అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వరుస పేలుళ్లతో అట్టుడికిపోతోంది.
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వరుస పేలుళ్లతో అట్టుడికిపోతోంది. తాజాగా అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం ఉదయం భారీ కారుబాంబు పేలడంతో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు.
విమానాశ్రయం సమీపంలో బాబు పేలుడు ఘటనను అఫ్ఘాన్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అఫ్ఘాన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలో లష్కర్ గా వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించారు. పోలీసులు తమ రోజువారీ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా ఈ పేలుడు సంభవించింది.