విద్యార్థిని ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పేలుడు సంభవించింది. జిల్లాలోని నర్బల్ గ్రామంలో ఈ ఘటనలో పదో తరగతి చదివే 12 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడిన విద్యార్థులందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి బాగుందని ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. పోలీసు అధికారులు పాఠశాలలో ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఛాదూరాలోని గోపాల్‌పురా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్క సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా, వీరిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకుని భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో హిలాల్ అహ్మద్ వనీ, షోయబ్ మొహమ్మద్ లోన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఉగ్రసాహిత్యం, ఆయుధాలు, మందుసామగ్రిని సైన్యం స్వాధీనంచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment