!['రాజుగారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి](/styles/webp/s3/article_images/2017/09/3/81446200941_625x300.jpg.webp?itok=LsBHBxl2)
'రాజుగారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి
చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : వినోదం కోసం థియేటర్కు వెళ్లిన ఓ వ్యక్తి హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన తెలుగు హారర్ సినిమా 'రాజు గారి గది' చూస్తూ ప్రేక్షకుడు మృతి చెందాడు.
నగరంలోని బహదూర్‌పురా పరిధిలోని మెట్రో థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు వెళ్లిన అమర్‌నాథం(55) అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.