
విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం
కర్నూలు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఎత్తుకుపోయి ఇద్దరు దుండగులు ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది. నిందితులు శాంతరాజు, ఆదాం.. ఈ నెల 17న టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేశారు.
ఆమెను నిర్బంధించి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ అకృత్యం వెలుగు చూడడంతో నిందితులిద్దరిపై నందవరం పోలీసు స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.