one dead
-
ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు వారు.. విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదం వారి ఆశలను గల్లంతు చేసింది. వివాహమైన ఐదు నెలలకే భర్తను బలి తీసుకుంది. భార్తను తీవ్రగాయాలపాలు జేసింది. కళ్లెదుటే కట్టుకున్నవాడు విగతజీవిగా పడిఉండడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదిస్తోంది. రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఊటుకూరు సమీపంలోని అశోక్‌గార్డెన్స్(రాజంపేట) వద్ద బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భార్య తీవ్రగాయాల బారిన పడింది. వివరాలిలా ఉన్నాయి.. పుల్లంపేట మండలం (వత్తలూరు) దేవసముద్రం వడ్డిపల్లెకు చెందిన ఊర్సు బీ.హరి(24), చిట్వేలి మండలం వడ్డిపల్లెకు చెందిన శ్రీలేఖతో ఐదునెలల కిందట వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ చిట్వేలి వడ్డిపల్లె నుంచి బైకులో రాజంపేట మండలం గోపమాంబపురం వడ్డిపల్లెకు వస్తుండగా అశోక్‌గార్డెన్ వద్ద లారీ ఢీ కొంది. దీంతో భర్త హరి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రీలేఖకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఐదునెలల క్రితం వివాహం కావడం, ప్రమాదంలో భర్తను కోల్పోవడంతో భార్య పరిస్థితిని చూసిన పలువురు కంటతడి పెట్టారు. కాగా హరి ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
TS: హుస్నాబాద్‌లో కారు బోల్తా.. యువకుడి మృతి
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. ఆదివారం హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై అతివేగంతో అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీచదవండి.. మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
బ్లాక్స్బర్గ్: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్‌బర్గ్ డౌన్‌టౌన్‌లోని మెలోడీ హుక్కా లాంజ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
నంద్యాల సమీపంలో ప్రమాదం
సాక్షి, కర్నూలు: జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే చిక్కుకొని మృతి చెందాడు. మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న నంద్యాల తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. మృతి చెందిన వ్యక్తి నంద్యాల ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ శివ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మృతుని తల్లి వైద్య చికిత్స కోసం కర్నూలుకు వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి నంద్యాలకు వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
వాషింగ్టన్లో కాల్పులు: ఒకరు మృతి
అమెరికా: వాషింగ్టన్లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. పట్టపగలే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ముగ్గురు ఆఫ్రికన్ అమెరికన్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన వాషింగ్టన్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని 14 వీధి, స్పింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసు చీఫ్ పీటర్ న్యూషామ్ తెలిపారు. ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు పెద్ద గన్స్‌ను, మరో వ్యక్తి పిస్టల్‌తో జనాలపై విచక్షణరహితంగా ఆదివారం కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. (24 గంటల్లో 2.6 లక్షల మందికి) ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. పట్టపగలు ఇలా దారుణంగా కాల్పులకు తెగపడటం సమాజంలో భయం కల్పించే దుర్ఘటన అన్నారు. దుండగుల కాల్పులు సంఘంలోని ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. -
విహారంలో విషాదం..
సాక్షి, మలాపురం: విహారంలో విషాదం చోటు చేసుకుంది.నీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు.బక్రీద్ పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. సంతోషంగా విహారం చేద్దామని ఇంటినుంచి బయలుదేరిన 2 గంటల్లోనే ఈ విషాదం చోటుకుంది.ఈ సంఘటనలో షేక్ జాఫర్ హుసేన్ (42) మృతి చెందగా, ఇర్ఫాన్(12), జాకీర్(12), షాహిద్(10) గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన జాఫర్ హుసేన్, సాదకున్ దంపతులు, అదే వీధికి చెందిన హసీన తన ముగ్గురు పిల్లలతో సమీపంలోని పెన్నా నది వద్దకు వన భోజనానికి వెళ్లారు. ఇంటి పక్కనే ఉన్న మరో ఇద్దరు చిన్నారులు జాకీర్, షాహిద్ వస్తామంటే వారిని కూడా పిలుచుకుని పోయారు. బక్రీద్ పండుగ జరిగిన నేపథ్యంలో వారు వనభోజనానికి వెళ్లారు. భోజనం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జాఫర్ హుసేన్ ఈత కొట్టేందుకు నదిలో దిగారు. చిన్నారులు కూడా ఏటి గడ్డన ఉన్న తక్కువ నీటిలో ఆడుకుంటున్నారు. అరగంట తర్వాత జాఫర్ హుసేన్ ఏటీ మధ్యలోకి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయారు. ఈ సంఘటన చూసిన చిన్నారులు మామా.. మామా.. అంటూ కేకలు వేస్తూ నది నీటి ప్రవాహం గురించి తెలియక జాఫర్ వైపునకు వెళ్లారు. వారు కూడా జాఫర్ లాగే నీటిలో కొట్టుకొని పోయారు. అయితే జాఫర్ లుంగీ తగులుకొని కంపచెట్లకు ఆనుకున్నారు. ఈ విషయం చూసిన అక్కడ ఉన్న వారు జాఫర్‌ను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అతను అప్పటికే మృతి చెందారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుడి భార్య జాఫర్ మృతదేహంపై పడి భోరున విలపించింది. మృతునికి ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో కమలాపురం పట్టణంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు నదిలోకి చేరుకున్నారు. చిన్నారుల జాడ కోసం వెతికారు. కానీ ప్రయోజనం లేక పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రగుంట్ల రూరల్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. గల్లంతైన చిన్నారులందరూ రెండో సంతానమే: గల్లంతైన ముగ్గురు చిన్నారులు వారి తల్లిదండ్రులకు రెండో సంతానమే. మాబుఖాన్, హుసేన్ బీల కు ఒక కుమార్తె, ఒక కుమారుడు. జాకీర్ రెండో సంతానం. ఉన్న ఒక్క కుమారుడు గల్లంతు కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. హసీనా, హైదర్‌లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు కాగా, ఇర్ఫాన్ రెండో సంతానం. ఖాదరు, సాబీరున్లకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉండగా షాహిద్ కూడా రెండో సంతానమే. ఎమ్మెల్యే పరామర్శ పెన్నా నదిలో ప్రవాహానికి కొట్టుకొని పోయి మృతి చెందిన జాఫర్ హుసేన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఇలా జరగడం దారుణం అన్నారు. చిన్నారుల గాలింపు చర్యల కోసం పోలీస్ శాఖ, రెవెన్యూ, ఫైర్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. చిన్నారుల ఆచూకీ త్వరలోనే లభిస్తుందన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కళ్ల ముందే కొట్టుకొని పోయాడు నా కొడుకు ఇర్ఫాన్ కళ్ల ముందే కొట్టుకొని పోయాడు. అది చూసి ముగ్గురు పిల్లలు ఆ వైపే వెళ్లారు. వెళ్ల వద్దు.. అని మొత్తుకున్నా వినలేదు.. ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో.. –హసీనా, ఇర్ఫాన్ తల్లి. గారాభంగా పెంచుకున్నాం అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టడంతో గారాభంగా పెంచుకున్నా. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నదివద్దకు వెళ్లకున్నా బాగుండేదని విలపించారు. –మాబుఖాన్, జాకీర్ తండ్రి నా కొడుకు వస్తాడు: నా తమ్ముడు జాఫర్ చనిపోయాడని తెలిస్తే నదివద్దకు వెళ్లాను. అక్కడికి పోయాక తెలిసింది తన కుమారుడు షాహిద్ కూడా గల్లంతైన వారిలో ఉన్నాడని. నా కొడుకు వస్తాడు అనే నమ్మకం ఉంది. –ఖాదరు, షాహిద్ తండ్రి అనవసరంగా వెళ్లాం అనవసరంగా వన భోజనానికి వెళ్లాం. అలా వెళ్లక పోయి ఉంటే బాగుందేది. నా కళ్ల ముందే నా భర్త నీళ్లలో కొట్టుకొని పోయారు. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. –సాదకున్, జాఫర్ హుసేన్ భార్యఉదయం 6 గంటలకే గాలింపు చేపడతాం: దాదాపు మూడు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాం. చీకటి పడటంతో ఆటంకం కలిగింది. ఫైర్ సిబ్బందికి తెప్పలు వచ్చాయి. ఉదయం 6గంటలకే గాలింపు చర్యలు ప్రారంభిస్తాం. గజ ఈత గాళ్లును సిద్ధం చేశాం. చిన్నారుల ఆచూకీ లభ్యం అయ్యే వరకు గాలింపు చర్యలు చేపడతాం. –టీవీ కొండారెడ్డి సీఐ. -
నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: అతి వేగంతో ఓ కారు రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హయత్‌నగర్‌కు చెందిన భవ్యతేజారెడ్డి (27), రహీం(24)లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి కారు(టీఎస్08ఈహెచ్ 9995)ను అతి వేగంగా నడుపుతున్నారు. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వెళ్తుండగా ఆటోనగర్ జింకలపార్కు వద్దకు రాగానే అక్కడ రోడ్డు పక్కన గుడారాల్లో నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో భవ్యాసింగ్ (34) అక్కడికక్కడే మృతి చెందగా, మాన్సింగ్ (25), ఈశ్వర్‌లాల్ (30), రాంసింగ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తితోపాటు గాయపడిన వారంతా రాజస్థాన్‌కు చెందిన వారని, వీరంతా బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారని స్థానికులు తెలిపారు. కారు నడుపుతున్న భవ్యతేజారెడ్డి, రహీంలు మద్యం మత్తులో ఉన్నారని, వారిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుధాకర్ రావు తెలిపారు. క్షతగాత్రుల్లో రాంసింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
నిపాకు మరొకరు బలి
కోజికోడ్: కేరళను వణికిస్తోన్న ‘నిపా’ వైరస్‌తో గురువారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో రాష్ట్రంలో నిపాతో చనిపోయినవారి సంఖ్య 11కు చేరుకుంది. ఈ విషయమై కోజికోడ్ జిల్లా వైద్యాధికారి డా.జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వి.ముసా(61) గురువారం చనిపోయినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) నిపుణులు, ఎయిమ్స్ వైద్యుల బృందం కేరళలో పర్యటిస్తోంది. మరోవైపు, కర్ణాటకలో నిపా లక్షణాలతో శివమొగ్గ జిల్లాలోని సాగర ప్రాంతానికి చెందిన మిదున్(21) ఆస్పత్రిలో చేరారు. -
పేలిన ఆక్సిజన్ సిలిండర్
సిద్దిపేట టౌన్: ఇంట్లో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సిద్దిపేటలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌నగర్‌లో నివాసముండే గోపరి మల్లేశం 35 సంవత్సరాలుగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఇంట్లో చిన్న సిలిండర్లలోకి ఆక్సిజన్ నింపుతుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఈ పనిని పర్యవేక్షిస్తున్న మల్లేశం తల్లి లింగమ్మ(70)కు తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు తెగిపోయింది. అక్కడే ఉన్న ఆమె మనవడు వెంకటేశ్(27) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లింగమ్మ మృతిచెందింది. వెంకటేశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పేలుడు ధాటికి ఇంటిముందు నిలిపిన బైకులు చెల్లాచెదురుగా పడ్డాయి. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను రిటైల్‌గా విక్రయించడంతో పాటు జనావాసంలో నిల్వ ఉంచడం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. గతంలోనూ మూడుసార్లు ఆక్సిజన్ సిలిండర్లు లీకైన సందర్భాలు ఉన్నాయని వారు చెప్పారు. -
కూల్ డ్రింక్ తాగి ముగ్గురు యువకుల అస్వస్థత
-
శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం
-
కన్నడ చానల్ వాహనాన్ని ఢీకొన్న బొలెరో
తుమకూరు: గాయకులతో వెళ్తున్న ప్రైవేట్ చానల్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 15 మంది గాయకులు గాయపడ్డారు. ఈ ఘటన తుమకూరు జిల్లా శిరా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఓ కన్నడ చానల్‌కు చెందిన గాయకుల బృందం టీటీ వాహనంలో వెళ్తుండగా శిరా సమీపంలో ఎస్.పి.డాబా వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో బొలెరో డ్రైవర్ కుమార్(27) మృతి చెందగా చానల్లో వాహనంలోని 15 మంది గాయకులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శిరా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
దైవదర్శనానికి వెళ్తూ మృత్యువాత
అనంతపురం – కదిరిరహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. దైవదర్శనానికివెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముదిగుబ్బ/ బత్తలపల్లి: అనంతపురం పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ గీత, ఆమె భర్త జయరామిరెడ్డి(55), కుమారుడు రోహిత్‌రెడ్డితో కలిసి శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో తిరుపతికి కారులో బయల్దేరారు. రాములు అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక డ్రైవర్ స్థానంలోకి రోహిత్‌రెడ్డి వచ్చాడు. అలా ముందుకు సాగిపోతున్న సమయంలో వీరి కారు ముదిగుబ్బ మండలం రాళ్లనంతపురం క్రాస్– జొన్నలకొత్తపల్లి గ్రామాల మధ్యలోకి రాగానే కదిరి వైపు నుంచి తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన సునీత, రాజశేఖర్‌లు వస్తున్న కారును ఎదురుగా ఢీకొంది. కార్లలో ఇరుక్కుపోయినక్షతగాత్రులు వేగంగా ఢీకొనడంతో రెండు కార్లూ నుజ్జునుజ్జయ్యాయి. ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుదర్శన్‌నాయుడు సంఘటనాస్థలానికి చేరుకొని కార్లల్లోనే ఇరుక్కుపోయిన క్షతగాత్రులు జయరామిరెడ్డి, సూపరింటెండెంట్ గీత, డ్రైవర్ రాములు, సునీతలను స్థానికుల సహకారంతో బయటికి తీశారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులూ అక్కడికి చేరుకుని 108 వాహనంలో వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. జయరామిరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాములు, సునీతలను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఇదిలా ఉండగా రెండు కార్లలోనూ డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎటువంటి గాయాలూ కాకపోవడం గమనార్హం. మృతుడు జయరామిరెడ్డి స్వస్థలం కనగానపల్లి మండలం భానుకోట. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముదిగుబ్బ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి మరొకరు.. పరిగి: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పరిగి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రాంభూపాల్ తెలిపిన మేరకు.. హిందూపురానికి చెందిన లక్ష్మీనరసింహులు (45), శ్రీధర్ మడకశిరలోని ఓ బార్లో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి పనులు ముగించుకొని హిందూపురానికి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరిగిలోని సీతారాంపురం కాలనీ వద్దకు చేరుకోగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే లక్ష్మీనరసింహులు మృతి చెందాడు. శ్రీధర్ కోలుకుంటున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. -
విషాదం వెంట విషాదం..
మెట్పల్లి (కోరుట్ల): గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన సౌదీలో గురువారం జరిగింది. మృతులిద్దరిదీ జగిత్యాల జిల్లా మెట్పల్లి కావటంతో ఇక్కడ విషాదం నెలకొంది. మెట్‌పల్లికి చెందిన యాకుబ్ అలీ(48), అఫ్సర్ జానీ(47) స్నేహితులు. పదిహేనేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లారు. రియాద్‌లో జానీ రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేస్తుండగా, ఆయన వద్ద అలీ పని చేస్తున్నాడు. బుధవారం యాకుబ్ అలీ గుండెపోటుతో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని మెట్‌పల్లికి పంపించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి కారును మరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో జానీ అక్కడికక్కడే మరణించాడు. యూసుఫ్ గాయాలతో బయటపడ్డాడు. -
అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా
సాక్షి, చెన్నై: తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అయ్యప్ప భక్తుల బృందం ప్రయాణిస్తున్న బస్సు శనివారం తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా ఆసనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ భక్తుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన అయ్యప్ప భక్తులు ఇటీవల శబరిమలైకి వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, శనివారం సాయంత్రం ఆసనూరు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. పరిసర ప్రాంతంలో ఉన్న వారు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విల్లుపురం జిల్లా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉళుందూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నూకరాజు అనే భక్తుడు మరణించగా, 30 మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ వారిని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు. -
ముంబైలో కూలిన భవనం, ఒకరు మృతి
ముంబయి : మహారాష్ట్ర ముంబయిలోని బీవండిలో శుక్రవారం ఉదయం ఓ మూడంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఢిల్లీలోని తైమూర్ నగర్లో ఓ భవనం కుప్పకూలింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి
కొల్లాం : కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సమీపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బ్రిడ్జిపై సుమారు 80మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జిపై స్థానికులు రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా స్థానికులు వాకింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోగా, మరికొంతమంది ఇనుపరాడ్ల మధ్య చిక్కుకుపోయారు. ఈత వచ్చినవారు నదిలో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరోవైపు స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి తుప్పు పట్టిందని, మరమ్మత్తులు చేయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు కేఎంఎంఎల్ ఉద్యోగిని శ్యామల (55)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి
-
షికాగోలో కాల్పుల కలకలం
షికాగో(అమెరికా): షికాగో నగరంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతోపాటు మరో ఆరుగురు గాయపడ్డారు. వారికి ఎటువంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. షికాగో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. -
ఓహియో స్టేట్ ఫెయిర్‌లో ప్రమాదం
-
అమర్నాథ్ యాత్రలో విషాదం
కామారెడ్డి: అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు బయల్దేరిన వారి టూరిస్టు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి పట్టణం, రాజంపేట, మద్దికుంట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 30మంది అమర్నాథ్ యాత్రకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. గురువారం సాయంత్రం జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా కుల్‌గా జిల్లా ఖాజీగఢ్ ప్రాంతంలో బస్సులో సిలిండర్ పేలింది. తొమ్మిదిమందికి గాయాలు కాగా, వారు అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సదాశివనగర్ జెడ్పీటీసీ రాజేశ్వర్ రావు ఈ విషయాన్ని జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర అధికారులకు సమాచారం అందించారు. తమ వారి పరిస్థితిపై ఆయా కుటుంబాల వారు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. -
ప్రాణం తీసిన కాలువ స్నానం
భీమడోలు : గోదావరి కాలువలో సరదాగా స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరో యువకుడి కోసం రాత్రి వరకూ గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం దక్కలేదు. ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్మలు కాగా మరో యువకుడు సమీప బంధువు కుమారుడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న చేసిన ప్రయత్నాలు విఫలం కావడమంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయ సమీపంలోని స్నానాల రేవు వద్ద విషాద ఘటనలో ఏలూరు సత్యనారాయణపేటకు చెందిన మండాది దిలీప్‌కుమార్ (18) అనే యువకుడు మరణించాడు. వివరాలిలా ఉన్నాయి.. గుండుగొలనుకు చెందిన మండాది కృష్ణమోహన్ పిల్లల చదువుల కోసం 14 ఏళ్ల క్రితం ఏలూరుకు మ కాం మార్చారు. కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మోహనమురళీ బీటెక్ చదువుకుని భీమడోలులో ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్‌లో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు మండాది దిలీప్‌కుమార్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వారి సమీప బంధువు కుమారుడు 24 ఏళ్ల నేలపూడి మనోహర్ బీటెక్ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మోహనమురళీ రోజూ ఏలూరు నుంచి భీమడోలు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్, మనోహర్ శనివారం బైక్‌పై భీమడోలులో మోహనమురళీ వద్దకు వచ్చారు. సరదాగా గడిపిన వారంతా భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద గల స్నానాల రేవుకు వచ్చి ఫొటోలు దిగారు. కాలువ ఉధృతంగా ప్రవహించడం గుర్తించని ముగ్గురూ స్నానానికి దిగారు. వారిలో మనోహర్ మొదటగా కాలువలో కొట్టుకుపోయాడు. అన్నదమ్ములు మోహనమురళీ, దిలీప్‌కుమార్ కాలువ గట్టువెంబడి కొట్టుకుపోతుండగా మోహనమురళీ బయటపడ్డాడు. అయినా తమ్ముడు దిలీప్‌కుమార్‌ను రక్షించేందుకు మరలా కాలువలో దూకాడు. వీరిద్దరూ కాలువలో కొట్టుకుపోతుండగా ఆలయం వద్ద పనిచేస్తున్న కందుల దుర్గతో పాటు మరో మహిళ కాపాడేందుకు కాలువలోకి చీరలు, తాళ్లు విసిరారు. వీటిద్వారా మోహనమురళీ గట్టుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. కొనసాగుతున్న గాలింపు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. తన కళ్లెదుటే గల్లంతయిన ఇద్దరిని తలుచుకుంటూ మోహనమురళీ రోదించాడు. బోటు, గజ ఈతగాళ్ల సహాయంతో సీఐ ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పీవీబీఎల్ పద్మావతి ఆధ్వర్యంలో ఎస్సై బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. కాలువ అడుగున ఉన్న దిలీప్‌కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. గుండుగొలను, ఏలూరు, భీమడోలు ప్రాంతాల నుంచి బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దిలీప్‌కుమార్ మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మనోహర్ మృతదేహం గాలింపునకు చీకటి అడ్డంకి కావడంతో గజఈతగాళ్లు వెనుదిరిగారు. -
తిరుమల శిలాతోరణం వద్ద విషాదం
-
ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి
-
జనంపైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి
-
డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత ఇంతవరకు క్యూలో నిలబడి గుండెపోటుతో మరణించినవారి విషయాలు తెలిశాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో డబ్బుల కోసం తొక్కిసలాట జరిగి అందులో ఒక వ్యక్తి మరణించాడు. దేవరియా అనే ప్రాంతంలో గల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద పాత నోట్లు మార్చుకోడానికి, కొత్త నోట్లు డ్రా చేసుకోడానికి భారీగా క్యూ ఏర్పడింది. సాయంత్రం బ్యాంకు మూసేసే సమయం ఆసన్నం అవుతున్నా క్యూ లైను ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అందులో ఒక వ్యక్తి మరణించారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ ఘటనలో ఎంతమంది గాయపడిందీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రయాణికుడు బలి
ఏలూరు : డ్రైవర్ నిర్లక్షానికి ఓ ప్రయాణికుడు నిండు ప్రాణం బలైంది. సోమవారం ఉదయం ఏలూరు మండలం మల్కాపురం ఆటోనగర్ వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీను ఆర్టీసి బస్సు ఢీ కొనడంతో ప్రమాదంలో పాలకొల్లు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన జెడ్డు రత్తయ్య(55) మృతి చెందాడు. కండక్టర్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గన్నవరం డిపోకు చెందిన ఏపీ 16 జెడ్ 0063 నెంబర్ గల బస్సు గోపాలపురంకు చెందిన 8 మంది తీర్ధ యాత్రికులు ఉన్న ప్రయాణికులతో ద్వారకాతిరుమల వెళుతోంది. ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆసుపత్రి వద్ద ఏలూరు రోడ్డుపై నిలిచి ఉన్న ఏపీ16, 6955 నెంబర్ లారీని బస్సు డ్రైవర్ డీ కొట్టాడు. దీంతో బస్సులో కండక్టర్ వైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో యాత్ర బందంలోని సభ్యుడైన రత్తయ్య మతి చెందగా ఆయన తమ్ముడు ముత్తయ్య(45)కు చేయి విరిగిపోయింది. మరొక యాత్రికుడు తోట సూరిబాబుకు గాయాలయ్యాయి. మనవుడు పుట్టినరోజు వేడుక కోసం భీమడోలులో అల్లుడు ఇంటికి వెళుతున్న హనుమాన్ నగర్‌కు చెందిన టి జయలక్ష్మీ, గోపాలపురంకు చెందిన లేడీ కండక్టర్ ఎస్ నాగలక్ష్మీతో పాటు మరో ప్రయాణికుడు యాండ్రపు దుర్గారావు గాయపడ్డారు. వీరికి ఆశ్రం ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో సీటీఎం ఎస్ మురళీకష్ణ సంఘటన వద్దకు చేరి పరిస్దితి సమీక్షించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. -
కుప్ప కూలిన బిల్డింగ్: మహిళ మృతి
-
చెన్నై సమీపంలో కాల్పుల కలకలం
-
ట్యూబ్‌లైట్ సరిచేస్తూ వ్యక్తి మృతి
రేగుల్లంక (అవనిగడ్డ) : ఇంట్లో ట్యూబ్‌లైట్ సరిచేస్తూ ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన రేగుల్లంకలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగుల్లంకకు చెందిన ఆరిగ మారయ్య (44) బుధవారం తన ఇంట్లో ట్యూబ్‌లైట్ వెలగకపోవటంతో సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మారయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మారయ్య మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలౖయెన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వీరయ్య(29) మేడ్చల్ పట్టణంలోని బాలాజీనగర్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మండలంలోని పూడూర్‌కు నివాసి మణికుమార్(19)తో కలిసి గ్రామ పరిధిలోని డైమండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురును పండుగ కోసం తీసుకెళ్లేందుకు వీరయ్య మామ వచ్చాడు. దీంతో వీరయ్య, తన మిత్రుడు మణికుమార్ సాయం తీసుకొని రెండు బైకులపై తన భార్యతో పాటు మామను నగరంలోని ఎల్బీనగర్లో వదిలిపెట్టి తిరిగి సోమవారం రాత్రి వీరయ్య ఇంటికి చేరుకున్నారు. అనంతరం వీరయ్య బైక్‌ను ఇంటి వద్ద ఉంచి మణికుమార్ బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక శామీర్‌పేట్ రోడ్డుకు యూటర్న్ తీసుకుంటుండగా నగరం వైపు వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న వీరయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనం నడుపుతున్న మణికుమార్ తలకు తీవ్రగాయాలవగా ఆయనను నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మంగళవారం వీరయ్య మతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్వస్థలానికి తీసుకెళ్లారు. -
లారీ, కంటెయినర్ ఢీ: ఒకరి మృతి
అల్లాదుర్గం (మెదక్ జిల్లా): అల్లాదుర్గం మండల చిల్వెరా గ్రామ శివారులో లారీ, కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ లియాఖత్(31) అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి చిన్నపాటి గాయాలయ్యాయి. మృతుడు లియాఖత్ స్వస్థలం హర్యానా. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
విజయవాడ(ఆటోనగర్) : జవహర్ ఆటోనగర్‌లో లారీ ఢీకొని శనివారం ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కానూరు హరిజనవాడకు చెందిన డొక్కా రామమూర్తి(52) ఆటోనగర్‌లోరాడ్‌బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నారు. రామవరప్పాడు బల్లెంవారివీధి నుంచి ఆటోనగర్ కాటా సెంటర్‌కు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన రామమూర్తి మీదుగా లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు.రామమూర్తికి భార్య, కుమార్తె ఉన్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిని చూసేందుకు వెళుతూ...
చల్లపల్లి/ఘంటసాల : టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బత్తుల వెంకటేశ్వరమ్మ (37) మృతి చెందింది. చల్లపల్లికి చెందిన బత్తుల రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి మొవ్వ మండలం యద్దనపూడి వెళుతున్నారు. ఘంటసాల మండలం చిట్టూ ర్పు కోళ్లఫారాల వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తూ వచ్చిన లారీ వీరి ౖబైక్‌వైపు దూసుకువచ్చింది. ప్రమాదాన్ని గమనించి బైక్‌ను పొదల్లోకి తిప్పేశాడు. లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. వెంకటేశ్వరమ్మకు తీవ్రగాయాలు కాగా చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో రామకృష్ణ డ్రైవర్‌గా, వెంకటేశ్వరమ్మ వంటమనిషిగా పనిచేసేవారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు బయలుదేగా ఈ ప్రమాదం జరిగింది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి
అక్కిరెడ్డిగూడెం(ముసునూరు) : తెలంగాణ ప్రాంతం నుంచి లోడింగ్‌కు వచ్చిన డ్రైవర్ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని మందుల ఫ్యాక్టరీకి లోడింగ్ నిమిత్తం రెండు లారీలు హైదరాబాద్ నుంచి వచ్చాయి. ఫ్యాక్టరీకి సమీపంలోని వలసపల్లి–రమణక్కపేట ప్రధాన రహదారి పక్కనే లారీ డ్రైవర్లు ఇద్దరు నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో బాలిన దేవేందర్(26) మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగి వస్తుండగా తన లారీ సమీపంలోనే గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తలకు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహదేవపూర్ మండలానికి చెందిన బొమ్మపూడి గ్రామ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి తన బంధువులకు అప్పగించి స్వగ్రామానికి పంపినట్లు ఎస్సై తెలిపారు. -
జమ్మూలో మళ్లీ ఘర్షణలు, ఒకరు మృతి
-
జమ్మూలో మళ్లీ ఘర్షణలు, ఒకరు మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉదయం మరోసారి అల్లర్లు చెలరేగాయి. బందిపూరా, బిజ్హీహరా ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భద్రతా దళాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, సుమారు 20మంది గాయపడ్డారు. జూన్ నుంచి కశ్మీర్ లోయలో చెలరేగిన హింసలో ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 80కి చేరింది. కాగా బక్రీద్ పండగ పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ లోయలోని మొత్తం పది జిల్లాలోనూ కర్ఫ్యూ విధించారు. 1990 తర్వాత ఈద్ రోజు కశ్మీర్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉండడం ఇదే తొలిసారి. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆర్మీ అధికారలు సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. కల్లోల పరిస్థితుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి గౌరవార్థం బక్రీద్ పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని వేర్పాటువాదులు సూచించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ బాడీ సమావేశం కూడా జరగనున్నందున... శ్రీనగర్‌లోని భారత్, పాక్ ఐరాస మిలిటరీ అబ్జర్వేషన్స్ ఆఫీసుల వరకు ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మార్చ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ఇంటర్నెట్ సేవలపై ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా 72 గంటలపాటు మొబైల్ సేవలు కూడా నిలిపేశారు. బీఎస్ఎన్ఎల్ మినహా ఇతర టెలికాం నెట్వర్క్ సర్వీసులు నిలిచిపోయాయి. -
అమెరికాలో కాల్పుల కలకలం
టెక్సాస్: పశ్చిమ టెక్సాస్ నగరమైన ఆల్ఫైన్ లో గుర్తు తెలియని వ్యక్తి గురువారం కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక హైస్కూల్ పై దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దుండగుడు పాఠశాలలో దాగి ఉండటంతో స్కూల్ ను మూసేసివుంచినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆల్పైన్ నగరంలోని మిగిలిన పాఠశాలలు సెలవు ప్రకటించాయి. హైస్కూల్ పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న భద్రతాదళాలు.. ఇద్దరు దుండగులు పాఠశాల లోపల ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు నుంచి మూడు సార్లు స్కూలు లోపలి నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
మృతదేహంతో బాధితుల రాస్తారోకో అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆరోపణ గంపలగూడెం : మండలంలోని గాదెవారిగూడేనికి చెందిన వ్యవసాయ కూలీ గాదె నాగరాజు (35) విద్యుదాఘాతంతో బు«ధవారం మృతి చెందాడు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణంగా నాగరాజు చనిపోయాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తిరువూరు–మధిర ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై గంపలగూడెం విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలకు ఆటంకలం ఏర్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గాదె నాగరాజు మిరప మొక్కలు నాటేందుకు పనికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో గాదె వెంకటేశ్వరరావు పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టు వైరును పట్టుకొన్నాడు. వైరుకు విద్యుత్ ప్రసారం అవుతుండటంతో నాగరాజు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఆందోళన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని తీసుకువచ్చి తిరువూరు–మధిర ర హదారిపై ఉంచి ఆందోళన చేశారు. ఘటనకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శివశంకర్ అక్కడకు చేరుకొని ఆందోళన కారులు, విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మృతుడి భార్య గాదె రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కారు ఢీకొని రైతు మృతి
మూలపాడు(ఇబ్రహీంపట్నం) : గుర్తుతెలియని కారు ఢీకొని రైతు మృతి చెందాడు. జాతీయ రహదారిపై మూలపాడు గ్రామం వద్ద ఈసంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కాకి బాబూరావు(55) సైకిల్‌పై పొలం వెళ్తుండగా గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న బాబూరావు సుమారు 5మీటర్ల ఎత్తున ఎగిరి రోడ్డు పక్కన ర్యాంపుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఎస్ఐ కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద స్థలంలో లభించిన కారు రిజిస్ట్రేçషన్ నంబర్ బోర్డును స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ నివాళి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి జోగి రమేష్ రోడ్లు ప్రమాదంలో మరణించిన కాకి బాబూరావు మృతదేహాన్ని సందర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకట చలపతి, పార్టీ నేత మేడపాటి నాగిరెడ్డి ఉన్నారు. 27ఎంవైఎంఐఆర్02: మూలపాడు వద్ద కారుప్రమాదంలో రోడ్డు ర్యాంపు పక్కన మరణించిన కాకి బాబూరావు మృతదేహం -
ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మందుల విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయభ్రాంతులకు లోనయ్యారు. పలువురు ఆసుపత్రి కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. WB: Fire breaks out in the medicines dept of a Govt hospital in Murshidabad, 1 dead, many feared trapped. Two fire tenders at the spot— ANI (@ANI_news) August 27, 2016 -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
విజయవాడ(రైల్వే స్టేషన్) : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలు.. బల్బు క్యాబిన్ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఒక గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉండడంతో గమనించిన ప్రయాణికులు సమాచారం అందించారు. మృతుడికి సుమారు(25) సంవత్సరాలు వయసు, నలుపు రంగు ప్యాంట్ , నీలం రంగు షర్టు ధరించాడని, ఎత్తు 5 అడుగులున్నాడని వివరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మహంకాళీరావు తెలిపారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటనపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. వాంబే కాలనీ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఒక గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం పడి ఉండడంతో గమనించిన ట్రాక్‌మేన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి 70 సంవత్సరాలు వయసు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పూర్ణచందరరావు తెలిపారు. -
ఆటో బోల్తా : ఒకరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా బెల్లంకొండ సమీపంలోశనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. చౌటపాపాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మిరప నారు తీసుకుని బెల్లంకొండకు ఆటోలో బయలుదేరారు. బెల్లంకొండ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపుతప్పి దూసుకువెళ్లిన కారు
ఉల్లిపాలెం(కోడూరు): పుష్కర స్నానం చేసి తిరిగి వెళ్తున్న భక్తుల అంబాసిడర్ కారు అదుపు తప్పింది. కల్వర్టుపై కూర్చున్న వారిపైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన దాసరి వెంకటరమణయ్య(60), కోట ముక్తేశ్వరరావు, పుప్పాల కోటేశ్వరరావు కల్వర్టుపై కూర్చున్నారు. కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఘటనలో వెంకటరమణయ్య పక్కనే డ్రెయిన్‌లో పడి మృతి చెందాడు. ముకేశ్వరరావుకి ఒక కాలు విరిగిపోయింది. కోటేశ్వరరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారులో మొవ్వ గ్రామానికి చెందిన పోలిశెట్టి సుధారాణి, కుటుంబసభ్యులు విజయనాగదుర్గ, తరుణి, గుంటూరుకు చెందిన గనిపిశెట్టి రమాదేవి, మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు అండగా రమేష్‌బాబు.. మృతుడు వెంకటరమణయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు శనివారం రాత్రి రాస్తారోకోకు దిగారు. రమణయ్య మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అవనిగడ్డ సీఐ మూర్తి మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసిన తరువాత మృతదేహాన్ని తీస్తాం.. అంటూ ఆందోళకారులు చెప్పారు. సీఐ మూర్తి ఎంపీపీ మాచర్ల భీమయ్య, డీసీ మాజీ అధ్యక్షుడు గుడిసేవ సూర్యనారాయణకు వారికి నచ్చజెప్పాలని కోరారు. వారు నిరాకరించడంతో సీఐ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. వారు పుష్కర విధుల్లోని 150మంది పోలీసులను పంపారు. పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి విచక్షణరహితంగా కొట్టారు. బాధితులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అండగా నిలిచారు. సీఐ సరిగ్గా సమాధానం చెప్పడంతోఅసహనం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారు. -
మద్యం మత్తులో గలాటా .. ఒకరి మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : మద్యం మత్తులో జరిగిన గలాటా ఒకరి మృతికి కారణమైంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టాఫీసు రోడ్డులోని ఊర్వశి వైన్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో టాక్సీ డ్రైవర్లు సత్తిబాబు, కృపారావు కలిసి రామిశెట్టి శ్రీనివాస్‌తో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో వారిద్దరూ కలిసి శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో శ్రీనివాస్(31) మృతి చెందాడు. మృతుడు పడాల గ్రామ వాసి. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఒక స్వీట్స్ కార్ఖానాలో కూలీగా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు (18నెలలు) ఉన్నారు. దీంతో సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుప్పకూలిన పురాతన భవనం : ఇద్దరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ పురాతన భవనం సోమవారం రాత్రి కుప్పకూలిపోయి.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిలకలగూడ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడ 1940 సమయంలో నిర్మించిన ఓ పాత భవనంలో ఒక చికెన్ షాపు, మరో జిరాక్స్ షాపు ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయంలో జిరాక్స్ షాపును యజమాని మూసేసి వెళ్లిపోయాడు. చికెన్ దుకాణం తెరిచే ఉంది. రాత్రి 9.45 సమయంలో ఆ భవనం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికెన్ దుకాణంలో ఉన్న దాని యజమాని అక్బర్(30), వాజిద్ (25) శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి, గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో.. ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది భయాందోళనకు గురయ్యారు. -
జీపు, బైక్ ఢీ: ఒకరి దుర్మరణం
బషీరాబాద్: జీపు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్ (35), తన స్నేహితుడు రవితో కలిసి సోమవారం రాత్రి బషీరాబాద్‌లోని మద్యం తాగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. బషీరాబాద్ రైల్వేగేట్ సమీపంలో తాండూరు నుంచి బషీరాబాద్‌కు వస్తున్న జీపు, వీరి బైక్ ఢీకొన్నాయి. సంతోష్‌గౌడ్ ఎగిరి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ట్రాక్టర్ బోల్తా.. యువతి మృతి
ఆదిలాబాద్ : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూరు మండలం భూతాయి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కామ్లే జ్యోతి(19) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
విహారయాత్రలో విషాదం
- రాయిచూర్ సమీపంలో కారు బోల్తా - పెద్దమంగళారం యువకుడి దుర్మరణం - మరో ముగ్గురికి తీవ్రగాయాలు మొయినాబాద్ (రంగారెడ్డి) : నలుగురు స్నేహితులు కలిసి వెళ్లిన విహార యాత్ర విషాదాంతమైంది. కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడటంతో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని పెద్దమంగళారానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి(23), శ్రీరాంనగర్ నివాసి జంగం సన్నీ, చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామస్తులు శ్రీరాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు స్నేహితులు. వీరంతా కలిసి ఆదివారం మధ్యాహ్నం మారుతీ జెన్ కారులో విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ సమీపంలో వీరి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కడీలను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన పాటి సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సన్నీ పరిస్థితి విషమంగా ఉంది. సత్యనారాయణ రెడ్డి మృతితో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సత్యనారాయణరెడ్డి మొయినాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
రాళ్లతో కొట్టుకున్న టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తలు
• టీఆర్ఎస్ కార్యకర్త మృతి.. ఎనిమిది మందికి గాయాలు • ఖమ్మం జిల్లా గూడురుపాడులో ఘటన.. పరిస్థితి ఉద్రిక్తం ఖమ్మం రూరల్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్పుల్లో ఏర్పడిన చిన్న గొడవ ముదిరి టీఆర్ఎస్ - సీపీఐ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఓ వర్గంపై మరో వర్గం వారు రాళ్లు రువ్వుకున్నారు, ఒకరినొకరు వెంబడించి కర్రలతో కొట్టుకుని గంట పాటు బీభత్సం సృష్టించారు. ఖమ్మం జిల్లా గూడురుపాడులో జరిగిన ఈ ఘటనలో సత్తి సంగం (60) అనే టీఆర్ఎస్ కార్యకర్త మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. నిప్పు రవ్వలు పడ్డాయంటూ.. గురువారం ఉదయం గ్రామంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ స్థానిక నాయకులు ప్రధాన సెంటర్లో బాణసంచా కాల్చారు. దీనిపై సీపీఐ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిప్పురవ్వలు తమ మీద పడ్డాయని, సమీపంలోని గడ్డివాములపై పడుతున్నాయంటూ టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపట్లోనే ఇరు పార్టీల వారు ఆగ్రహావేశాలతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడ్డారు. దాదాపు గంటసేపు దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో సీపీఐ కార్యకర్తల వైపు నుంచి వచ్చిన ఓ రాయి.. టీఆర్ఎస్ కార్యకర్త సత్తి సంగం ఛాతిపై బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. కొద్దిసేపట్లోనే మరణించాడు. దాడుల్లో మృతుడి సోదరుడు జానకితో పాటు కార్యకర్తలు గోకినపల్లి రామ్మూర్తి, మహేశ్, సైదమ్మ, కుర్రి తిరుపతిరావు, లిక్కి కోటేశ్వరరావు, వై. సతీష్, కె.మారుతిలకు గాయాలయ్యాయి. గంట తర్వాత వచ్చిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొదలైన దాడులు గంట తర్వాత సంగం మృతితో తగ్గాయి. ఈ గొడవ మొదలుకాగానే పోలీసులకు సమాచారం అందినా.. గంట సేపటి వరకూ అక్కడికి చేరుకోలేదు. ఘటన విషయం తెలుసుకున్న ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీ సురేష్‌కుమార్ గూడురుపాడుకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కాగా, దాడులకు పాల్పడ్డ సీపీఐ నేతలు, కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా పక్కకు తొలగించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పరిస్థితి ఉద్రిక్తం సీపీఐ, టీఆర్ఎస్ వర్గాల వారు పరస్పరం దాదాపు గంట పాటు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులకు పాల్పడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంతో ప్రజలు ఏం జరుగుతుందోనని భయకంపితులయ్యారు. ఇళ్లలో వారెవరూ బయటకు రాలేకపోయారు. ఘర్షణ సమయంలో రోడ్డుపై ఉన్నవారు ఎక్కడికక్కడ కిళ్లీ కొట్లు, చిన్న సందుల్లో దాక్కుని.. గొడవ సద్దుమణిగాక ఇళ్లలోకి పరుగులు తీశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సదాశివనగర్(నిజామాబాద్ జిల్లా): సదాశివనగర్ మండలం దగ్గి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయరహదారిపై ఆదివారం ఓ వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. బాధితున్ని హుటాహుటిన కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ చనిపోయాడు. మృతుడు సదాశివనగర్ మండలం భూమిపల్లి గ్రామానికి చెందిన బాలయ్యగా గుర్తించారు. ఇందల్వాయ్ నుంచి స్వగ్రామం భూమిపల్లి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జెయింట్‌వీల్ కూలి ఒకరి మృతి
అమ్యూజ్మెంట్ పార్కులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. సరికొత్త రెయిడ్లతో పిల్లలను ఆకట్టుకునేందుకు పార్కులు పోటీపడుతుంటాయి. ఇలాగే చెన్నైలోని కిష్కింధ ఎమ్యూజ్మెంట్ పార్కులో కొత్తగా డిస్కో జెయింట్‌వీల్‌ను ఏర్పాటుచేశారు. అయితే అది కాస్తా కుప్పకూలి ఒక వ్యక్తి మరణించాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వారందరినీ తాంబరంలోని దీపం ఆస్పత్రికి తరలించారు. కొత్తగా బిగించిన డిస్కో జెయింట్‌వీల్‌ను పరీక్షిస్తున్న సమయంలోనే అది కూలిపోయిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డీసీపీ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన పార్కు యజమాని జోష్ పునిష్, మేనేజర్ శాంతివేలంలను అరెస్టుచేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 337, 304 (2)ల కింద కేసులు నమోదు చేశారు. -
లారీని ఢీకొన్న డీసీఎం వ్యాను, ఒకరి మృతి
హయత్‌నగర్ (హైదరాబాద్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను క్యాబిన్లో ఇరుక్కుని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
గుడిలోకి దూసుకెళ్లిన బైక్: ఒకరు మృతి
ధరూరు (రంగారెడ్డి జిల్లా) : ధరూరు శివారులోని మైసమ్మ గుడిలోకి ఆదివారం సాయంత్రం ఒక ద్విచక్రవాహనం దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా మోటార్‌బైక్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న మైసమ్మ గుడిలోకి దూసుకుపోయింది. మృతుడు పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన అంజయ్య(25)గా పోలీసులు గుర్తించారు. అల్లీపూర్‌కు చెందిన శాంతయ్య అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
న్యాయవాది ‘డ్రంకన్ డ్రైవ్’
బేగంపేట ఫ్లైఓవర్‌పై బొలేరో బీభత్సం బైక్‌ను ఢీ కొట్టడంతో ఒకరి దుర్మరణం.. ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలు హైదరాబాద్: ఓ న్యాయవాది తప్పతాగి మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపించి బీభత్సం సృష్టిం చాడు. ద్విచ్రక వాహనాన్ని ఢీకొట్టి ఒకరి మృతికి కారణమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ చంద్రశేఖర్‌గౌడ్ గురువారం వెల్లడించారు. హైదరాబాద్ రసూల్‌పురాకు చెందిన కె.శ్రీకాంత్(27) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. బుధవారం సాయంత్రం బంజారాహిల్స్‌లో తెలిసినవారి ఇంట్లో బరాత్(పెళ్ళి ఊరేగింపు)కు శ్రీకాంత్ తన స్నేహితులు నరేందర్, శేఖర్లతో కలసి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత బైక్‌పై ఇంటికి వస్తుండగా బేగంపేట్ ఫ్లైఓవర్‌పై బొలేరో వాహనం(డీఎల్ 12సీఏ 4642) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నరేందర్, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఫ్లైఓవర్‌పై దిమ్మెను తాకుతూ వచ్చి అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న పలువురు గమనించి దానిని వెంబడించారు. చివరికి ప్యారడైజ్ వద్ద ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే బొలేరో వాహనం నడుపుతున్న వ్యక్తి సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది రంజన్ అని, అతడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. రంజన్ తాగి, అతివేగంగా డ్రైవ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. న్యాయవాదే తప్పతాగి డ్రైవ్ చేసి ఒకరు మృతికి కారణం కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తుండగా, అదే న్యాయస్థానంలో పనిచేసే న్యాయవాదే తాగి డ్రైవ్ చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద రంజన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబం ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ మీదనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అతని భార్య శ్రీదేవి, ఇద్దరు చంటి పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్నే నింపింది. ఆ చిన్నారులు నాన్న ఏడని అడిగితే ఏం చెప్పాలంటూ భార్య శ్రీదేవి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. చంటి బిడ్డలను భుజాన వేసుకుని ఇక తమకు దిక్కెవరంటూ విలపించడం కంటతడి పెట్టించింది. తమను కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక న్యాయవాది తప్పిదం ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టింది. గాయపడ్డ నరేందర్ జాతీయస్థాయి బాక్సింగ్ ప్లేయర్ ప్రమాదంలో గాయపడ్డ నరేందర్ బాక్సింగ్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉంది. జాతీయస్థాయి టోర్నమెంట్లలో సైతం పాల్గొన్నాడు. తను రాయాల్సిన గురువారంనాటి పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు గాయం కారణంగా దూరమయ్యాడు. -
అస్సాంలో బాంబు పేలుడు
గోల్పర: అస్సాంలోని గోల్పర జిల్లాలో సోమవారం బాంబుపేలుడు సంభవించింది. దుద్నోయ్లోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబు పేలుడుతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వ్యవసాయబావిలో బోల్తా పడిన ట్రాక్టర్
కథలాపూర్: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ శివారులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ పక్కన కూర్చోగా, మహారాష్ట్రకు చెందిన కూలీ ట్రాక్టర్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంజన్ భాగం బావిలో బోల్తా కొట్టి ఇరుక్కుపోవడంతో దాన్ని నడుపుతున్న కూలీ నీళ్లలో మునిగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ ఇంజన్‌ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. -
గొడ్డలితో దాడి: ఒకరు మృతి
మైలవరం: వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలివీ... గ్రామానికి చెందిన ఉడుమల శంకర్(48), లక్ష్మీనర్సయ్యల కుటుంబాలకు ఇంటి స్థలం విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం వారు ఘర్షనకు దిగారు. లక్ష్మీనారాయణ గొడ్డలితో శంకర్‌పై దాడి చేయటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కోవెలకుంట్ల సమీపంలోకి వెళ్లేసరికి చనిపోయాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బకు వృద్ధుడి మృతి
సత్యవేడు : రోజురోజుకు మండుతున్న ఎండలు ప్రాణాలను హరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో వడదెబ్బ తగిలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. వరదయ్యపాళెం మండలం వడ్డిపాళెంకు చెందిన కె.సుందరయ్య (72) రెండు రోజుల క్రితం పొలం నుంచి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
మరోసారి స్వైన్‌ఫ్లూ కలకలం
హైదరాబాద్ : నగరంలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరిన ముగ్గురు యువకులకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. వారిలో సుమన్(23) అనే యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. వినీత్(28), శ్రీనివాస్(22)ల పరిస్థితి విషమంగా ఉంది. -
నల్లగొండ జిల్లాలో కత్తులతో దాడులు : ఒకరి మృతి
సూర్యాపేట: తన సోదరిను కొందరు ఆకతాయిలు ఆటపట్టిస్తుండటంతో.. ఓ అన్నయ్య తన స్నేహితులతో కలిసి వారిని మందలించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాజు సోదరి మిషన్ నేర్చుకోవడానికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెను ఆట పట్టిస్తుండటంతో.. ఆమె విషయాన్ని తన అన్నకు చెప్పింది. దీంతో రాజు తన స్నేహితుడు ఉపేందర్(22)తో కలిసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం అనంతరం కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రాజు స్నేహితుడు ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ...
మృత్యు ఒడిలోకి.. ఆటో బోల్తాపడి ఒకరి మృతి పలువురికి గాయాలు డ్రైవర్ అజాగ్రత్తే {పమాదానికి కారణం బాధితులు కరీంనగర్ వాసులు బచ్చన్నపేట : ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడిన సంఘటన మండలంలోని తమ్మడపల్లి శివారు వద్ద సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీనివాసరావు కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన గుంటుకు భారతి(53), జిందం ఉమ-లక్ష్మణ్ దంపతుల కూతురు విశాల, వేములవాడ సత్యనారాయణ కలిసి మహాశివరాత్రి సందర్భంగా కొడవటూరు శ్రీసిద్ధేశ్వర స్వామిని దర్శించుకుందామని బయల్దేరారు. కరీంనగర్ నుంచి జనగామకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి కొడవటూరు వెళ్లేందుకు మచ్చ రామనర్సయ్యకు చెందిన ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తమ్మడపల్లి గ్రామసమీపంలోకి రాగానే డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఆటో రోడ్డు పక్కకు దూసుకపోయి పెద్ద పుట్ట గడ్డ ఎక్కి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన గుంటుకు భారతి తలకి తీవ్ర గాయాలు కాగా జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆటోలో కూర్చున్న ఉమకు రెండు కాళ్లు విరిగాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
తేనెటీగల దాడిలో భర్త మృతి: భార్యకు గాయాలు
సీలేరు (విశాఖ జిల్లా) : తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా సీలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుప్పలవాడ గ్రామం గొందివీధికి చెందిన భార్యాభర్తలు కొర్ర ధను(50), కొర్ర కుంద్రి(46)లపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో తీవ్రగాయాలపాలైన భర్త ధను కాసేపటికే మృతిచెందాడు. భార్య కుంద్రిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు ఢీ: యువకుడు మృతి
హైదరాబాద్ : కార్ఖాన బీఆర్వో జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో డి.సత్యనారాయణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఏపీ11 జెడ్ 6456 నంబరు బస్సు ఢీకొంది. బస్సు ముందు చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
పెళ్లి చేసుకుని వెళ్తుండగా రోడ్డుప్రమాదం
బొబ్బిలి (విజయనగరం జిల్లా) : శనివారం రాత్రి బొబ్బిలిలో పెళ్లి చేసుకుని.. ఆదివారం ఉదయం కారులో ప్రయాణమైన నవదంపతులతో సహా బంధువులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వివాహం అనంతరం ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందం కారులో ప్రయాణమైంది. అయితే బొబ్బిలి శివార్లలో ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని పెళ్లి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఎం. అప్పలనాయుడు(40) అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న నవదంపతులతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రొంపెల్లి గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. గాయపడినవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
మల్యాల (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మాల్యాల మండల సమీపంలోని కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతురాలు వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం హెచ్ఆర్ కోటకు చెందిన లచ్చమ్మ(50)గా గుర్తించారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు
వరంగల్: భద్రాచలంలోని రాములవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామ శివారులో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన బంగారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి కారులో భద్రాచలం బయలుదేరారు. ఈ క్రమంలో మంగపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చుంచుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే.... కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పుష్పమ్మ(68) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కాచెల్లెళ్లను కాటేసిన పాము: చెల్లెలు మృతి
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. చెల్లెలు మృతి చెందింది. ప్రస్తుతం అక్క పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన అబ్దుల్, ఫాతిమా దంపతుల కూతుళ్లు సనాబేగం(6), సౌలీబేగం(3)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. సౌలీబేగం మృతిచెందింది. సనాబేగంను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి, నలుగురికి గాయాలు
మఠంపల్లి (నల్గొండ జిల్లా) : మఠంపల్లి మండలం రఘనాథపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం గ్రామంలో మొక్కలు నాటేందుకు 40 మంది కూలీలు మఠంపల్లి నుంచి ట్రాక్టర్లో బయలుదేరారు. రఘనాథపాలెం వద్ద ట్రాలీ వెనుక డోర్ ఊడి కింద పడటంతో దానిపై కూర్చున ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేకలవీరయ్య(55) అనే వ్యక్తి మరణించాడు. గాయపడ్డ నలుగురిలో ఇద్దరు ఖమ్మంలో, మరో ఇద్దరు హుజూర్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు. -
రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి
పాములపాడు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జూపాడు బంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన రాజు (43) సంక్రాంతి పండుగ సందర్భంగా రుద్రవరంలోని అత్తగారింటికి బైక్‌పై వెళుతున్నాడు. అత్తగారింటికి చేరుకునేలోపే... గ్రామ శివార్లలో ఎదురుగా వచ్చిన ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో బైక్‌పై ప్రమాదానికి కారణమైన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కుంట గ్రామానికి చెందిన రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. -
రోడ్డుప్రమాదం: భార్య మృతి,భర్తకు గాయాలు
పలాస (శ్రీకాకుళం) : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. ముందు వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగడంతో దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ మృతిచెందగా.. ఆమె భర్త సహా ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొబ్బరిచెట్లూరు సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మొగిలిపాడు నుంచి బైక్ పై పూజానగరం వెళ్తున్న దంపతులు కొబ్బరిచెట్లూరు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డుపైన ఆగిపోవడంతో.. దాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుధ (35) అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు పిల్లలతోపాటు భర్తకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలకేంద్రంలోని చిలకలూరిపేట వెళ్లే రోడ్డులో వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం ఓ కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు,బైక్ ఢీ: యువకుడి మృతి
పుల్లలచెరువు (ప్రకాశం జిల్లా): పుల్లలచెరువు మండలం సుద్దపురవతండా వద్ద శనివారం ఓ స్కూలు బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్(17) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కీర్తి సాయికుమార్ (19), సింగిరెడ్డి దినేష్‌రెడ్డి (19), ఇప్పాలపల్లి హరీష్ (21)లు ఒకే బైక్‌పై టేకుల సోమారం గ్రామానికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్‌రెడ్డి, హరీష్‌లకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. -
స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి
బత్తలపల్లె (అనంతపురం) : మలుపు తిరుగుతున్న బస్సును వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం రాఘవంపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నగరం భరత్‌నగర్‌కు చెందిన ప్రమోద్(25) మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తూ మలుపు తిరుగుతున్న ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎస్సై హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా..ఒకరి మృతి
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం జొనగ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జొనగ గ్రామానికి చెందిన సవర కడాయి(26) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
చౌటుప్పల్: నల్గొండ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మరణించగా, భార్యకు తీవ్ర గాయలయ్యాయి. చౌటుప్పల్ మండలం మందలగూడెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ నుంచి వేగంగా వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగోజీ గూడ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(48) అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన భార్య ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఈశ్వరమ్మను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
కూడేరు (అనంతపురం) : బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘట మంగళవారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కమ్మకు గ్రామంలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న బాబారావు నాయక్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. -
బాంబు పేలుళ్లతో అట్టుడికిన కాబూల్
-
బాంబు పేలుళ్లతో అట్టుడికిన కాబూల్
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వరుస పేలుళ్లతో అట్టుడికిపోతోంది. తాజాగా అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం ఉదయం భారీ కారుబాంబు పేలడంతో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. విమానాశ్రయం సమీపంలో బాబు పేలుడు ఘటనను అఫ్ఘాన్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అఫ్ఘాన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలో లష్కర్ గా వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించారు. పోలీసులు తమ రోజువారీ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా ఈ పేలుడు సంభవించింది.