కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై తాలిబాన్ తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 33 మంది మరణించారు. 147 మంది గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. తూర్పు ఆఫ్ఘానిస్థాన్లోని గజినీ ప్రావెన్స్లో రెండు వాహానాల పేలుడు పదార్థాలతో వచ్చి తీవ్రవాదులు దాడికి తెగబడ్డారని చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్నభద్రత సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు జరిపారని తెలిపింది.
ఆ కాల్పులలో 10 మంది పోలీసు ఉన్నతాధికారులు మరణించారు. గాయపడిన వారిలో 130 మంది స్థానికులు కాగా, 17 మంది పోలీసు ఉన్నతాధికారులని పేర్కొంది. 2014లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇది అత్యంతభయంకర సంఘటనగా హోం మంత్రిత్వశాఖ అభివర్ణించింది.