నందవరం (కర్నూలు) : పొలంలో పని చేస్తున్న వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం చిన్నకొత్తిరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్ద జంబయ్య(49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు.