కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం | Soldier, three suspected militants killed in an encounter in Pulwama | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Tue, Nov 7 2017 3:19 AM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

Soldier, three suspected militants killed in an encounter in Pulwama - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా జిల్లాలోని కండీ బెల్ట్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. దీన్ని గుర్తించిన ఉగ్రవాదులు జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు గాయపడ్డాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement