Talibans Kidnapped 150 Indians In Kabul Airport Real Or Fake - Sakshi
Sakshi News home page

తాలిబన్ల దుశ్చర్య.. 150 మంది భారతీయుల కిడ్నాప్‌

Published Sat, Aug 21 2021 1:20 PM | Last Updated on Sun, Aug 22 2021 8:21 AM

150 Indians Picked Up By Taliban In Kabul - Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: ఆరుకోట్లకు అమ్ముడుపోయిన ఆటోగ్రాఫ్‌, ఎవరిదంటే..)

భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌కు చెందిన రిపోర్టర్‌ ఒకరు ట్వీట్‌ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాక్‌ చానెల్‌ ద్వారా చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇక భారతీయ వైమానికి దళానికి చెందిన సీ-130జే విమానం కాబూల్ నుంచి దాదాపు 85 మంది భారతీయులను తరలించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఇండియా వెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
(చదవండి: సూయజ్‌ కాలువ.. ఎవర్‌ గీవెన్‌ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement