Kabul airport
-
ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి!
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకుని రోడ్లను మూసివేశాయి. ‘కాబూల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ వెలుపల ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. దాంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.’ అని తెలిపారు ఆర్మీ ప్రతినిధి అబ్దుల్ నాఫీ టకోర్. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. అంతకు ముందు గతేడాది డిసెంబర్ 12న ఓ గుర్తు తెలియని సాయుధుడు కాబూల్‌లోని ఓ హోటల్లో కాల్పులకు పాల్పడ్డాడు. ఆ హోటల్లో చైనా పౌరులు ఉండటం కలకలం సృష్టించింది. తాలిబన్ భద్రతా దళాలు అక్కడికి చేరుకునే ముందు హోటల్ నుంచి భారీగా పొగలు వచ్చినట్లు పలు వీడియోల్లో కనిపించింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
పాక్ నుంచి అఫ్గాన్‌కు విమానం
ఇస్లామాబాద్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాబూల్‌కు పాకిస్తాన్ సోమవారం తొలి కమర్షియల్ విమానాన్ని నడిపింది. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్ (పీఐఏ) విమానం –పీకే 6429 పలువురు జర్నలిస్టులతో కలసి కాబూల్ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన బృందంతో వచ్చిందని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలు కూడా త్వరలోనే తిరుగుతాయని భావిస్తున్నారు. -
భారీ షాక్.. 600 మంది తాలిబన్ల హతం!
Afghanistan Panjshir Talibans Fight: అఫ్గనిస్తాన్‌లో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. అఫ్గన్ ప్రతిఘటన దళాలు, తాలిబన్లు చేస్తున్న పరస్పర పైచేయి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కీలకమైన పంజ్‌షీర్ ప్రావిన్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈలోపు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఆ ప్రకటనను ఖండించింది. యుద్ధం కొనసాగుతోందని... పంజ్‌షీర్ లొంగిపోలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు పంజ్‌షీర్ ప్రతిఘటన దళం నుంచి మరో ప్రకటన వచ్చింది. హోరాహోరీ పోరులో 600 మంది తాలిబన్లను మట్టుపెట్టినట్లు ప్రకటించుకుంది. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు పంజ్‌షీర్ యోధుల నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము జరిపిన దాడుల్లో ఆరు వందల మంది తాలిబన్లు చనిపోయారని, వెయ్యి మందికి పైగా లొంగిపోయారని పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి ప్రకటించాడు. ఇక తాలిబన్ల దాడులను తిప్పి కొడుతున్నామని పంజ్షీర్లు చేస్తున్న ప్రకటనలతో... వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై అంతర్జాతీయ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు పంజ్‌షీర్ దళాల ప్రకటనను తాలిబన్లు ధృవీకరించడం లేదు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై తాలిబన్ల యుద్ధం కొనసాగుతోందని చెప్పారు. అయితే పంజ్‌షీర్ రాజధాని బజారక్కి వెళ్లే రోడ్డు మార్గంలో ల్యాండ్ మైన్లు అమర్చారని, అందువల్లే అక్కడి నుంచి ముందుకెళ్లడం కష్టంగా మారిందని చెప్పారు. ఇప్పటివరకూ పంజ్‌షీర్‌లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చాయన్నారు. మిగతా జిల్లాలను కూడా వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మధ్య ప్రావిన్స్ వైపు నుంచి తాలిబన్లు పోరాడుతున్నారని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమీ వెల్లడించారు. చదవండి: అఫ్గన్ ప్రభుత్వ ఏర్పాటు.. రంగంలోకి పాక్ ఇరు వర్గాలు ప్రకటనలైతే చేస్తున్నాయి గానీ... ఎక్కడా ఆధారాలు బయటపెట్టట్లేదు. దీంతో ఈ పరస్పర ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇంకోవైపు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తిరిగి ప్రారంభించిన తాలిబన్లు.. మిగతా దేశాల ప్రతినిధులు, రవాణా, సహాయక చర్యల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్లిక్ చేయండి: తాలిబన్ల అత్యుత్సాహం.. అమాయకులు బలి -
‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?!
కాబూల్: అమెరికా దళాల ఉపసంహరణ పూర్తి కావడంతో విజయం సాధించామంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు. యూఎస్ దళాలు వైదొలగగానే కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్ బలగాలు కలదిరిగాయి. అప్పుడు రష్యాను, ఇప్పుడు అమెరికాను ఓడించామంటూ సంబరాలు చేసుకున్నాయి. అనంతరం తాలిబన్ నాయకులు కొందరు రన్‌వేపైకి చేరుకున్నారు. తాలిబన్ నాయకులకు అంగరక్షకులుగా నిలిచిన బద్రి దళాలు ఫొటో ఫోజులిచ్చాయి. ‘అఫ్గానిస్తాన్ అంతిమంగా స్వేచ్ఛను సాధించింది’ అని తాలిబన్ నేత హెక్మతుల్లా వాసిక్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను ప్రకటిస్తామని చెప్పారు. అందరికీ క్మాభిక్ష పెట్టినందున ప్రజలంతా తమ పనులకు తిరిగి వెళ్లాలని, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థాయికి వస్తాయని, అంతవరకు ప్రజలు ఓపిక వహించాలని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాన్ని పునఃప్రారంభించడం తాలిబన్లకు ఎదురయ్యే తొలి అతిపెద్ద సవాలు కానుంది. మరోవైపు పూర్తి స్వాతంత్య్రం పొందినందుకుగాను అఫ్గాన్లకు తాలిబన్ రాజకీయ ప్రతినిధి షాబుద్దీన్ డెలావర్ శుభాకాంక్షలు చెప్పారు. బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో ఇంకా 200మంది అమెరికన్లున్నారు. ఎయిర్‌పోర్టులోని విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న తాలిబన్ సభ్యుడు అంతా హడావుడి మంగళవారం ఉదయం విమానాశ్రయం పరిసరాల్లో ఎప్పటిలాగానే హడావుడి, ఆందోళన కనిపించాయి. టరి్మనల్స్‌లో లగేజులు, దుస్తులు, పలు డాక్యుమెంట్లు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. ఆశావహులు విమానాశ్రయం వైపునకు రాకుండా తాలిబన్లు రోడ్లపై కంచెలతో నిలువరించారు. యూఎస్ దళాలు వైదొలిగే క్షణాలు ఆసన్నమయ్యే సమయంలో మరోమారు దాడులు జరగకుండా జాగ్రత్త వహించారు. ఒక్కసారి యూఎస్ దళాలు వెళ్లడం పూర్తవగానే తాలిబన్ బలగాలు భారీగా విమానాశ్రయంలోకి వచ్చాయి. ఈ సందర్భంగా బద్రి యూనిట్‌ను ఉద్దేశించి తాలిబన్ నేత జబిహుల్లా ప్రసంగించారు. ఇకనుంచి దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిర్పోర్ట్ పునఃప్రారంభానికి తమ సాంకేతిక బృందం పనిచేస్తోందని జబిహుల్లా విలేకరులకు చెప్పారు. ఇక తమ దేశం స్వేచ్ఛగా ఉంటుందని, షరియా చట్టం అమలు చేస్తామని తాలిబన్లు చెప్పారు. ఆర్థికమే అసలు సమస్య అఫ్గాన్లు స్వేచ్ఛ పొందారని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా అసలు సమస్య ఇప్పుడే ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న అంతర్జాతీయ సాయం ఆగిపోవడం, కీలక నిధులను అమెరికా తొక్కిపెట్టడంతో తాలిబన్లకు పాలన సంక్లిష్టం కానుందంటున్నారు. బ్యాంకుల్లో నిధులన్నీ కస్టమర్లు విత్‌డ్రా చేసుకుంటున్నారు. దేశంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు అందడం లేదు. దేశంలో కరువు తాండవిస్తుండడంతో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయి. పాలన గాడిన పెట్టేందుకు తాలిబన్లు ఏమి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: Afghanistan Crisis: మరో యుద్ధం మొదలైంది! -
ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ అఫ్గన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప విజయం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తమకు పూర్తిగా స్వేచ్ఛ, స్వాత్రంత్యాలు లభించాయని, ఆక్రమణదారులకు ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించారు. అయితే, తాము అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ మేరకు హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం వెళ్లిపోయిన అనంతరం రన్‌వే నుంచే ప్రజలకు సందేశం అందించారు. ‘‘అఫ్గనిస్తాన్‌కు శుభాభినందనలు. ఈ విజయం మనందరిదీ. అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలతో కూడా మేం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అంతర్జాతీయ సమాజంతో దౌత్యపరమైన సంబంధాలను మేం స్వాగతిస్తున్నాం’’ అని జుబీహుల్లా పేర్కొన్నారు. కాగా దాదాపు 20 ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన సేనలను ఉపసంహరించుకున్నట్లు, ఈ ప్రక్రియ పూర్తైందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Antony Blinken: అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన -
అమెరికా దాడులు.. ఖండించిన తాలిబన్లు!
కాబూల్/బీజింగ్: కాబూల్‌లో ఆత్మాహుతి బాంబు దాడిని ఛేదించేందుకు అమెరికా జరిపిన డ్రోన్ దాడులను ఖండిస్తున్నట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలతో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అఫ్గనిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ గడువు ముగియనున్న తరుణంలో ఐసిస్- ఖోరసాన్ గ్రుపు ఇటీవల ఉగ్రదాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కాబూల్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో జరిగిన ఈ వరుస పేలుళ్లలో 100 మందికి పైగా సాధారణ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా జవాన్లు లక్ష్యంగా ఆదివారం మరోసారి రాకెట్ దాడులు జరిగినట్లు వార్తలు వెలువడగా అమెరికా తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేగాక వాటిని తిప్పికొట్టినట్లు వెల్లడించింది. అదే విధంగా సూసైడ్ కారు బాంబర్‌ను పేల్చి వేసే సమయంలో పెద్ద పేలుడు సంభవించిందని, తద్వారా కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చైనా అధికార టెలివిజన్ సీజీటీఎన్‌తో మాట్లాడుతూ.. అమెరికా చర్యను ఖండించారు. తమకు సమాచారం ఇవ్వకుండా దాడులను ఎదుర్కొనే క్రమంలో ఏడుగురు పౌరులు మృతి చెందారని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ఒకవేళ వారికి అఫ్గనిస్తాన్‌లో ప్రమాదం పొంచి ఉందని భావిస్తే.. మాకు ఆ విషయం చెప్పాల్సింది. అంతేగానీ ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరిగింది’’ అని పేర్కొన్నారు. విదేశీ గడ్డ మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. చదవండి: Afghanistan: తాలిబన్ ప్రతినిధితో ఇంటర్వ్యూ.. దేశం వీడిన మహిళా జర్నలిస్టు -
అవును.. మరోసారి దాడులు.. తిప్పికొట్టామన్న అమెరికా!
కాబూల్/వాషింగ్టన్: ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. సీ- ర్యామ్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్ గన్ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్- కె(ఇస్లామిక్ స్టేట్- ఖోరసాన్) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. చదవండి: భయం భయంగానే ఇంటర్వ్యూ: దేశం వీడిన మహిళా జర్నలిస్టు Afghanistan: As many as five rockets were fired at Kabul airport but were intercepted by a missile defense system, reports Reuters quoting a US official — ANI (@ANI) August 30, 2021 -
కాబూల్ దాడి: ముందే హెచ్చరించిన బైడెన్
అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయంపై ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వచ్చే 24 లేదంటే 36 గంటల్లో దాడి జరుగుతుందన్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరించాల్సిన నేపథ్యంలో గడువులోగా ఉగ్రవాదులు మళ్లీ దాడులకు తెగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ‘‘మా కమాండర్లు నాతో చెప్పారు. 24–36 గంటల్లో మళ్లీ దాడులు జరిగే అవకాశం అత్యధికంగా ఉంది. కాబూల్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి’’అని బైడెన్ చెప్పారు. కాబూల్‌లో ఉన్న ప్రతీ అమెరికన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఉన్న సైనిక బలగాలను ఆదేశించినట్టుగా బైడెన్ వెల్లడించారు. ఐసిస్–కె ఉగ్రవాద సంస్థపై తాము చేసిన డ్రోన్ దాడి ఆఖరిది కాదని బైడెన్ అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న వారిని విడిచిపెట్టమని, పేలుళ్ల వెనుక హస్తం ఉన్న ప్రతీ ఒక్కరినీ మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ నుంచి తరలింపును గడువులోగా పూర్తి చేస్తామన్నారు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న∙వారిని సురక్షితంగా తీసుకువచ్చే పనిలో ఉన్నామని బైడెన్ వివరించారు. విమానాశ్రయం దగ్గర దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఆ చుట్టు పక్కలకు ఎవరూ రావొద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది. అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ 300 మంది పౌరులను గడువులోగా తీసుకొస్తామని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. -
కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం
-
కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం
Kabul Rocket Attack: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో హమీద్ కార్జాయ్ విమానాశ్రయానికి అతి సమీపంలో గల జిల్లాలో మరోసారి పేలుడు సంభవించింది. కాబుల్ పరిసరాల్లో మరో ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. కాబుల్ 11వ సెక్యూరిటీ జిల్లాలో జరిగిన ఈ పేలుడు రాకెట్ దాడిగా అనుమానిస్తున్నారు. Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear pic.twitter.com/wFdhCkHSwn — ELINT News (@ELINTNews) August 29, 2021 అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ పేలుడు జరిగివుండవచ్చని అంతర్జాతీయ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో చిన్నారి సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు గాయపడినట్లుగా సమాచారం. కాగా, కొద్ది రోజుల కిందట కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 100 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ -
విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు
కాబూల్: అఫ్గాన్ నుంచి పశ్చిమ దళాల తరలింపు గడువు దగ్గరపడుతుండడంతో పలువురు అఫ్గాన్ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో తాలిబన్లు ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ దళాలు కాబుల్ రహదారులపై పహారా కాస్తున్నారు. అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా చెప్పారు. తాలిబన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటివరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి. శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబన్లు కొన్ని వార్నింగ్షాట్లు పేల్చడంతో పాటు, హెచ్చరికగా స్మోక్ బాంబులను ప్రయోగించారు. చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విదేశాల నుంచి సహాయం ఆగిపోవడంతో అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం అలముకుంది. పలువురు ఉద్యోగులు, సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నగదు కోసం క్యూ కట్టారు. దీంతో ఏటీఎంల్లో విత్‌డ్రాను 24గంటలకు 200 డాలర్లకు పరిమితం చేశారు. అలాగే ప్రతి కస్టమర్ వారానికి 200 డాలర్లు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించాలని అఫ్గాన్ కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమన ఏర్పాట్లేనని నిపుణులు అంటున్నారు. తాలిబన్లు అందరినీ కలుపుకుపోతూ ప్రజాస్వామ్యయుతం గా వ్యవహరిస్తే తప్ప విదేశీ సాయం అందడం కష్టంగా కనిపిస్తోందన్నారు. అఫ్గాన్ బడ్జెట్లో 75 శాతం విదేశీ సాయం ఆధారంగా నడుస్తుంది. -
యూఎస్ డ్రోన్ దాడిలో ఐసిస్–కె ఉగ్రవాదుల మృతి
వాషింగ్టన్/కాబూల్: కాబూల్ బాంబుదాడికి ప్రతీకారంగా అమెరికా ఐసిస్–కె సూత్రధారులిద్దరిని డ్రోన్‌దాడిలో హతమార్చింది. అఫ్గాన్ లోని నాన్గర్హర్ ప్రావిన్సు ప్రాంతంలోని ఐసిస్ స్థావరాలపై ఈ దాడి జరిగినట్లు అమెరికా ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ ఐసిస్ మూకలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ శపథం చేసిన సంగతి తెలిసిందే! అధ్యక్షుడి ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మిలటరీ డ్రోన్ దాడులు చేసింది. దాడుల్లో ఇద్దరు ఐసిస్ వ్యూహకర్తలు మరణించారని, ఒకరు గాయపడ్డాడని మిలటరీ ప్రతినిధి హాంక్ టేలర్ చెప్పారు. దాడిలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదన్నారు. మరణించిన ఐసిస్ వ్యూహకర్తలకు కాబూల్ దాడితో సంబంధం ఉందో, లేదో తెలియరాలేదు. వీరి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విమానాశ్రయంపై దాడి అనంతరం ఉగ్రమూకలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఐసిస్–కెలో 14 మంది కేరళీయులు? ఐసిస్–కె ఉగ్రవాద సంస్థలో 14 మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత బగ్రామ్ జైలు నుంచి వారిని విడుదల చేశారు. వారంతా ఐసిస్–కెతో ఉంటూ ఈ పేలుళ్లకు పన్నాగం పన్నిన వారిలో ఉన్నారని అఫ్గాన్ నుంచి సమాచారం వచ్చినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. 14 మందిలో 13 మంది ఇంకా కాబూల్‌లోనే ఉన్నారు. కేరళలోని మల్లాపురం, కసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు చెందిన వీళ్లంతా ఏడేళ్ల క్రితమే కాబూల్‌కి వెళ్లి ఉగ్రసంస్థలో చేరారు. అమెరికా బలగాలు వారిని జైలు పాలు చేస్తే, తాలిబన్లు తిరిగి బయటకు తీసుకువచ్చారు. అఫ్గాన్ ఉగ్ర కార్యకలాపాల్లో కేరళ వాసుల హస్తం ఉందని తాలిబన్లు ప్రచారం చేసి అంతర్జాతీయంగా భారత్ పరువుని బజారుకీడుస్తారేమోనని కేంద్రం ఆందోళనలో ఉంది. కాబూల్‌లోని టర్క్మెనిస్తాన్ ఎంబసీ వద్ద పేలుళ్లు జరిపేందుకు యత్నించిన ఇద్దరు పాక్ జాతీయులను తాలిబన్లు అడ్డుకున్నారు. సున్నీ పస్తూన్ ఉగ్ర సంస్థకు చెందిన వీరు పేలుడు పదార్థాలతో ఉండగా పట్టుబడ్డారు. -
ఇంకా 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు!
Taliban Seal Off Large Parts of Kabul Airport: కాబూల్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తాలిబన్లు శనివారం అదనపు బలగాలను మోహరించారు. విమానాశ్రయం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అమెరికా చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ గడువు చివరి తేదీ(ఆగష్టు 31) సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగష్టు 15న అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్న విషయం తెలిసిందే. అమెరికా సహా మిత్ర దేశాలు తమ దేశ ప్రజలతో పాటు, అఫ్గన్ శరణార్థులను కూడా విమానాల్లో తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తమ పౌరులను అఫ్గనిస్తాన్‌లో ఉండాల్సిందిగా హెచ్చరించిన తాలిబన్లు... గురువారం నాటి ఐసిస్- కే ఘాతుకం తర్వాత చెక్ పోస్టుల వద్ద భద్రత మరింతగా పెంచారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులు బ్లాక్ చేస్తూ.. అడ్డుకుంటూ తాలిబన్ ఫైటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఇస్లామిక్ ఖోరసాన్ (ఐసిస్-కె) గ్రూపు కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 170 మంది అఫ్గన్ ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కన్నెర్రజేసిన అమెరికా శుక్రవారం.. నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్-కె టెర్రరిస్టుల కదలికలను గుర్తించి.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని అమెరికా దళాలు మట్టుపెట్టినట్లు సమాచారం. చదవండి: Kabul Attack: నా తమ్ముడు చచ్చిపోయాడు.. యుద్ధంతో పాటే.. కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా! -
టార్గెట్ ఐసిస్: అమెరికా వేట మొదలైంది
US Revenge Attacks On ISIS: తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట మొదలైంది. ‘వెంటాడి.. వేటాడి మట్టుపెడతామ’ని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది. శుక్రవారం సాయంత్రం దాటాక నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్ ఖోరసాన్ ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన అమెరికా దళాలు.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం. ఐసిస్-కే గ్రూపు లక్క్ష్యంగా శుక్రవారం ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. అఫ్గన్ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతిచెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు. మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైట్ హౌజ్ దళాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు కాబూల్ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం రాత్రి కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్లలో 13 మంది యూఎస్ సైనికులు, 78 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. చదవండి: కాబూల్ దాడులు.. ట్రంప్ భావోద్వేగం బరిలోకి తాలిబన్లు ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగారు. మరిన్ని దాడులకు ఐసిస్-కే పథక రచన చేస్తుందన్న సమాచారం మేరకు తాలిబన్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు కాబూల్‌లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్ బలగాలు.. ఇప్పటికే ఐసిస్-కే సానుభూతిపరులు, మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ద్వారా దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. చదవండి: ఐసిస్ ఖోరసాన్- వీళ్లెంత దుర్మార్గులంటే.. క్లిక్ చేయండి: కాబూల్ పరిస్థితి- వాటర్ బాటిల్ 3 వేలు.. ఫుడ్ ప్యాక్ 7 వేలు -
ముమ్మరంగా తరలింపు!
కాబూల్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరిన్ని పేలుళ్లు జరుగుతాయన్న భయంతో పలు దేశాలు అఫ్గాన్‌లోని తమ ప్రజలను వెనక్కురప్పించే యత్నాలను ముమ్మరం చేశాయి. పేలుడు అనంతరం మూతపడిన విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రాకపోకలు ఆరంభమయ్యాయి. బాంబుల భయం తీరకపోయినా, విమానాశ్రయం బయట వందలాదిమంది గుంపులుగా దేశం విడిచి పోయేందుకు ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 31నాటికి యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలగనున్నాయి. అనంతరం ఏమైతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజానీకం ఉంది. అందుకే ఈలోపే ఏదో ఒక దేశానికి పారిపోవాలని పలుమంది విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్నారు. కాబూల్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రజలను సురక్షితంగా వేర్వేరు ప్రదేశాలకు తరలించామని అమెరికా ప్రకటించింది. ఇంకా వేలాది మంది పారిపోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. విదేశాలకు పోయే అవకాశం లేని పౌరులు దేశ సరిహద్దులకు చేరుకొని పొరుగు దేశాల్లో తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో దాదాపు 5లక్షల మంది అఫ్గాన్ సరిహద్దు దేశాలకు శరణార్థులుగా పోవచ్చని యూఎస్ మిలటరీ అంచనా వేసింది. నిశితంగా గమనిస్తున్నాం: భారత్ ఆపరేషన్ దేవి శక్తి పేరిట ఆఫ్గానిస్తాన్‌లోని భారతీయుల తరలింపు ప్రక్రియను ఇండియా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరు భారత విమానాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 550 మందిని స్వదేశానికి తెచ్చాయి. వీరిలో దాదాపు 260మంది భారతీయులున్నారు. వీరితో పాటు అర్హులైన అఫ్గాన్ పౌరులను కూడా భారత్ సురక్షితంగా తరలించిందని, ఇంకా తరలింపు కొనసాగుతోందని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని, అఫ్గాన్‌లోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. అఫ్గాన్‌లో మిగిలిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చడంపైనే శ్రద్ధ పెట్టామన్నారు. దాదాపు 20మంది భారతీయులు, కొందరు అఫ్గాన్ జాతీయులు అనుకున్న సమయానికి విమానాశ్రయానికి రాలేకపోయారని, వీరిని తరలించే యత్నాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఏ దేశం ఏం చేస్తోంది? అమెరికా: యూఎస్ పౌరుల తరలింపును మరిం త వేగవంతం చేసింది. త్వరలో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని యూఎస్ అధికారి ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. డెడ్‌లైన్ కల్లా తరలింపును పూర్తి చేస్తామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఇంకా దాదాపు 5,400మంది తరలింపునకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 24గంట ల్లో దాదాపు 12,500కు పైచిలుకు పౌరులను 89 విమానాల్లో తరలించామన్నారు. బ్రిటన్: అఫ్గాన్ నుంచి తమ బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిందని బ్రిటన్ ప్రకటించింది. శుక్రవారం 9 విమానాలతో తరలింపును పూర్తి చేశామని తెలిపింది. అఫ్గాన్లతో కలిపి మొత్తం 14 వేల మందిని దేశం దాటించామని పేర్కొంది. ఇంకా 150 మంది బ్రిటన్ పౌరులు కాబూల్‌లో చిక్కుకుపోయారని ప్రధాని జాన్సన్ తెలిపారు. స్వీడన్: ఇప్పటివరకు దాదాపు 500 మంది స్వీడిష్ పౌరులతో సహా 1,,100మందిని అఫ్గాన్ నుంచి తీసుకువచ్చామని తెలిపింది. ఇటలీ: అఫ్గాన్ నుంచి 108మందితో కూడిన చివరి తరలింపు విమానం రోమ్కు చేరినట్లు ఇటలీ ప్రకటించింది. శుక్రవారానికి దాదాపు 4,900మంది అఫ్గాన్ పౌరులను దేశం దాటించామంది. ఫ్రాన్స్: శుక్రవారం రాత్రికి ఫ్రెంచ్ దేశీయుల తరలింపు పూర్తి కావచ్చని ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్: అఫ్గాన్ నుంచి తమ దేశీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని స్పెయిన్ తెలిపింది. సుమారు 1,900మంది అఫ్గాన్ పౌరులను కూడా తమ దేశానికి తెచ్చామంది. జర్మనీ: 45 దేశాలకు చెందిన దాదాపు 5,347 మందిని సురక్షితంగా సరిహద్దు దాటించామని, గురువారం తమ చివరి రెస్క్యూ విమానం అఫ్గాన్ నుంచి బయటపడిందని తెలిపింది. టర్కీ: కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహిం చాల్సిందిగా తాలిబన్లు తమను కోరారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
Kabul Airport Attack: ఐసిస్–కె అంటే తెలుసా?
కాబూల్ విమానాశ్రయాన్ని రక్తమోడించిన ఐసిస్–కె సంస్థ అఫ్గాన్‌లో తన పట్టు మరింత బిగించాలని చూస్తోంది. అటు అమెరికా, ఇటు తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపడానికే ఈ దారుణానికి ఒడిగట్టింది. తాలిబన్లతో ఇప్పటికే ఆధిపత్య పోరాటంలో ఉన్న ఈ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లతో అమెరికాకి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది? ఏమిటీ ఐసిస్–కె? ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్–కె లేదంటే ఐఎస్–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం. ఇక్కడ చదవండి: ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు! ఎన్నో అరాచకాలు తాలిబన్లు కేవలం అఫ్గానిస్తాన్‌కు పరిమితమైపోతే ఐసిస్–కె ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులపై జీహాద్‌కు పిలుపునిచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనాల ప్రకారం ఐసిస్–కెలో 2017–18 సంవత్సరంలోనే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా 100కి పైగా దాడులు చేసింది. ఇక అమెరికా–అఫ్గాన్, పాకిస్తానీ బలగాలపై 250 దాడులు జరిపింది. 2020లో కాబూల్ విమానాశ్రయం, , కాబూల్ యూనివర్సిటీపై దాడులు, అధ్యక్ష భవనంపై రాకెట్లతో దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇవే కాకుండా అమ్మాయిలు చదువుకునే పాఠశాలలపై దాడులకు దిగడం, ఆస్పత్రుల్లో మెటర్నటీ వార్డులపై దాడులకు పాల్పడి గర్భిణిలను, నర్సులను నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం చేశారు. షియా ముస్లింలపై అధికంగా దాడులకు చేస్తున్నారు. చదవండి:Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్ భావోద్వేగం ఇంకా ఎలాంటి ప్రమాదాలున్నాయ్? తాలిబన్ల క్రూరత్వమే భరించలేనిదిగా ఉంటే ఐసిస్–కె మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. షరియా చట్టాలను పూర్తిగా మార్చేసి తాము సొంతంగా రూపొందించిన నియమ నిబంధనలను అఫ్గాన్ ప్రజలపై రుద్దాలని ఈ సంస్థ చూస్తోంది. తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం లేదన్నది వీరి భావన. తాలిబన్లు, ఐసిస్–కె మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అమెరికాతో తాలిబన్లు శాంతి చర్చలకు వెళ్లడం కూడా ఈ సంస్థకి అసలు ఇష్టం లేదు. శాంతి ఒప్పందాల వల్ల జీహాద్ లక్ష్యాలను చేరుకోలేమని వీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడీ దాడులతో అమెరికాకు కూడా పక్కలో బల్లెంలా మారింది. హక్కానీ నెట్వర్క్ అండ తాలిబన్లతో వీరికి ఏ మాత్రం సరిపడదు కానీ తాలిబన్లకు అత్యంత సన్నిహితంగా మెలిగే హక్కానీ నెట్‌వర్క్‌తో సత్సంబంధాలున్నాయి. ఐసిస్–కె, హక్కానీ నెట్వర్క్, పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు ఉమ్మడిగా పన్నాగాలు పన్ని ఎన్నో దాడులకు దిగారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న వారిని చాలా మందిని విడుదల చేశారు. వారిలో ఐఎస్, అల్ ఖాయిదా ఉగ్రవాదులు ఐసిస్–కెతో చేతులు కలిపారు. హక్కానీ నెట్వర్క్ సభ్యులే ఈ సంస్థకి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. బలమెంత? 2014లో ప్రారంభమైన ఈ సంస్థ 2016 నాటికి అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. ఆ సమయంలో ఈ సంస్థలో 3 వేల నుంచి 8,500 మంది వరకు ఉగ్రవాదులు ఉండేవారు. కానీ అమెరికా, అఫ్గాన్ బలగాలతో పాటు తాలిబన్లు జరిపిన దాడుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. 2019 నాటికి ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 2,000–4,000కి పడిపోయింది. మన దేశంలోని కేరళ యువకులు 100 మందిపై ఈ సంస్థ వల వేసి లాగేసుకుంది. గెరిల్లా పోరాటంలో ఈ సంస్థ ఉగ్రవాదులకి అత్యంత నైపుణ్యం ఉంది. పలుమార్లు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ సంస్థ ఏర్పడినప్పుడు పాకిస్తానీ తాలిబన్ హఫీజ్ సయీద్ ఖాన్ ఈ సంస్థకు చీఫ్‌గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా ఉన్న అధుల్ రాఫ్ అలీజా అమెరికా చేసిన దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం షహాబ్ అల్‌ముజీర్ ఈ సంస్థకి చీఫ్‌గా ఉన్నాడు. అతను సిరియాకి చెందినవాడని భావిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గాన్ సంక్షోభం: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే!
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడానికి ఆగస్టు 31 గడువు సమీపిస్తున్నందున కాబూల్ విమానాశ్రయం వెలుపల పరిస్థితి రోజు రోజుకి మరింత క్షీణిస్తూనే ఉంది. విమానాశ్రయం వెలుపల అనేక మంది ఆఫ్ఘన్లు దేశం నుంచి పారిపోవడానికి విమానాశ్రయానికి వస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి ప్రజలు విమానాశ్రయం పక్కన ఉన్న మురికి కాలువలో నిలిచి ఉంటున్నారు. అయితే, ఆ ప్రాంతం దగ్గర రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబూల్ విమానాశ్రయ ప్రాంగణం సమీపంలో ఉన్న ఆహార, నీరు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయిటర్స్ వీడియో ప్రకారం.. విమానాశ్రయం వెలుపల ఉన్న ఆఫ్ఘన్ జాతీయుడు తన దగ్గర నీటి బాటిళ్లను 40 డాలర్లకు(దాదాపు రూ.3,000) విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాబూల్ విమానాశ్రయంలో ఆహారం & నీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వీడియోను రాయిటర్స్ పంచుకుంది. "ఒక బాటిల్ నీటిని 40 డాలర్లకు, ఒక ప్లేట్ బోజనాన్ని 100 డాలర్ల(రూ.7,375)కు విక్రయిస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు" అని ఆయన అన్నారు. మరోవైపు, తాలిబన్ పాలన నుంచి పారిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయం గేట్ల వద్ద ఇంకా వేచి చూస్తున్నారు.(చదవండి: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం) Afghan Fazl-ur-Rehman said food and water were sold at exorbitant prices at Kabul airport. ‘One bottle of water is selling for $40 and plate of rice for $100, and not Afghani (currency) but dollars. That is out of reach for common people,’ he said https://t.co/KczQEMm2nB pic.twitter.com/UBmaAQumXP — Reuters (@Reuters) August 25, 2021 -
అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తసిక్తమైంది. దేశాన్ని వదిలి వెళ్తున్న పాశ్చాత్యులు, అఫ్గాన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు బాంబుపేలుళ్లలో 72 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్(ఐసిస్-కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండవద్దని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. Kabul is bleeding again 😢😢💔💔 STOP KILLING AFGHAN PLEASE 🙏🙏😢😢🇦🇫🇦🇫 — Rashid Khan (@rashidkhan_19) August 26, 2021 ఈ పేలుళ్లపై అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా కాబుల్ మరోసారి రక్తసిక్తమైందని, తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్‌లో నరవధకు ఫుల్స్టాప్ పెట్టాలని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్‌కు జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. క్రికెట్ అభిమానులు రషీద్‌ను తమ కామెంట్లతో ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాడులకు బాధ్యులను వెంటాడి వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఐసిస్ ఉగ్రమూకల కౌంట్‌డౌన్ మొదలైందంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే, రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆడుతున్నాడు. స్వదేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ తన ఆటపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. తనలోకి కసినంతా ప్రత్యర్థి జట్టుపై చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా బంతితోనే సత్తా చాటుతూ వచ్చిన అతను.. ఈ మధ్య బ్యాట్‌కు కూడా పనిచెబుతున్నాడు. లీగ్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన హెలికాప్టర్ సిక్స్ ఇన్నింగ్స్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. చదవండి: Chris Gayle: గేల్ సిక్స్ కొడితే మాములుగా ఉంటుందా.. -
కాబూల్ పేలుళ్లు: ‘అసలు ఇండియాలో అడుగు పెడతామనుకోలేదు’
సాక్షి, వెబ్‌డెస్క్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో పలు దేశాలు అఫ్గన్‌లో ఉన్న తమ దేశీయుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గురువారం దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఆత్మాహుతి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి భయంకర పరిస్థితుల నుంచి క్షేమంగా స్వదేశం చేరుకున్న ఓ భారతీయ జంట తాము ఎదర్కొన్న భయానక అనుభవాల గురించి వివవరించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం అఫ్గన్ నుంచి 800 మంది భారతీయులను క్షేమంగా దేశానికి చేర్చింది. ఇలా చేరుకున్న వారిలో గుజరాత్‌కు చెందిన షివాంగ్ దవే, అతడి భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారు తాము ఎదొర్కన్న భయానక అనుభవాలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి వెల్లడించారు దవే దంపతులు. షివాంగ్ దవే మాట్లాడుతూ.. ‘‘నేను గత 15 ఏళ్లుగా అఫ్గన్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు రోహిత్భయ్ దవే, మరొకరు ప్రముఖ గుజరాత్ కవి హరింద్ర దవే. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత మేం అక్కడ బతకడం అసాధ్యం అని మాకు అర్థం అయ్యింది. భారత ప్రభుత్వం మమ్మల్ని తరలించేందుకు ముందుకు వచ్చింది’’ అని తెలిపాడు. (చదవండి: పాకిస్తాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు) ‘‘కాబూల్ విమానాశ్రయం చేరుకుంటే తప్ప మా భవిష్యత్ ఏంటో అర్థం కాదు. ఇక మా ఇంటి దగ్గర నుంచి కాబూల్ విమానాశ్రయం చేరుకునే దారి వెంబడి మాకు ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయం వెళ్లే దారులన్నింటిని మూసేశారు. రోడ్ల మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీటన్నింటిని దాటుకుని విమానాశ్రయం చేరుకున్నాము’’ అని తెలిపాడు దవే. (చదవండి: కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి! ) దవే భార్య మాట్లాడుతూ.. ‘‘అసలు మేం కాబూల్ విమానాశ్రయం చేరుకుంటామా.. లేదా అనే భయం వెంటాడసాగింది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి విమానాశ్రయం చేరుకున్నాము. కానీ అక్కడ అనుకోని ఉపద్రవం ఏర్పడింది. తాలిబన్లు నా భర్తను బంధించారు. నాకు అర్థం అయ్యింది.. మా జీవితాలు ఇక్కడే ముగిసిపోతాయి.. మేం మా స్వదేశం వెళ్లమని తెలిసింది. కాకపోతే అదృష్టం కొద్ది మే తాలిబన్ల చేతుల నుంచి బయటపడి.. ఇండియా వెళ్లే విమానం ఎక్కగలిగాము’’ అని గుర్తు చేసుకున్నారు.(చదవండి: ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..) ‘‘ఆ తర్వాత అనేక చోట్ల ఆగుతూ మా ప్రయాణం కొనసాగింది. విమానం గాల్లోకి లేచి.. భారత్‌లో ల్యాండ్ అయ్యే వరకు ఊపిరి బిగపట్టుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము. గాల్లో ఉండగా కిందకు చూస్తే.. ప్రతి 40-50 మీటర్లకు ఓ చోట పేలుళ్లు చోటు చేసుకునే ఘటనలు దర్శనమిచ్చాయి. మా జీవితంలో అంతలా భయపడిన దాఖలాలు లేవు. ఆదివారం భారత్‌లో ల్యాండ్ అయ్యాము. ఆ తర్వాత గుజరాత్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం మా బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవు.. మాకు ఉద్యోగం లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు’’ అని దవే దంపతులు వాపోయారు. -
Kabul Airport Blast: అదృష్టమంటే వీళ్లదే!
జంట పేలుళ్లతో కాబూల్ ఎయిర్పోర్ట్ రక్తసిక్తంగా మారింది. అమెరికా భద్రతా దళాలను టార్గెట్‌గా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె) సంస్థ చేపట్టిన నరమేధంలో అఫ్గన్ పౌరులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి 160 మంది అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. తాలిబన్ల దురాక్రమణ తర్వాత పెద్ద ఎత్తున్న పౌరులు పారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీలు, మహిళలు భద్రత విషయంలో భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గన్ సంతతికి చెందిన సుమారు 160 మంది మైనార్టీలు బుధవారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వీళ్లలో 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఉన్నారు. అక్కడి నుంచి బయటి దేశాలకు వెళ్లాలన్నది వాళ్ల ఉద్దేశం. అయితే తాలిబన్లు గార్డులు వీళ్లను అడ్డుకున్నారు. సరైన పేపర్లు ఉన్నా.. తమను అడ్డుకున్నారంటూ వాళ్లంతా కాసేపు ధర్నా దిగారు కూడా. ఎంతసేపు ఎదురుచూసినా అనుమతించబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరిగారు. అయితే వాళ్లు ఏ ప్రదేశంలో అయితే కొద్దిగంటలపాటు ఎదురుచూశారో.. సరిగ్గా అదే ప్రదేశంలో(అబ్బే ఎంట్రన్స్ దగ్గర) ఆత్మాహుతి దాడి జరిగింది. I just had a phone call conversation with S Gurnam Singh, president of Kabul Gurdwara committee who apprised me that today’s #Kabulairport explosion has happened at exactly same place where they were standing yesterday We thank Almighty that such thing didn’t happen yesterday pic.twitter.com/sbCiHaMZGP — Manjinder Singh Sirsa (@mssirsa) August 26, 2021 ‘‘ముందురోజు ఎక్కడైతే మేం ఎదురుచూశామో.. అక్కడే ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని తెలిసి వణికిపోయాం. అదృష్టం బావుండి అక్కడి నుంచి మేం వెళ్లిపోయాం. దాడిని తల్చుకుంటే బాధగా ఉంది. ప్రస్తుతం మా బృందం సురక్షితంగా ఉన్నాం. కార్టే పార్వాన్‌లోని గురుద్వారలో ఆశ్రయం పొందుతున్నాం’’ అని కాబూల్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ గుర్మాన్ సింగ్ తెలిపారు. వాళ్లు సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిస్రా సైతం దృవీకరించారు. వీళ్లను సురక్షితంగా దేశం దాటించే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నట్లు బ్రిటన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: అఫ్గన్ ఎకానమీ.. ఘోరమైన సమస్యలు హాట్ న్యూస్: కాబూల్ దాడి.. మూల్యం చెల్లించకతప్పదు -
కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి
-
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్‌లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
కాబుల్ ఎయిర్ పోర్టులో బాంబుల మోత
-
ఇటలీ విమానంపై కాల్పులు
రోమ్: కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అఫ్గాన్ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగినట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్ పౌరులతో కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారని మీడియా వెల్లడించింది. పైలట్ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్ తెలిపారని పేర్కొంది. తమ సీ–130 రకం రవాణా విమానంపై కాబూల్‌లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అఫ్గాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది విదేశీయులతోపాటు, అఫ్గాన్ పౌరులను ఖాళీ చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
కాబూల్: భయపడినంతా జరిగింది. కాబూల్ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు బాంబుపేలుళ్లలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 90 మంది అఫ్గాన్ జాతీయులే ఉండగా, 13 మంది వరకూ అమెరికా దేశానికి చెందిన వారు ఉన్నారు. చదవండి: ఇటలీ విమానంపై కాల్పులు విమానాశ్రయంలో పేలుడు దృశ్యం ఇది ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ (ఐసిస్–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని... బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చదవండి: అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది రక్తమోడుతున్న ఓ అఫ్గాన్ పౌరుడు విమానాశ్రయం ప్రధాన ద్వారం అబే గేటు వద్ద రాత్రి 6.45 గంటలకు తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉండటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్ హోటల్ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ అమెరికన్ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షి అదమ్ ఖాన్ తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయన్నారు. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మురికి కాలువలో దిగి... అమెరికా బలగాలను తమను లోనికి అనుమతించాలని బతిమాలుతున్న అఫ్గాన్లపై ఆత్మాహుతి బాంబర్ దూసుకెళ్లి పేల్చి వేసుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిఘా, భద్రతావర్గాలు తాజా పరిస్థితిని వివరించాయి. బైడెన్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలోనే ఉందని, లోపల య«థావిధిగా తరలింపు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని పెంటగాన్వర్గాలు చెప్పాయి. అమెరికా అధీనంలోని ప్రాంతంలోనే: తాలిబన్లు ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... ఎయిర్పోర్ట్ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది దాకా బ్రిటన్ సైన్యం, ఇతర నాటో దళాలు ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీలోగా ఈ బలగాల ఉపసంహరణ పూర్తికావాలని... గడువు పొడిగించే సమస్య లేదని తేల్చిచెప్పిన తాలిబన్లు... విమానాశ్రయం అన్ని వైపుల నుంచీ మోహరించి ఉన్నారు. ఒప్పందం మేరకు విమానాశ్రయం లోనికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న అఫ్గాన్లను అడ్డుకుంటున్నారు. ఇళ్లకు తిప్పిపంపేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వేలాదిగా విమానాశ్రయానికి తరలివస్తున్న అఫ్గాన్లను చెదరగొడుతున్నారు. గురువారం వీరిపై వాటర్ క్యానన్లను కూడా ప్రయోగించారు. ఆయుధాలు చేజిక్కించుకొని... ఐసిస్(కె) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. తాలిబన్లను మించి ఇస్లామిక్ అతివాద భావజాలం. ఐసిస్‌కు తాలిబన్లతో తీవ్రవైరముంది. అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించడం, తాలిబన్లను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం లక్ష్యంగా ఐసిస్ ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న క్రమంలో ఆయా ఫ్రావిన్సుల్లోని జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేశారు. వీరిలో తాలిబన్లతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరూ బయటపడి... అస్త్రసన్యాసం చేస్తున్న అఫ్గాన్ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారని... కొద్దికాలంలోనే బాగా బలపడ్డారని తెలుస్తోంది. ఆగస్టు 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తిచేస్తామని, ఆలోగా హమీద్ కర్జాయ్ విమానాశ్రయం జోలికి రావొద్దని అమెరికా – తాలిబన్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ, భద్రతా చానళ్ల ద్వారా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... అమెరికన్లను, నాటో దళాలకు సహాయపడ్డ అఫ్గాన్లను ఆగమేఘాలపై తరలిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తరలింపులో వేగం పెంచింది. చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్లిఫ్ట్గా భావిస్తున్న ఆపరేషన్‌లో మంగళవారం 19 వేల మందిని, బుధవారం 13,400 మందిని సురక్షితంగా కాబూల్ బయటకు తరలించింది. 4,500 మంది అమెరికన్లను తరలించగా... మరో 1,500 మంది అమెరికన్లు ఇంకా కాబూల్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ గురువారం చెప్పారు. భారతీయులందరినీ తరలిస్తాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయి ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్ విపక్ష నాయకులకు అఫ్గాన్‌లో పరిస్థితుల్ని వివరించారు. ఈ భేటీకి 31 పార్టీల నుంచి 37 మంది నాయకులు హాజరయ్యారు. జై శంకర్‌తో పాటుగా కేంద్రమంత్రి, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఇక విపక్షాల నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్, డీఎంకేకు చెందిన టి.ఆర్.బాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం జైశంకర్ మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాలిబన్ల పట్ల కేంద్రం తన వైఖరిపై ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. ‘మా ముందున్న అతి పెద్ద కార్యక్రమం భారతీయులందరినీ తరలించడం. అఫ్గాన్‌తో స్నేహసంబంధాలను కొనసాగించడమూ మా ముందున్న లక్ష్యం’ అని జై శంకర్ ట్వీట్ చేశారు. -
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 13 మంది మృతి
కాబూల్: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటినుంచీ హింస మరింత రగులుతోంది. తాజాగా కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జంట పేలుళ్ల ఘటనలు బీభత్సం సృష్టించాయి. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం అబేగేట్, ఒక హోటల్‌వద్ద వరుసగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, తాలిబన్ ప్రతినిధి రాయటర్స్‌తో తెలిపారు. అటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు దీన్ని ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. కాగా పేలుళ్లు జరిగే అవకాశ ఉందని ముందే హెచ్చరించిన అమెరికా తాజాగా మరింత అప్రమత్తమైంది. మరో పేలుడు కూడా జరిగే అవకాశం ఉందని అమెరికా ఆర్మీ హెచ్చరించింది. కాబుల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పేలుళ్ళు ఘటనలు మరింత ఆందోళన రేపాయి. VIDEO: People being rushed to the hospital following reported suicide bomber attack at Kabul airport. pic.twitter.com/ex74FpusGs — Election Wizard (@ElectionWiz) August 26, 2021 -
ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉపసంహరిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆ తర్వాత బలగాలను ఆ దేశంలో ఉంచే ప్రణాళికేదీ లేదన్నారు. వైట్‌హౌస్‌లో మంగళవారం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ డెడ్‌లైన్‌లోగా బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నామని, అయితే ఇందుకు తాలిబన్ల సహకారం ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్: ప్రస్తుతం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించేలా కార్యక్రమం కొనసాగుతోంది. కానీ ఎంత త్వరగా అమెరికా సైనికులు వెనక్కి వచ్చేస్తే అంత మంచిదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వారికి ముప్పు పెరుగుతూ ఉంటుంది. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కల్పించకుండా, విమానాశ్రయాలోకి అన్నీ అనుమతిస్తే పని తొందరగా అవుతుంద’’ని బైడెన్ అన్నారు. ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్‌లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వాళ్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు గడువు కంటే ముందే బలగాల ఉపసంహరణకు తమ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉందని బైడెన్ అన్నారు. లేదంటే ఉగ్రవాద సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్‌లో ఐసిస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్–కె అమెరికా బలగాలను టార్గెట్ చేసిందని వెల్లడించారు. వాళ్లు ఎప్పుడైనా విమానాశ్రయంపై దాడి చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్–కె సంస్థ సామాన్య పౌరులపై ఆత్మాహుతి దాడులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని బైడెన్ పేర్కొన్నారు. తాలిబన్ల పాజిటివ్ రియాక్షన్ ఆగష్టు 31 తర్వాత కమర్షియల్ విమానాల ద్వారా అఫ్గన్ల ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని తాలిబన్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జర్మన్ దౌత్యవేత్త మర్కుస్ పోట్జెల్ ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. తాలిబన్ డిప్యూటీ చీఫ్ షెర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ హామీ ఇచ్చాడని, లీగల్ డాక్యుమెంట్లు ఉన్న అఫ్గన్లకు విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నట్లు మర్కుస్ తెలిపారు. ఈ–వీసాలతోనే భారత్‌లోకి అనుమతి న్యూఢిల్లీ: ఇకపై భారత్‌కు విమాన మార్గంలో వచ్చే అఫ్గన్ పౌరులను ఈ–వీసాలతోనే అనుమతిస్తామని బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వచ్చి అఫ్గనీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ఎంబసీలను మూసేశారు. దాంతో ఆన్లైన్లో ఈ–వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ–వీసా ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. సాధారణ వీసాలు పొంది భారత్‌కు చేరుకోని వీసాలు ఇకపై చెల్లుబాటు కావని, ఈ–వీసాలపైనే భారత్‌లోకి అనుమతిస్తామని హోం శాఖ స్పష్టంచేసింది. చదవండి: అఫ్గన్ మునిగిన నావ.. తాలిబన్ల ప్రయాణం!! -
అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకూ వార్నింగ్ అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! Afghanistan: ఆమె భయపడినంతా అయింది! అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి -
మరో 392 మంది తరలింపు
న్యూఢిల్లీ: తాలిబన్ ముష్కర మూకల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులు, భాగస్వాముల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరిలో ఇద్దరు అఫ్గానిస్తాన్ చట్టసభ సభ్యులు సైతం ఉండడం విశేషం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(ఐఏఎఫ్) చెందిన సి–17 సైనిక రవాణా విమానంలో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తరలించిన మొదటి బృందంలో 168 మంది ఉన్నారు. వీరిలో 107 మంది భారతీయులు కాగా, 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు. 87 మందిని శనివారం కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాన్‌బెకు చేర్చగా, వారిని ఆదివారం ఏఐ 1956 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు నేపాల్ జాతీయులు ఉన్నారు. ఇక మరో 135 మందికిపైగా భారతీయులను కొద్ది రోజుల క్రితం అమెరికా, నాటో విమానాల్లో ఖతార్ రాజధాని దోహాకు తరలించారు. వారందరినీ ఇప్పుడు ప్రత్యేక విమానంలో దోహా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాబూల్ నుంచి తరలించిన వారిలో ఇద్దరు అఫ్గాన్ చట్టసభ సభ్యులు అనార్కలీ హోనర్యార్, నరేంద్రసింగ్ ఖల్సా, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా 590 మంది.. భారత ప్రభుత్వం అఫ్గాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 16న ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 590 మందిని వెనక్కి తీసుకొచ్చింది. అమెరికాతోపాటు ఇతర మిత్రదేశాల సహకారం, సమన్వయంతో భారత్ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. సోమవారం కూడా మరో బృందం భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఇండియా వీసాలున్న అఫ్గాన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబన్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరోధిస్తున్నారు. -
తాలిబన్ల దమనకాండ
కాబూల్/బెర్లిన్/లండన్: పుట్టి పెరిగిన సొంత దేశంలో ఉండలేక, మరో దేశానికి వెళ్లే మార్గంలేక అఫ్గానిస్తాన్ ప్రజలు క్షణక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. పుట్టిన గడ్డపై మమకారం తెంచుకొని, ఎలాగైనా పరాయి దేశాలకు పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని ఆరాట పడితే తాలిబన్ రాక్షసులు అడ్డుపడుతున్నారు. ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం లేకుండాపోయింది. అఫ్గాన్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. దేశ సరిహద్దులను, రహదారులను తాలిబన్లు దిగ్బంధించడంతో వైమానిక మార్గమే దిక్కయ్యింది. దీంతో మరో గత్యంతరం లేక జనం కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. పాస్‌పోర్ట్, వీసా, టికెట్, చేతిలో డబ్బులు.. ఇవేవీ లేకపోయినా వేలాది మంది అఫ్గాన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు మీద ఆశతో తరలివస్తున్నారు. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన తాలిబన్లు అఫ్గాన్ జాతీయులను ముందుకు కదలనివ్వడం లేదు. వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. వినకపోతే చావబాదడానికైనా వెనుకాడడం లేదు. కాబూల్ ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేందుకు బయట వేచి చూస్తున్న జనాన్ని చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, దీంతో జనం కకావికలమై భారీగా తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారని బ్రిటిష్ సైన్యం అదివారం ప్రకటించింది. అయితే, వారంతా గాయాల వల్లే మరణించారా? లేక ఊపిరాడక, గుండెపోటుతో మృతి చెందారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికాయే కారణం: తాలిబన్లు కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ అమెరికాయే కారణమని తాలిబన్ గైడెన్స్ కౌన్సిల్ చీఫ్ అమీర్‌ఖాన్ ఆరోపించారు. అమెరికా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అఫ్గాన్ పౌరులంతా క్షేమంగా ఉన్నారని, అమెరికా సైన్యం నియంత్రణలో ఉన్న కాబూల్ ఎయిర్‌పోర్టులోనే హింస జరుగుతోందని అన్నారు. తాలిబన్ అధికార ప్రతినిధి నయీం ఇరాన్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రజల మరణాలకు అమెరికాదే బాధ్యతని అన్నారు. అందరినీ తమతోపాటు తీసుకెళ్తామని అమెరికన్లు ప్రకటించారని, వారి మాటలు నమ్మిన జనం ఎయిర్‌పోర్టుకు పోటెత్తుతున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వంపై ప్రకటన ఇప్పుడే కాదు! కల్లోల అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ అగ్రనేతలు కసరత్తు సాగిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తాలిబన్లు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. బరాదర్ కాందహార్ నుంచి రాజధాని కాబూల్‌కు చేరుకున్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆగస్టు 31లోగా అఫ్గాన్ అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కానుంది. కాబట్టి ఆగస్టు 31 దాకా కొత్త ప్రభుత్వంపై ఎలాంటి ప్రకటన చేయొద్దని తాలిబన్లు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 24న జీ–7 భేటీ అఫ్తానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి జీ–7 దేశాలు మంగళవారం సమావేశమవుతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ప్రకటించారు. సురక్షితంగా విదేశీయులను తరలించడం, ఆఫ్గాన్ల భద్రత తదితర అంశాలపై చర్చింనున్నారు. బలమైన గ్రూపు–7 కూటమిలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ సభ్యదేశాలుగా ఉన్నాయి. అమెరికా విమానంలో అఫ్గాన్ మహిళకు ప్రసవం కాబూల్ నుంచి జర్మనీలోని ర్యామ్స్టీన్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న అఫ్గానిస్తాన్ మహిళ విమానంలోనే ప్రసవించింది. శనివారం యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానంలో పౌరులను ట్రాన్సిట్ పోస్టుగా ఉపయోగిస్తున్న ర్యామ్స్టీన్ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మహిళకు నొప్పులు వస్తున్నట్లు తెలియడంతో విమానాన్ని పైలట్ కార్గో ప్రదేశంలో నిలిపేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న అమెరికా వైద్య సిబ్బంది విమానంలోకి చేరుకొని అఫ్గాన్ మహిళకు ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సైనికాధిరులు వెల్లడించారు. మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న ఆర్మీ సిబ్బంది ఏ దేశం... ఎంతమందిని తరలించిందంటే! ఐసిస్‌తో ముప్పు సాఫీగా తరలింపు ప్రక్రియ సాగేందుకు వీలుగా ఆగస్టు 31 దాకా కాబూల్ విమానాశ్రయం జోలికి రాకూడదని తాలిబన్లతో అమెరికాకు ఒప్పందం కుదిరింది. దాంతో విమానాశ్రయం నలువైపులా తాలిబన్లు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... మోహరించి ఉన్నారు. ఎలాగోలా దేశం నుంచి బయటపడాలని ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెడుతున్న అఫ్గాన్లను చెల్లాచెదురు చేయడానికి గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. కొన్నిసార్లు నేరుగా జనసమూహంపైకి తుపాకులు ఎక్కుపెడుతున్నారు. దాంతో తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల నుంచి విమానాశ్రయానికి తీవ్ర ముప్పు పొంచివుందని అమెరికా అప్రమత్తం చేసింది. అమెరికన్ పౌరులెవరూ తమనుంచి స్పష్టమైన సూచనలు వచ్చేవరకూ కాబూల్ విమానాశ్రయానికి రాకూడదని శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఐసిస్ ఉగ్రవాదులు విమానాలపై క్షిపణులతో దాడి చేయవచ్చని అనుమానిస్తున్నారు. దాంతో అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాలు ఆదివారం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో యుద్ధతంత్రాలను అవలంభించాయి. అంచెలంచెలుగా ఎత్తును తగ్గించే బదులు... నిప్పులు విరజిమ్ముతూ (శత్రువుల ఉష్ణ అధారిత క్షిపణులను తప్పుదోవ పట్టించడానికి) ఒక్కసారిగా నిటారుగా కిందకు దూసుకొచ్చి ల్యాండింగ్ చేస్తున్నాయి. భయపెడుతున్న ‘చెత్త’ అసంఖ్యాక అఫ్గాన్లు విమానాశ్రయానికి తరలిరావడం... వారు తిని పారేసిన తినుబండారాల తాలూకు ప్యాకింగ్, ఖాళీ వాటర్ బా టిళ్లు, కూల్ డ్రింక్స్ టిన్లతో విమానాశ్రయంలో చెత్త కుప్పలు పోగవుతున్నాయి. వీరికి తోడు అమెరికా, నాటో బలగాల వ్యర్థాలు. పారిశుధ్య సిబ్బంది విధులు మానేయడంతో ఎయిర్ పోర్టులో తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెల కొందని, పక్షులు, ఇతర జంతువులతో రాకపో కల సమయంలో విమానాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు మృతి
సాక్షి, కాబూల్ : కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు అఫ్ఘన్లు మృత్యువాతపడ్డారు. ఎయిర్ పోర్టు వద్ద తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపటంతో తొక్కిసలాట చోటుచేసుకుందని అమెరికన్ సైన్యం వెల్లడించింది. కాగా, కొత్తగా పాలన చేపట్టిన తాలిబన్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద కొన్ని కఠిన ఆజ్ఞలు పెట్టింది. మేయిన్ గేట్ల బయట జనం గుమికూడవద్దని ఆదేశించింది. ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో అఫ్గన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చింది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపుతామని అధికారులు తెలిపారు. చదవండి : అఫ్గన్ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రత్యేక విమానం -
హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది. తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు. పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు. నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు. చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం ఆలనాపాలనా చూస్తున్న సైనికులు వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు. కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్) హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
Afghanistan: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితం
-
తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితం
కాబూల్: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితంగా బయట పడ్డారు. తాలిబన్లు ట్రావెల్ డాక్యుమెంట్లు తనిఖీ చేసి భారతీయులను ప్రశ్నించారు. అంతే కాకుండా వారు ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. కాగా భారతీయుల తరలింపునకు అడుగడుగునా తాలిబన్లు ఆటంకాలు సృష్టించారు. ఆటంకాల మధ్య ఉదయం 87 మందిని భారత్ అక్కడి నుంచి తరలించింది. తాలిబన్లు విడిచిపెట్టిన వారిని త్వరలోనే భారత్‌కు తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!) -
తాలిబన్ల దుశ్చర్య.. 150 మంది భారతీయుల కిడ్నాప్
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్ ఎయిర్పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: ఆరుకోట్లకు అమ్ముడుపోయిన ఆటోగ్రాఫ్, ఎవరిదంటే..) భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్ ఒకరు ట్వీట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్ చానెల్ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ-130జే విమానం కాబూల్ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?) -
కనీసం మా బిడ్డల్ని అయినా కాపాడండి! బావురుమంటున్న అఫ్గన్లు వైరల్ వీడియో
కాబూల్ : అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటినుంచీ బాధాకరమైన వీడియోలు, హృదయవిదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళన దిగుతున్న ప్రజలు, వారిని అణచి వేసేందుకు తాలిబన్ల కాల్పుల ఘటనలకు తోడు, తాలిబన్ల చెరనుంచి తప్పించుకునేందుకు అఫ్గన్ వాసులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తనువు చాలిస్తున్నారు. దేశం విడిచిపెట్టి ఎలాగైనా ప్రాణాలను దక్కించుకోవాలన్న వారి ఆరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా తమ బిడ్డల్ని కాపాడమంటూ అఫ్గాన్ తల్లుల ఆవేదన పలువురిని కంటపడి పెట్టిస్తోంది. (Afghanistan: అశ్రఫ్ ఘనీ స్పందన, ఫేస్బుక్లో వీడియో) కాబూల్ విమానాశ్రయంలో ఒక వైపు అమెరికన్ దళాలు, మరోవైపు విమానాశ్రయం వెలుపల తాలిబన్ల దాడులుతో అఫ్గన్ పౌరులు అల్లాడిపోతున్నారు. వెళ్లిపోనివ్వండి.. గేట్లుతీయండి,లేదంటే తాలిబన్లు తమ తలను నరికి వేస్తారంటూ బుధవారం ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసందర్భంగా వేలాదిగా తరలివస్తున్న వారిని నిలువరించేందుకు తాలిబన్లు ఇనుప కంచెలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమ పిల్లలతోసహా సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేస్తున్న తల్లులు ఇక గత్యంతరం లేక పిల్లల్ని ఎలాగైనా రక్షించుకోవాలని నిర్ణయించారు. అందుకే కనీసం తమ బిడ్డల్నైనా రక్షించమంటూ బ్రిటీష్ సైన్యం వైపునకు పిల్లల్ని విసిరేస్తున్న దృశ్యాలు కలవరం రేపుతున్నాయి. బోరుమని విలపిస్తూ కాపాడండి అంటూ బ్రిటిష్ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. మరోవైపు ఈ ఘటనపై బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. (Afghanistan: అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది) చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది! Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన -
వేలాదిగా ఎయిర్‌పోర్ట్‌కు జనం, విరుచుకుపడిన తాలిబన్లు
కాబూల్: అఫ్గన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత దేశంలో నిరసనల సెగ ప్రారంభమైంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం వెలుపల గందరగోళం చెలరేగింది. దేశం నుండి పారిపోవడానికి వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి తరలివచ్చారు. వీరిపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. రైఫిళ్లతోవారినిచితక బాదారు. తాలిబన్ల దాడి,భారీగా ఏర్పాటు చేసిన ముళ్ల కంచె, జనం హాహాకారాలతో ప్రతిధ్వనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) విమానాశ్రయం లోపల యుఎస్ మిలిటరీ నియంత్రణ ఏర్పాటు చేసినప్పటికీ, సైనిక విమానాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ బుధవారం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెల్లువలా వస్తున్న జనాలను అదుపు చేసేందుకు తాలిబ్లను విరుచుకుపడుతున్నారు. కాబుల్ విమానాశ్రయం వెలుపల గొలుసులు, కొరడాలు, ఇతర పదునైన ఆయుధాలతో ప్రజలను తీవ్రంగా కొడుతున్నారని సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. ఈ ఘటనలో ఒక మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు సహాయం కోసం అర్థిస్తూ హాహాకారాలు చేస్తున్నారు. మమ్మల్ని పోనివ్వండి.. లేదంటే తాలిబన్లు మా తలలు నరుకుతారు..గేట్లు తీయమంటూ వేడుకుంటున్నవీడియో వైరల్ అవుతోంది అమెరికాలో అత్యంత హృదయం లేని, భయంకరమైన మనిషి జోబైడెన్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విమానాశ్రయ గేట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది గాయపడ్డారని విమానాశ్రయంలోని నాటో సెక్యూరిటీ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) At #kabulairport gates where the US forces controlling, people crying and begging US forces to allow them to pass the gates otherwise the Taliban will come and will behead them. pic.twitter.com/wzxXJf2ngL — Natiq Malikzada (@natiqmalikzada) August 18, 2021 Scenes of total chaos at #kabulairport today. pic.twitter.com/A2ESgEfxNW — Matt Zeller (@mattczeller) August 18, 2021 -
అఫ్గన్ సంక్షోభం: గుండెల్ని పిండేసే దృశ్యం!
కాబూల్: అఫ్గన్ తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటినుంచి అనేక హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన 7 నెలల చిన్నారి ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టులో సోమవారం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో సంబంధిత కుటుంబం నుంచి ఈ పసివాడు మిస్ అయి ఉంటాడని భావిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ తరువాత అఫ్గన్ పౌరుల్లో తీరని భయం నెలకొంది. ప్రాణభయంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో అనేక భయంకరమైన దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా పలువుర్నికలవర పెడుతున్నాయ. ముఖ్యంగా దేశం విడిచి ఎలాగైనా పారిపోవాలన్న ఆతృతలో కాబూల్ విమానాశ్రయానికి వందలాది మంది క్యూకట్టారు. ఈ తొక్కిసలాట గందరగోళానికి తోడు గాలిలో నుండి ఇద్దరు వ్యక్తులు ఆకాశం నుండి కిందపడిపోయిన దృశ్యాలు అత్యంత బాధాకరంగా నిలిచాయి. ఇపుడు ఒక ప్లాస్టిక్ క్రేట్లో చిన్నారి ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు కలచి వేస్తున్నాయి. సోమవారం నాటి గందరగోళంలో ఈ చిన్నారి తల్లిదండ్రుల నుండి విడిపోయినట్టుగా భావిస్తున్నారు. అశ్వక న్యూస్ ఏజెన్సీ ప్రకారం కాబూల్‌లో పీడీ-5 వీరు నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిడ్డను కనుగొనడంలో కుటుంబానికి సహాయం చేయనుందని పేర్కొంది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా) మరోవైపు దీనిపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ ప్రజలను రక్షిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలో తాలిబన్ల వైఫల్యం అంటూ ఒకరు, ఇది తాలిబన్ల వైఫ్యలం, పిల్లలను రక్షించలేని విజయం విజయం కాదంటూ మరికొరు మండి పడుతున్నారు. చదవండి : Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి! Afghanistan crisis: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్ A couple living in PD-5 #Kabul blame that their 7 Months Baby went missing from Kabul Airport yesterday during the chaos. Up to this instance they couldn’t find him. @AsvakaNews trying to help them find their baby through missing announcements on social media. pic.twitter.com/TDsJEXUXAR — Aśvaka - آسواکا News Agency (@AsvakaNews) August 17, 2021 -
అఫ్గాన్ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు నోటమ్ (పైలట్లకు హెచ్చరిక నోటీస్) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
నరకయాతన: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు
Shocking Videos from Kabul Airport:: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అఫ్గనిస్తాన్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో అఫ్గన్ నుంచి బయట పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. అఫ్గన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించారు. విమానం డోర్ క్లోజ్ చేసినా వేలాడుతూ ప్రయాణించేందుకు సాహసించారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానం నుంచి ఇద్దరు అప్గన్లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీనికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. -
అఫ్గానిస్తాన్: ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి
కాబూల్: తమ దేశం తాలిబన్ల వశమవడంతో అఫ్గానిస్తాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రాణభయంతో విదేశాలకు పారిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ దేశ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ప్రజలు విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇతర దేశాలకు వెళ్లేందుకు ఆ దేశ ప్రజలు విమానాశ్రయానికి వేల సంఖ్యలో రావడంతో ఎయిర్పోర్ట్ కిటకిటలాడింది. రద్దీ తీవ్రమవడంతో భద్రతా బలగాలు చక్కదిద్దేందుకు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. తాలిబన్లు మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ వదిలి పరారయ్యాడు. ఇక ప్రజలు కూడా దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. దేశానికి ఉన్న అన్ని సరిహద్దులు మూసివేయడంతో ఉన్న ఒకే ఒక్క దారి వాయుమార్గం. దీంతో విమాన ప్రయాణం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు రావడంతో ప్రయాణికుల టెర్మినల్ నిండిపోయింది. ఒక్కో విమానం వద్ద వందలాది మంది ఉన్నారు. అయితే విమాన ప్రయాణాలను అఫ్గాన్ నిషేధించింది. ఇతర దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేత
అఫ్గానిస్తాన్: అఫ్గాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అయితే అఫ్గాన్‌లో మిగిలిపోయిన భారత పౌరులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అఫ్గాన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో దేశం విడిచి వెళ్తున్నారు. అంతేకాదు అఫ్గాన్ మీదుగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే పలు ఎయిరిండియా విమానాలను దారి మళ్లిస్తున్నారు. షికాగో-ఢిల్లీ, శాన్ఫ్రాన్సిస్కో- ఢిల్లీ విమానాలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మీదుగా ప్రయాణించే అన్ని విమానాలను దారి మళ్లిస్తుండటంతో అక్కడి ఇతర దేశాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టులో రద్దీని తగ్గించేందుకే విమానాలు నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు ఆర్మీ విమానాల్లో ఎక్కుతున్న అఫ్గాన్లను యూఎస్ బలగాలు అడ్డుకున్నాయి. ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో పౌరులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందారు. After the Taliban swept #Kabul, residents are desperate to flee #Afghanistan. Watch the chaos at the Kabul airport. pic.twitter.com/WbxK1wzHdM — WION (@WIONews) August 16, 2021 -
బాంబు పేలుళ్లతో అట్టుడికిన కాబూల్
-
బాంబు పేలుళ్లతో అట్టుడికిన కాబూల్
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వరుస పేలుళ్లతో అట్టుడికిపోతోంది. తాజాగా అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం ఉదయం భారీ కారుబాంబు పేలడంతో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. విమానాశ్రయం సమీపంలో బాబు పేలుడు ఘటనను అఫ్ఘాన్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అఫ్ఘాన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలో లష్కర్ గా వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించారు. పోలీసులు తమ రోజువారీ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా ఈ పేలుడు సంభవించింది. -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుడు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నాటో దళాలే లక్ష్యంగా వారి కన్వాయ్ లోకి పేలుడు పదార్థాలతో నింపిన టొయోటా ఇన్నోవాతో దూసుకెళ్లిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో పలువురు విదేశీయులు గాయపడినట్లు తెలిసింది. భారీగా ప్రాణనష్టం కూడా జరిగి ఉంటుందనే వార్తలు వెలువడుతున్నప్పటికీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని కాబూల్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఇబాదుల్లా కరీమీ అన్నారు. ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. యుద్ధం జరిగిన పన్నెండేళ్ల తరువాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి తిరిగివెళుతున్న నేపథ్యంలో వారిపై ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం నాటి దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి!
కాబూల్: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు తుపాకి మోతలు, బాంబు పేలుళ్లతో కాబూల్ విమానాశ్రయం దద్దరిల్లింది. విమానాశ్రయంలో నిర్మాణాలో ఉన్న భవనాన్ని ఆధీనంలోకి తెచ్చకున్న తర్వాత గ్రెనేడ్, రాకెట్లు, ఆటోమెటిక్ ఆయుధాలతో దాడి చేశారని అఫ్గనిస్తాన్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఘటన ఉదయం 5.30 నిమిషాలకు జరిగిందని, అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాబూల్ కేంద్రంగా నడిచే అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.