అస్సాంలో బాంబు పేలుడు | bomb blast in assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో బాంబు పేలుడు

Published Mon, Apr 4 2016 9:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

bomb blast in assam

గోల్పర: అస్సాంలోని గోల్పర జిల్లాలో సోమవారం బాంబుపేలుడు సంభవించింది. దుద్నోయ్లోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబు పేలుడుతో  ఒక్కసారిగా కలకలం రేగింది.

ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement