
కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం మండలం హాలహర్వి బస్టాప్ వద్ద నిలిచి ఉన్న అయిల్ ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. బాధితులు కర్ణాటక రాయచూర్ జిల్లాలోని ఎరిగేరి దర్గా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పడంతో ఈ ప్రమదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment