
సాక్షి, కాబూల్ : కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు అఫ్ఘన్‌లు మృత్యువాతపడ్డారు. ఎయిర్ పోర్టు వద్ద తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపటంతో తొక్కిసలాట చోటుచేసుకుందని అమెరికన్ సైన్యం వెల్లడించింది. కాగా, కొత్తగా పాలన చేపట్టిన తాలిబన్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద కొన్ని కఠిన ఆజ్ఞలు పెట్టింది. మేయిన్ గేట్ల బయట జనం గుమికూడవద్దని ఆదేశించింది.
ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో అఫ్గన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చింది. వీరిలో 107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గన్ హిందువులు, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్‌టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపుతామని అధికారులు తెలిపారు.