nandavaram
-
ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా మారి
సాక్షి, మర్రిపాడు: ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మండలంలోని నందవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లి అక్కడ ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాలు.. నందవరం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి – జానీబేగం దంపతుల 3వ కుమారుడు షేక్ ఖాజాగరీబ్ నవాజ్(22) కువైట్‌లోని ఫెర్దోస్ పట్టణంలో ఉన్న గ్రేన్ కోసుర్ ఏరియాలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి) రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లిన నవాజ్ అక్కడ ఇళ్లలో పూల మొక్కల పెంపకం పనులు చేసుకుంటూ సంపాదించిన నగదును ఇంటికి పంపుతూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. తరచూ ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడే నవాజ్ మంగళవారం కూడా వారితో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బుధవారం ఉదయం అతను ఉంటున్న ఇంటి సమీపంలో రేకుల షెడ్లో నవాజ్ ఉరేసుకుని మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నవాజ్‌తోపాటు అక్కడ పనుల కోసం వెళ్లిన మరికొంతమంది ఈ విషయం తెలియజేశారు. అందరూ నిద్రపోయిన తరువాత నవాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాస్పదంగా ఉందంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవాజ్ మృతదేహానికి అక్కడే గురువారం పోస్టుమార్టం నిర్వహించారని, శనివారానికి మృతదేహం స్వగ్రామానికి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నవాజ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం మండలం హాలహర్వి బస్టాప్ వద్ద నిలిచి ఉన్న అయిల్ ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బాధితులు కర్ణాటక రాయచూర్ జిల్లాలోని ఎరిగేరి దర్గా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ఈ ప్రమదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
కర్నూలు(లీగల్): మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఎమ్మిగనూరు తాలూకా సర్కిల్ పరిధిలోని నందవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివీ. నందవరంలో పదవ తరగతి చదువుతున్న బాలిక 2014 జనవరి 17న పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడం తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. 23వ తేదీన బాలిక తన తల్లిదండ్రులతో వచ్చి తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘‘మా ఇంటి ఎదురుగా ఉంటున్న హరిజన శవాల శాంతిరాజు నీవంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానన్నాడు. 17వ తేదీ పాఠశాల ప్రహరీ వద్ద నిల్చున్న నన్ను ఎమ్మిగనూరు జాతరలో కొత్త బట్టలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోదరుడైన హరిజన శవాల ఆదాం ఆటోలో తీసుకెళ్లాడు. ఎమ్మిగనూరు బస్టాండ్‌లో నన్ను బెదిరించి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌కు.. అక్కడి నుంచి గుర్తు తెలియని గ్రామం సమీపంలోని ప్రభుత్వ భవనంలోకి తీసుకెళ్లి హరిజన శవాల శాంతిరాజు 22వ తేదీ వరకు గదిలో నిర్బంధించి అత్యాచారం చేశారు. 22వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరు బస్టాండ్‌లో వదిలి నందవరానికి వెళ్లిపొమ్మని చెప్పారు.’’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా మరుసటి రోజు తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కిడ్నాప్, నిర్భయ చట్టం, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హరిజన శవాల శాంతిరాజు, హరిజన శవాల ఆదాంపై నందవరం పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు. -
నడిరోడ్డుపై కారు దగ్ధం
నందవరం: కర్నూలు జిల్లా నందవరం మండలం ఆలహర్వి దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఎండధాటికే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. -
వైభవం.. జ్యోతి మహోత్సవం
నందవరం(బనగానపల్లె రూరల్) : గ్రామంలోని చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, రథ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం ఆలయ ఈఓ రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి భాస్కరయ్య ఆచారి ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవి అమ్మవారికి దిష్టి చుక్కపెట్టు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయ ఆవరణ నుంచి జ్యోతి మహోత్సవం నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చౌడేశ్వరిదేవి భక్తులు, తొగట వీరక్షత్రియులు అవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం పాకంతో తయారు చేసిన సుమారు 460 జ్యోతులను తలపై పెట్టుకుని చౌడేశ్వరిదేవి భక్తిగీతాలు పాడుతూ, కాళిక నృత్యం చేసుకుంటూ అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. భక్తులు గుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారికి పట్టుచీర, నైవేద్యం సమర్పించారు. పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం(పోవడం) జరిగింది. గ్రామంలోని ఆలయ ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. -
చౌడేశ్వరిదేవిదేవి ఉత్సవాలు ప్రారంభం
నందవరం(బనగానపల్లె రూరల్): మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శక్తిమాత చౌడేశ్వరిదేవి మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ఈవో రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు రాయబారాది, జ్యోతి రథ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. చెరువుపల్లె, తిమ్మాపురం, జిల్లెల్ల, నందవరం గ్రామాల నుంచి భక్తులు పన్నేరపు బండ్లపై ఆలయానికి చెరుకొని చౌడేశ్వరిదేవికి మొక్కులు తీర్చుకున్నారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు
నందవరం(బనగానపల్లె రూరల్): గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, మహోత్సవాలు బుధవారం నుంచి ఏప్రిల్ 4 వరకు ఉంటాయని ఆలయ కార్య నిర్వాణాధికారి రామానుజన్ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి అంకురార్పణ, పంచాగ శ్రవణం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పన్నేరపు బండ్లు తిప్పడం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాల సందర్భంగా పాణ్యం సీఐ పార్థసార««థిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్లు నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. -
పాముకాటుతో వ్యక్తి మృతి
నందవరం (కర్నూలు) : పొలంలో పని చేస్తున్న వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం చిన్నకొత్తిరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్ద జంబయ్య(49) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
నందవరం : ఆడపడుచుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన సారమ్మ(19) నందవరంకు చెందిన రాముడు అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఆడపడుచుల వేధింపులతో విసిగిపోయిన సారమ్మ ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. -
పాముకాటుతో విద్యార్థిని మృతి
నందవరం(కర్నూలు) : ఇంట్లో నిద్రిస్తున్న బాలిక పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం హెచ్.బాపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. హెచ్.బాపురం గ్రామానికి చెందిన శిరీష(8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకున్న బాలిక ఆదివారం ఉదయం నురుగులు కక్కుతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. పాము కాటు వేయడంతోనే బాలిక మృతిచెందిందని వైద్యులు తెలిపారు. -
ఆటో బోల్తా : విద్యార్థి మృతి
నందవరం (కర్నూలు) : పాఠశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం టి. సోమలగూడూరు శివారులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శివ(12) అనే విద్యార్థి ఎమ్మిగనూరు మండలం దైవందిన్న గ్రామంలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా రోజూలానే గురువారం ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఆటో గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శివ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
విష జ్వరంతో బాలుడి మృతి
నందవరం: ముగతి గ్రామంలో వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్న స్టిఫెన్(4) అనే బాలుడు బుధవారం కోలుకోలేక మృతి చెందాడు. గ్రామానికి చెందిన గోపాల్, మంగమ్మ దంపతుల రెండో కుమారుడు స్టిఫెన్‌కు వారం రోజుల కిందట జ్వరం సోకింది. రెండు రోజులుగా స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో బాలుడ్ని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించగా కోలుకోలేక చివరకు మృత్యువాత పడ్డాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రెండు రోజుల క్రితం శివన్న అనే వ్యక్తి డెంగీ లక్షణాలతో మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో బాలుడిని విష జ్వరం బలిగొనడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం
-
విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం
కర్నూలు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఎత్తుకుపోయి ఇద్దరు దుండగులు ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది. నిందితులు శాంతరాజు, ఆదాం.. ఈ నెల 17న టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేశారు. ఆమెను నిర్బంధించి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ అకృత్యం వెలుగు చూడడంతో నిందితులిద్దరిపై నందవరం పోలీసు స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.