జరగనున్న అయిదో దశ పోలింగ్‌కు 48 గంటల ముందు బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. -
ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి
- 10 మంది జవాన్ల మృతి, ఒకరికి గాయాలు కాందహార్: ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో ఐసిస్ మారణకాండ జరిగిన కొద్ది గంటలకే అఫ్ఘానిస్థాన్‌లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఫ్ఘాన్ సైనిక శిబిరంపై ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది జవాన్లు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కాందహార్ ఫ్రావిన్స దక్షిణ ప్రాంతంలోని షావలీ కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, దాడి జరిగిన సమయంలో క్యాంపులో 205 మంది సైనికులు ఉన్నారని అఫ్ఘాన్ రక్షణ శాఖ తెలిపింది. -
కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెంట్రల్ సెక్యురిటీ ఫోర్స్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాల పాలయ్యారు. దక్షిణ శ్రీనగర్‌లోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రారంభించే రోడ్డు ఓపెనింగ్ పార్టీలో అనుమానిత మిలిటెంట్లు గ్రనేడ్‌తో దాడికి పాల్పడారని పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్రెనేడ్ టార్గెట్ కోల్పోయి, రోడ్డు పక్కకు పేలిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆరీపీఎఫ్ జవాన్లు గాయాలు పాలయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. కశ్మీర్లో నెలకొన్న అల్లర్లకు కుల్గామ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎనౌకౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో మరణించిన 90మందిలో ఎక్కువగా కుల్గామ్ ప్రాంతానికి చెందిన వారే. -
జమ్ములో మాజీ మిలిటెంట్ పైకాల్పులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. తారీఖ్ అహ్మద్ పండిట్ పోలీసు శాఖలో ఉండి, అనంతరం ఉగ్రవాదిగా మారి బర్హాన్ వనీ గ్రూపులో చేరాడు. ఈ యేడాది మేలో పోలీసులకు లొంగిపోయాడు. తారీఖ్ అహ్మద్ అతని సోదరునిపై ఉగ్రవాదులు నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని కరీమాబాద్ లో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరళించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి
-
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి
దాడి వెనుక తీవ్రవాద సంస్థలు పీఎల్ఏ, కేవైకేఎల్ల హస్తం! ♦ గత ఇరవై ఏళ్లలో ఆర్మీపై జరిగిన భారీ దాడి ఇదే ♦ 18 మంది సైనికుల మృతి; 11 మందికి గాయాలు ♦ ప్రధాని మోదీ, రక్షణ మంత్రి పారికర్ల ఖండన ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి తెగబడ్డారు. ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీశారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై ఈ దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరారు. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే ఆ వాహన శ్రేణిపై శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన మిలిటెంట్లు.. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. ఒక అనుమానిత ఉగ్రవాది కూడా చనిపోయాడని సమాచారం. ఈ దాడి తామే చేశామంటూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఈ దాడి వెనుక మణిపూర్‌కు చెందిన తీవ్రవాద సంస్థలు ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)’, ‘కంగ్లీ యావొల్ కన్నా లుప్(కేవైకేఎల్)’ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నామని మణిపూర్ హోం శాఖ కార్యదర్శి జే సురేశ్ బాబు పేర్కొన్నారు. దాడి జరిగిన సమాచారం తెలియగానే మరిన్ని దళాలను సంఘటనా స్థలానికి పంపించామని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రోహన్ ఆనంద్ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా నాగాలాండ్‌లోని ఆసుపత్రికి తరలించామన్నారు. సంఘటన స్థలం భారత్, మయన్మార్ సరిహద్దుకు దాదాపు 15 కి.మీ.ల దూరంలో ఉంది. కేవైకేఎల్ స్థానిక మీతీ ప్రజలకు సంబంధించిన తీవ్రవాద సంస్థ. ఆర్మీపై గత ఇరవై ఏళ్లలో జరిగిన భారీ దాడి ఇదే. సాధారణంగా ఇలాంటి దాడులు జమ్మూకశ్మీర్‌లో 90వ దశకంలో ఎక్కువగా జరుగుతుండేవని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మతిలేని చర్య.. మోదీ: మిలిటెంట్ల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖం డించారు. ఈ దాడిని మతిలేని చర్యగా అభివర్ణించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఘనంగా నివాళలర్పించారు. ‘ఈ రోజు మణిపూర్‌లో జరిగిన అర్థంలేని దాడి చాలా బాధాకరం. ఈ దాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్క సైనికుడికి శిర సు వంచి ప్రణామాలర్పిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మిలిటెంట్ల దాడి ని రక్షణమంతి మనోహర్ పారికర్ కూడా ఖండించారు. ఇది పిరికి చర్య అని, ఈ దారుణానికి పాల్పడినవారిని శిక్షించి తీరతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిలిటెంట్ల దాడిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులు చేసిన త్యాగం వృథా పోదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన మిలిటెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి
ఇంపాల్ : మణిపూర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోతుల్ నుంచి రాజధాని ఇంపాల్ వైపు వస్తున్న మిలిటరీ కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఇరవైమంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కాగా ఒక మహిళను అస్సాం రైఫిల్స్ గ్రూపు హత్య చేసిందనే ఆరోపణలతో చందేల్ జిల్లాలో గురువారం బంద్ జరుగుతోంది. -
తీవ్రవాదులు దాడి: ముగ్గురికి గాయాలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు రెచ్చిపోయారు. సాంబా జిల్లాలోని ఆర్మీ శిబిరంపై తీవ్రవాదులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులల్లో ఇద్దరు సైనికులు, ఓ యాత్రికుడు ఉన్నాడని వారిని ఆసుపత్రి తరలించినట్లు చెప్పారు. తీవ్రవాదల దాడితో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రవాదులు పాల్గొన్నారని చెప్పారు. కాశ్మీర్ - పఠాన్‌కోట్ జాతీయ రహదారికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే కథువా జిల్లాలోని పోలీసు స్టేషన్‌పై శుక్రవారం తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది సహా ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు మిలిటెంట్లు హతమైయ్యారు. -
తీవ్రవాదుల దాడి: 33 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లోని ప్రభుత్వ ప్రాంగణంపై తాలిబాన్ తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 33 మంది మరణించారు. 147 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. తూర్పు ఆఫ్ఘానిస్థాన్‌లోని గజినీ ప్రావెన్స్లో రెండు వాహానాల పేలుడు పదార్థాలతో వచ్చి తీవ్రవాదులు దాడికి తెగబడ్డారని చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్నభద్రత సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు జరిపారని తెలిపింది. ఆ కాల్పులలో 10 మంది పోలీసు ఉన్నతాధికారులు మరణించారు. గాయపడిన వారిలో 130 మంది స్థానికులు కాగా, 17 మంది పోలీసు ఉన్నతాధికారులని పేర్కొంది. 2014లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇది అత్యంతభయంకర సంఘటనగా హోం మంత్రిత్వశాఖ అభివర్ణించింది. -
కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి!
కాబూల్: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు తుపాకి మోతలు, బాంబు పేలుళ్లతో కాబూల్ విమానాశ్రయం దద్దరిల్లింది. విమానాశ్రయంలో నిర్మాణాలో ఉన్న భవనాన్ని ఆధీనంలోకి తెచ్చకున్న తర్వాత గ్రెనేడ్, రాకెట్లు, ఆటోమెటిక్ ఆయుధాలతో దాడి చేశారని అఫ్గనిస్తాన్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఘటన ఉదయం 5.30 నిమిషాలకు జరిగిందని, అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాబూల్ కేంద్రంగా నడిచే అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. -
కరాచి ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి
పాకిస్థాన్: కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి చేసిన ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎయిర్ భద్రతా సిబ్బంది(ఏఎస్ఎఫ్) వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. -
అసోంలో మిలిటెంట్ల దాడి, ఏడుగురు మృతి
గోల్పారా: దీపావళి సందర్భంగా తీవ్రవాదులు తెగబడ్డారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సామాన్యులపై రెచ్చిపోయారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి టీ షాపు ముందు సేద దీరుతున్న గిరిజనులపై కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యేక మేఘాలయ కోసం పోరాడుతున్న "గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ "కి చెందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. స్థానిక కౌన్సిల్ ఎన్నికల పై ఏర్పడిన వివాదం కారణంగానే ఈ ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అధునాతన ఆయుధాలతో వారు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న రబా హజోంగ్ గిరిజనులు, ఎన్నికలకు అనుకూలంగా ఉన్న ఇతర వర్గాల మధ్య అక్టోబర్ నుంచి అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 13, 25వ తేదీల్లో జరగనున్నాయి. జిల్లాలో రబా హజోంగ్ ఆధిపత్యం ఉంది. తమకు తాము పాలించుకునేందుకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి: ముగ్గురు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని షాపియన్ జిల్లా, గగ్రన్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మధ్యాహ్నం తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. భద్రతాదళాలు వెంటనే తేరుకుని ప్రతిగా కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు తీవ్రవాదులు అక్కడికక్కడే మరణించారని ఐజీ ఏ.జీ.మిర్ శనివారం ఇక్కడ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. మృతులు ఏ సంస్థకు చెందిన తీవ్రవాదులో ఇంకా తెలియలేదని తెలిపారు.