Taliban Condemns US Drone Strike Says 7 Succumbs - Sakshi
Sakshi News home page

Taliban: ‘అమెరికా ఏకపక్ష నిర్ణయం’.. ఖండించిన తాలిబన్లు!

Published Mon, Aug 30 2021 1:54 PM | Last Updated on Tue, Aug 31 2021 12:23 PM

Report: Taliban Condemns US Drone Strike Says 7 Succumbs - Sakshi

జుబీహుల్లా ముజాహిద్‌(ఫైల్‌ ఫొటో)

కాబూల్‌/బీజింగ్‌: కాబూల్‌లో ఆత్మాహుతి బాంబు దాడిని ఛేదించేందుకు  అమెరికా జరిపిన డ్రోన్‌ దాడులను ఖండిస్తున్నట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలతో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అఫ్గనిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ గడువు ముగియనున్న తరుణంలో ఐసిస్‌- ఖోరసాన్‌ గ్రుపు ఇటీవల ఉగ్రదాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కాబూల్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో జరిగిన ఈ వరుస పేలుళ్లలో 100 మందికి పైగా సాధారణ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు. 

ఈ నేపథ్యంలో అమెరికా జవాన్లు లక్ష్యంగా ఆదివారం మరోసారి రాకెట్‌ దాడులు జరిగినట్లు వార్తలు వెలువడగా అమెరికా తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేగాక వాటిని తిప్పికొట్టినట్లు వెల్లడించింది. అదే విధంగా సూసైడ్‌ కారు బాంబర్‌ను పేల్చి వేసే సమయంలో పెద్ద పేలుడు సంభవించిందని, తద్వారా కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

 ఈ క్రమంలో తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ చైనా అధికార టెలివిజన్‌ సీజీటీఎన్‌తో మాట్లాడుతూ.. అమెరికా చర్యను ఖండించారు. తమకు సమాచారం ఇవ్వకుండా దాడులను ఎదుర్కొనే క్రమంలో ఏడుగురు పౌరులు మృతి చెందారని పేర్కొన్నారు.

ఈ మేరకు.. ‘‘ఒకవేళ వారికి అఫ్గనిస్తాన్‌లో ప్రమాదం పొంచి ఉందని భావిస్తే.. మాకు ఆ విషయం చెప్పాల్సింది. అంతేగానీ ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరిగింది’’ అని పేర్కొన్నారు. విదేశీ గడ్డ మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. 

చదవండి: Afghanistan: తాలిబన్‌ ప్రతినిధితో ఇంటర్వ్యూ.. దేశం వీడిన మహిళా జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement