జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. తారీఖ్ అహ్మద్ పండిట్ పోలీసు శాఖలో ఉండి, అనంతరం ఉగ్రవాదిగా మారి బర్హాన్ వనీ గ్రూపులో చేరాడు. ఈ యేడాది మేలో పోలీసులకు లొంగిపోయాడు. తారీఖ్ అహ్మద్ అతని సోదరునిపై ఉగ్రవాదులు నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని కరీమాబాద్ లో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరళించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.