చౌడేశ్వరిదేవిదేవి ఉత్సవాలు ప్రారంభం
చౌడేశ్వరిదేవిదేవి ఉత్సవాలు ప్రారంభం
Published Wed, Mar 29 2017 10:10 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM
నందవరం(బనగానపల్లె రూరల్): మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శక్తిమాత చౌడేశ్వరిదేవి మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ఈవో రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు రాయబారాది, జ్యోతి రథ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. చెరువుపల్లె, తిమ్మాపురం, జిల్లెల్ల, నందవరం గ్రామాల నుంచి భక్తులు పన్నేరపు బండ్లపై ఆలయానికి చెరుకొని చౌడేశ్వరిదేవికి మొక్కులు తీర్చుకున్నారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement