
మెట్‌పల్లి (కోరుట్ల): గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన సౌదీలో గురువారం జరిగింది. మృతులిద్దరిదీ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కావటంతో ఇక్కడ విషాదం నెలకొంది. మెట్‌పల్లికి చెందిన యాకుబ్ అలీ(48), అఫ్సర్ జానీ(47) స్నేహితులు. పదిహేనేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లారు. రియాద్‌లో జానీ రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేస్తుండగా, ఆయన వద్ద అలీ పని చేస్తున్నాడు. బుధవారం యాకుబ్ అలీ గుండెపోటుతో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని మెట్‌పల్లికి పంపించేందుకు గురువారం ఉదయం జానీ, అతడి బంధువు యూసుఫ్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి కారును మరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో జానీ అక్కడికక్కడే మరణించాడు. యూసుఫ్ గాయాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment