
కాబూల్: తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులు సురక్షితంగా బయట పడ్డారు. తాలిబన్లు ట్రావెల్ డాక్యుమెంట్లు తనిఖీ చేసి భారతీయులను ప్రశ్నించారు. అంతే కాకుండా వారు ఎవరినీ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. కాగా భారతీయుల తరలింపునకు అడుగడుగునా తాలిబన్లు ఆటంకాలు సృష్టించారు. ఆటంకాల మధ్య ఉదయం 87 మందిని భారత్ అక్కడి నుంచి తరలించింది. తాలిబన్లు విడిచిపెట్టిన వారిని త్వరలోనే భారత్‌కు తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
(చదవండి: Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!)