నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు
నేటి నుంచి చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు
Published Tue, Mar 28 2017 10:28 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM
నందవరం(బనగానపల్లె రూరల్): గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, మహోత్సవాలు బుధవారం నుంచి ఏప్రిల్ 4 వరకు ఉంటాయని ఆలయ కార్య నిర్వాణాధికారి రామానుజన్ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి అంకురార్పణ, పంచాగ శ్రవణం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పన్నేరపు బండ్లు తిప్పడం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. చౌడేశ్వరిదేవి జ్యోతి ఉత్సవాల సందర్భంగా పాణ్యం సీఐ పార్థసార««థిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్లు నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement