కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి! | Kabul airport under militant attack | Sakshi
Sakshi News home page

కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి!

Published Thu, Jul 17 2014 9:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

Kabul airport under militant attack

కాబూల్: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు తుపాకి మోతలు, బాంబు పేలుళ్లతో కాబూల్ విమానాశ్రయం దద్దరిల్లింది. 
 
విమానాశ్రయంలో నిర్మాణాలో ఉన్న భవనాన్ని ఆధీనంలోకి తెచ్చకున్న తర్వాత గ్రెనేడ్, రాకెట్లు, ఆటోమెటిక్ ఆయుధాలతో దాడి చేశారని అఫ్గనిస్తాన్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
ఈ ఘటన ఉదయం 5.30 నిమిషాలకు జరిగిందని, అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాబూల్ కేంద్రంగా నడిచే అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement